Photo Credit: Samsung
Samsung Galaxy S25 మరియు Galaxy S25+ Android 15లో One UI 7తో రన్ అవుతాయి.
ఈ ఏడాది జరిగిన మొదటి Galaxy అన్‌ప్యాక్డ్ ఈవెంట్‌లో Samsung Galaxy S25, Galaxy S25+ లను కంపెనీ పరిచయం చేసింది. ఈ హ్యాండ్‌సెట్‌లు 12GB RAMతో అటాచ్ చేయబడిన కస్టమ్ Snapdragon 8 Elite for Galaxy ప్రాసెసర్‌తో అమర్చబడి ఉంటాయి. అలాగే, ఆర్ట్‌ఫియల్ ఇంటిల్‌జెన్సీ(AI) ఆధారిత Galaxy AI ఫీచర్‌లకు సపోర్ట్ చేస్తాయి. వీటిని 50-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాతో కూడిన ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌తో రూపొందించారు. ఇవి కంపెనీ One UI 7 ఇంటర్‌ఫేస్‌తో Android 15 అవుట్-ఆఫ్-ది-బాక్స్‌లో రన్ అవుతాయి.
Galaxy S25 సిరీస్‌లో Now Brief, Night Video with Audio Eraser వంటి ఫీచర్స్ ఉన్నాయి. Galaxy S25 సిరీస్ ఏడు సంవత్సరాల OS, సెక్యూరిటీ అప్‌డేట్‌లను పొందనుంది. Galaxy S25 ఐసీ బ్లూ, మింట్, నేవీ, సిల్వర్ షాడో కలర్ ఆప్షన్లలో విక్రయించబడుతుంది. ఇప్పటికే ప్రీ-ఆర్డర్‌కు అందుబాటులో ఉండగా, ఫిబ్రవరి 7 నుండి USలో అమ్మకానికి రానున్నాయి. 12GB RAM, 128GB స్టోరేజ్ కలిగిన బేస్ మోడల్ Galaxy S25 ధర $799 (సుమారు రూ. 69,100) నుండి ప్రారంభమవుతుంది. భారత్‌లో ధర రూ. 80,999గా ఉంది. Galaxy S25+ 12GB RAM, 256GB ఇన్‌బిల్ట్ స్టోరేజ్ కలిగిన బేస్ మోడల్ ధర $999 (సుమారు రూ. 86,400)గా ఉంది. భారతదేశంలో ధర రూ. 99,999 నుండి ప్రారంభమవుతుంది.
పై రెండు మోడల్స్ 256GB, 512GB స్టోరేజ్ వేరియంట్‌లలో అందుబాటులో ఉన్నాయి. అయితే, Galaxy S25 128GB ఆప్షన్‌లోనూ వస్తుంది. Galaxy S25 6.2-అంగుళాల ఫుల్-HD+ (1,080×2,340 పిక్సెల్‌లు) డైనమిక్ AMOLED 2X స్క్రీన్‌ను 120Hz రిఫ్రెష్ రేట్, 2,600nits పీక్ బ్రైట్‌నెస్‌తో వస్తుంది. Galaxy S25+ స్టాండర్డ్ మోడల్‌లా అదే రిఫ్రెష్ రేట్, పీక్ బ్రైట్‌నెస్‌తో పెద్ద 6.7-అంగుళాల (1,440x3,120 పిక్సెల్‌లు) డైనమిక్ AMOLED 2X డిస్‌ప్లేను కలిగి ఉంది.
ఈ రెండూ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉన్నాయి. ఇందులో 50-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 12-మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ కెమెరా, ముందు భాగంలో 12-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉన్నాయి. దుమ్ము, నీటి నియంత్రణ కోసం IP68 రేటింగ్ ఉంది. వీటిలో సెక్యూరిటీ నిమిత్తం బయోమెట్రిక్ ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్ ఉంది.
Galaxy S25లో 4000mAh బ్యాటరీని అందించారు. దీనిని 25W వద్ద ఛార్జ్ చేయవచ్చు. Galaxy S25+ 45W ఛార్జింగ్ సపోర్ట్‌తో 4900mAh బ్యాటరీని కలిగి ఉంది. ఈ రెండు ఫోన్‌లు ఫాస్ట్ వైర్‌లెస్ ఛార్జింగ్ 2.0 (15W), రివర్స్ వైర్‌లెస్ ఛార్జింగ్ కోసం వైర్‌లెస్ పవర్‌షేర్‌కు సపోర్ట్ చేస్తాయి. Galaxy S25 మోడల్ 146.9×70.5×7.2mm పరిమాణంతో 162 గ్రాముల బరువు, ప్లస్ మోడల్ 158.4×75,8×7.3mm పరిమాణంతో 190 గ్రాముల బరువు ఉన్నాయి.
ప్రకటన
ప్రకటన