Photo Credit: OnePlus
ఇప్పటికే OnePlus 13 అక్టోబర్‌లో లాంచ్ కాబోతున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ హ్యాండ్‌సెట్ ఈ నెలలోనే వస్తుందని కంపెనీ ఎగ్జిక్యూటివ్ స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్ అక్టోబర్‌లోనే చైనా లాంచ్ అవుతుందని, ఏడాది చివరిలో గ్లోబల్ మార్కెట్‌లోకి విడుదల చేయనున్నట్లు మార్కెట్ వర్గాలు కూడా భావిస్తున్నాయి. ఇందుకు సంబంధించి కంపెనీ ఎగ్జిక్యూటివ్ లాంచ్ టైమ్‌లైన్‌ను ధృవీకరించడంతో పాటు, OnePlus 13కు కీలక అంశాలను వెల్లడించారు. ఇది స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 4 ప్రాసెసర్‌తో రూపొందించినట్లు అంచనా వేస్తున్నారు.
Weibo పోస్ట్ ప్రకారం.. OnePlus 13 స్మార్ట్‌ఫోన్ ఈ నెలలో లాంచ్ చేయబడుతుందని OnePlus చైనా ప్రెసిడెంట్ లూయిస్ లీ వెల్లడించారు. ఈ స్మార్ట్‌ఫోన్ ColorOS 15లో రన్ అవుతోన్న మొదటి మోడల్‌గా ప్రచారం జరుగుతోంది. అంతేకాదు, ఈ OnePlus ఫోన్‌లు గ్లోబల్ మార్కెట్‌లో చిన్నపాటి మార్పులతో ఆక్సిజన్ OSకి బదులుగా Oppo ఆండ్రాయిడ్ ఆధారిత స్కిన్‌తో వస్తుందనడంలో ఆశ్చర్యం లేదు. ఈ రాబోయే ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ పనితీరులో సరికొ్త్త అప్‌గ్రేడ్‌ను చూడొచ్చని లీ ప్రధానంగా చెప్పుకొచ్చారు. తాజా స్నాప్‌డ్రాగన్ ఫ్లాగ్‌షిప్ చిప్‌తో OnePlus13 పనితీరు గతంలో విడుదలైన రెండు మోడల్స్‌తో పోల్చితే ఆండ్రాయిడ్‌లో మునుపెన్నడూ చూడని సరికొత్త అనుభూతిని అందిస్తుందని స్పష్టం చేశారు.
ఈ డెవలప్‌మెంట్ ఇందులో అందిస్తోన్న స్నాప్‌డ్రాగన్ 8 Gen 4 ప్రాసెసర్ కారణంగా కనిపిస్తుంది. ఇందులోని కొత్త ప్రాసెసర్ కంపెనీ డెడికేటెడ్ న్యూరల్ ప్రాసెసింగ్ యూనిట్ (NPU) న్యూ జనరేషన్‌తో వస్తుందని భావిస్తున్నారు. ఇది AI సంబంధిత ఫీచర్స్‌తోపాటు గత మోడల్స్‌తో పోల్చితే మరింత వేగవంతమైన పనితీరును అందిస్తుంది. ఇక మన దేశీయ మార్కెట్‌లో OnePlus 13 ColorOS 15లో రాకపోయినప్పటికీ, ఆపరేటింగ్ సిస్టమ్ కొత్త టైడల్ ఇంజిన్, అరోరా ఇంజిన్‌ను కలిగి ఉంటుందని లీ స్పష్టం చేశారు. ఇది కూడా వేగవంతమైన పనితీరుతోపాటు సాఫ్ట్ యానిమేషన్‌ను పరిచయం చేస్తుందని చెప్పుకొచ్చారు.
గతంలో వచ్చిన సమాచారం ఆధారంగా.. OnePlus 13 మోడల్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.82-అంగుళాల 2K 10-బిట్ LTPO BOE X2 మైక్రో క్వాడ్ కర్వ్డ్ OLED డిస్‌ప్లేను కలిగి ఉంటుందని భావిస్తున్నారు. అలాగే, BOE ఓరియంటల్ స్క్రీన్ సెకెండ్ జనరేషన్ ప్రస్తుతం OnePlus 12లో కనిపించే BOE X1 డిస్‌ప్లేను డామినేట్ చేస్తుందని ప్రచారంలో ఉంది. డిస్‌ప్లే సర్క్యూట్‌లో అమర్చిన అల్ట్రాసోనిక్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌ను స్మార్ట్‌ఫోన్ స్పోర్ట్ చేయగలదని మరొక నివేదిక పేర్కొంది. ఇది సూపర్ ఐ ప్రొటెక్షన్, సాఫ్ట్ ఎడ్జ్ ఫోర్ లెవెల్ డెప్త్‌కు కూడా సపోర్ట్ చేస్తుంది. అలాగే, సూపర్ సిరామిక్ గ్లాస్ బ్యాక్ ప్యానెల్‌తో అందబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది. వీటితో పాటు ఇది 100W వైల్డ్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు చేస్తూ.. 6,000mAh బ్యాటరీ సామర్థ్యంతో అందుబాటులోకి వస్తుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
ప్రకటన
ప్రకటన