OnePlus Smartphones కంపెనీ నుంచి ఓ ఆసక్తికమైన సమాచారాన్ని వెల్లడించింది. OnePlus కంపెనీ తమ అన్ని స్మార్ట్‌ఫోన్‌లతోపాటు ట్యాబ్‌ల కోసం కొత్త సాఫ్ట్‌వేర్ సిరీస్‌ను ప్రారంభించినట్లు తెలిపింది. ఇది మనదేశంతోపాటు ఇతర దేశాలలలో ఉన్న OnePlus కంపెనీ గాడ్జెట్‌లకు వర్తిస్తుందని స్పష్టం చేసింది. ఈ సాఫ్ట్‌వేర్ సిరీస్ ఫలితంగా అర్హత ఉన్న OnePlus ఫోన్‌లు మరియు ట్యాబ్‌లు సకాలంలో సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌లతోపాటు సెక్యూరిటీ ప్యాచ్ అప్‌డేట్‌లు అలాగే, నెలవారీ సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌లను పొందుతాయి.
అప్‌డేట్ కోసం సాఫ్ట్‌వేర్ సిరీస్..
కంపెనీ ఉత్పత్తులకు అలాగే, OnePlus సొంత రీప్లేస్‌మెంట్ యాప్‌ల కోసం ఈ సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌ను తీసుకువస్తున్నట్లు ప్రకటించింది. కంపెనీ నుంచి కొత్తగా లాంచ్ అయిన One Plus Nord 4, One plus Pad 2 మోడల్స్ నుంచే ఈ కొత్త వెర్షన్‌ను పరిచయం చేస్తున్నట్లు వెల్లడించారు. వన్ ప్లస్ కంపెనీ తమ కమ్యూనిటీ ఫోరమ్‌లో ఒక పోస్ట్ ద్వారా స్మార్ట్‌ఫోన్ యొక్క నెలవారీ అప్‌డేట్ కోసం సాఫ్ట్‌వేర్ సిరీస్ U120P01, U120P01 అనే కొత్త వెర్షన్‌ను ఆవిష్కరించినట్లు తెలిపింది. ఈ సాఫ్ట్‌వేర్ అభివృద్ధి ఫలితంగా హ్యాండ్‌సెట్‌లు కొత్త ఫీచర్లతోపాటు సమర్థవంతమైన వేగాన్ని పొందుతాయి. ఈ నెలవారీ సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ ప్రక్రియ ఈ ఆగస్టు 2 నుండి ప్రారంభమైంది. నిజానికి ఈ ఒక్క అప్‌డేట్‌తో స్మార్ట్ ఫోన్ కంపెనీలకు ధీటైన సంస్థగా One plus నిలిచిందనే చెప్పాలి. దేశ విదేశాలలో ఉన్న One plus వినియోగదారలు కంపెనీ చేసిన ప్రకటనను చూసి ఒకింత ఆశ్చర్యానికి గురవుతున్నారని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.
క్రమంగా అన్ని దేశాలకూ..
మన దేశం తర్వాత వరుసగా ఫిలిప్పీన్స్, మలేషియా, థాయ్‌లాండ్, వియత్నాం, సింగపూర్, ఆసియా పసిఫిక్ రీజియన్‌లతో సహా OnePlus కంపెనీ ఉత్పత్తులను ఉపయోగించే వినియోగదారులు ఈ సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ నోటిఫికేషన్‌ను పొందుతారు. అంతేకాదు, మిడిల్ ఈస్ట్ దేశాలైన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, కువైట్, ఖతార్, సౌదీ అరేబియాలోని OnePlus వినియోగదారులు కూడా ఈ సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌కు అవకాశం పొందుతారు. One plus కంపెనీ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ కొత్త సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ OxyzenOS వెర్షన్ 14.00తోపాటు అంతకంటే ఎక్కువ ఉన్న అన్ని స్మార్ట్‌ఫోన్‌లకు అలాగే, OxyzenOS 13.1.0, 13.00 వంటి మునుపటి వెర్షన్‌లకు కూడా వర్తిస్తుంది. అలాగే, అన్నిOne plus స్మార్ట్‌ఫోన్‌లు ఒకేసారి ఈ అప్‌డేట్ అందుకోలేవని కంపెనీ స్పష్టం చేసింది. చిన్న తరహా హ్యాండ్‌సెట్‌లను మొదలుకుని అప్‌డేట్ నోటిఫికేషన్‌ను స్వీకరించడం ద్వారా అప్‌డేట్ ప్రక్రియ వేగవంతమవుతుందని తెలిపింది. మీరు One plus స్మార్ట్ ఫోన్ వినియోగదారులు అయ్యుంటే ఇది మీకు నిజంగా ఆనందాన్ని కలిగించే వార్త అవుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.
OxygenOS 14.0.0 వెర్షన్ - అంతకంటే ఎక్కువ నడుస్తున్న ఫోన్‌ల జాబితా..
- OnePlus 12 సిరీస్
- OnePlus ఓపెన్
- OnePlus 11 సిరీస్
- OnePlus 10 సిరీస్
- OnePlus 9 సిరీస్
- OnePlus 8T
- OnePlus Nord 4 5G
- OnePlus Nord 3 5G
- OnePlus Nord 2T 5G
- OnePlus Nord CE 4 5G
- OnePlus Nord CE 3 5G
- OnePlus Nord CE 3 Lite 5G
- OnePlus Nord CE 2 Lite 5G
- OnePlus ప్యాడ్
- OnePlus ప్యాడ్ Go
ఆక్సిజన్ OS 13.1.0
ఆక్సిజన్ OS 13.0.0
- OnePlus Nord 2 5G
- OnePlus Nord CE 2 5G
- OnePlus Nord CE 5G