ప్రముఖ స్మార్ట్ ఫోన్‌ల తయారీ కంపెనీ OnePlus తన OnePlus 13 మోడల్ గత ఏడాది డిసెంబర్‌లో చైనాలో లాంచ్ చేసిన OnePlus 12కి కొనసాగింపుగా తీసుకువస్తున్నట్లు మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. ఈ హ్యాండ్‌సెట్‌కు సంబంధించి పలు ఆసక్తికరమైన విషయాలు గత కొన్ని వారాలుగా మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఆప్పటికే దీని ప్రాసిసర్, డిస్‌ప్లే, కెమెరా, బ్యాటరీ, ఛార్జింగ్ కెపాసిటీ వంటి వివరాలతో సహా ఫోన్ యొక్క స్పెషిఫికేసన్స్ గతంలోనే లీక్ చేయబడ్డాయి. తాజాగా లాంచ్ టైమ్‌లైన్, ధర పరిధి, స్మార్ట్‌ఫోన్ డిజైన్‌లో మార్పులు వంటివి బయటకు వచ్చాయి. టిప్‌స్టర్ బ్యాటరీ, ఛార్జింగ్, కెమెరా లాంటి కొన్ని కీలకమైన వివరాలను వెల్లడించింది.
టిప్‌స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ వీబో పోస్ట్ ప్రకారం.. OnePlus 13లో 6,000 ఎంఏహెచ్ సామర్థ్యం ఉన్న బ్యాటరీని అందించనున్నట్లు భావిస్తున్నారు. అలాగే, ఈ స్మార్ట్‌ఫోన్ 100W వైర్డు, 50W వైర్‌లెస్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుందని తెలిపింది. OnePlus 13 హ్యాండ్‌సెట్ 50 మెగాపిక్సెల్ సోనీ LYT-808 కెమెరా సెన్సార్ F/1.6 ఎపర్చర్‌తో రావొచ్చు. O916T హాప్టిక్ మోటారుతో వస్తుందని ప్రచారంలో ఉంది. ఈ ఫీచర్స్ ప్రస్తుత OnePlus 12 మోడల్‌తో పోల్చినప్పుడు దాదాపు సమానంగానే ఉంటాయి.
OnePlus 13 వెనుక కెమెరా మాడ్యూల్‌లో 50 మెగాపిక్సెల్ సెన్సార్ అల్ట్రా-వైడ్ లెన్స్‌తో, 3x ఆప్టికల్ జూమ్‌తో 50 మెగాపిక్సెల్ పెరిస్కోప్ టెలిఫోటో షూటర్ ఉండవచ్చునని గతంలో వచ్చిన లీకుల ఆధారంగా చెప్పవచ్చు. దీంతోపాటు క్వాలిటీ సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 32 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరాను అందించనున్నట్లు భావిస్తున్నారు. ఇది స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 4 ప్రాసెసర్‌తో శక్తిని పొందుతుంది. అలాగే, 5జీ నెట్ వర్క్ సపోర్ట్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్, దుమ్ము మరియు నీటి నిరోధకత కోసం IP69- రేటెడ్ బిల్డ్‌తో వస్తుంది. భద్రత కోసం ఇది అల్ట్రాసోనిక్ ఫింగర్ ఫ్రింట్ స్కానర్‌ను అందించవచ్చు.
స్నాప్‌డ్రాగన్ 8 Gen 3 ప్రాసెసర్‌తో..
OnePlus 13 ఈ ఏడాది అక్టోబర్ లేదా నవంబర్ మధ్య లాంచ్ అవుతుందని గత నివేదికల ఆధారంగా తెలిసింది. హ్యాండ్‌సెట్ సర్కిలర్ కెమెరా మాడ్యూల్‌ను కలిగి ఉండకపోవచ్చు కాని OnePlus 12 మాదిరిగానే లెన్స్‌తో వస్తుంది. మునుపటి మోడల్ మాదిరిగానే దీని ధర నిర్ణయించబడుతుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. మన దేశంలో ఈ ఏడాది జనవరిలో లాంచ్ అయిన OnePlus 12 ప్రారంభ ధర బేస్ 12GB + 256GB వేరియంట్ రూ. 64,999గా ఉంది. ఇది 6.82-అంగుళాల క్వాడ్-హెచ్‌డి+ (1,440 x 3,168 పిక్సెల్స్) LTPO 4.0 AMOLED స్క్రీన్‌ను కలిగి ఉంది. అలాగే, స్నాప్‌డ్రాగన్ 8 Gen 3 ప్రాసెసర్‌తో నడుస్తుంది.
దాదాపు OnePlus 12 ఫోన్ మాదిరిగానే రాబోయే OnePlus 13 మోడల్ కూడా ఉండబోతోందని తెలియడంతో 12 ఫోన్ ఫీచర్స్‌ను చాలామంది పరిశీలిస్తున్నారు. దీనిలోనూ 50-మెగా పిక్సెల్ ప్రైమరీ కెమెరా విత్ సోనీ ఎల్వైటీ-808 సెన్సర్ విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (ఓఐఎస్) హసెల్‌బ్లేడ్ ట్యూన్డ్ ట్రిపుల్ రేర్ కెమెరా యూనిట్‌ను అందించారు. అలాగే, సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందుభాగంలో 32-మెగా పిక్సెల్స్ సెన్సర్ కెమెరాను అమర్చారు. అంతేకాదు, OnePlus 12 ఒక టిగా బైట్ స్టోరేజీ కెపాసిటీని కలిగి ఉంటుంది. 100W సూపర్ వూక్ చార్జింగ్, 50W వైర్ లెస్ చార్జింగ్, 10W రివర్స్ వైర్ లెస్ చార్జింగ్‌కు సపోర్ట్ చేస్తూ.. 5400 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది.
ప్రకటన
ప్రకటన