Oppo A6 5G డ్యుయల్-సిమ్ సపోర్ట్‌తో వస్తుంది. ఇందులో Android 15 బేస్డ్ ColorOS 15 ఉంది. డిస్ప్లే పరంగా చూస్తే, ఇది 6.57 అంగుళాల ఫుల్-HD+ AMOLED స్క్రీన్ (2,372×1,080 పిక్సెల్స్) తో లభిస్తుంది.
Photo Credit: Oppo
Oppo A6 5G మూడు రంగులలో లభిస్తుంది
ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ తయారీదారు ఒప్పో తమ తాజా ఫోన్ Oppo A6 5G ను చైనాలో విడుదల చేసింది. ఈ ఫోన్ బ్లూ ఓషన్ లైట్, వెల్వెట్ గ్రే, ఫెన్‌మెంగ్ షెంగ్‌హువా (పింక్) అనే మూడు కలర్ వెరియంట్లలో లభిస్తుంది. ప్రస్తుతం ఇది కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌లో లభిస్తోంది. అదనంగా, ఇది IP69 డస్ట్ & వాటర్ రెసిస్టెంట్ సర్టిఫికేషన్‌తో వస్తోంది. Oppo A6 5G ప్రారంభ ధర చైనాలో CNY 1,599 (సుమారు రూ. 20,000) గా నిర్ణయించారు. ఈ ధరకి 8GB RAM + 256GB స్టోరేజ్ వెర్షన్ వస్తుంది. అదనంగా 12GB RAM + 256GB స్టోరేజ్ మరియు 12GB RAM + 512GB స్టోరేజ్ మోడళ్లు కూడా అందుబాటులో ఉంటాయి. అయితే, ఈ హై-ఎండ్ మోడళ్ల ధరను కంపెనీ ఇంకా వెల్లడించలేదు.
Oppo A6 5G డ్యుయల్-సిమ్ సపోర్ట్‌తో వస్తుంది. ఇందులో Android 15 బేస్డ్ ColorOS 15 ఉంది. డిస్ప్లే పరంగా చూస్తే, ఇది 6.57 అంగుళాల ఫుల్-HD+ AMOLED స్క్రీన్ (2,372×1,080 పిక్సెల్స్) తో లభిస్తుంది. ఈ డిస్ప్లేలో 120Hz అడాప్టివ్ రిఫ్రెష్ రేట్, 240Hz టచ్ శాంప్లింగ్ రేట్, 397ppi పిక్సెల్ డెన్సిటీ, 1,400 nits పీక్ బ్రైట్‌నెస్ వంటి ఫీచర్లు ఉన్నాయి. అదనంగా, DCI-P3 మరియు sRGB కలర్ గామట్ 100% కవరేజ్ అందిస్తుంది. స్క్రీన్-టు-బాడీ రేషియో 93% ఉండటం వల్ల డిస్‌ప్లే మరింత ఆకర్షణీయంగా కనిపిస్తుంది.
ప్రాసెసర్ విషయానికి వస్తే, ఇందులో మీడియా టెక్ డైమెన్సిటీ 6300 ఆక్సా-కోర్ చిప్‌సెట్ ఉంది. ఇది రెండు హై-పర్ఫార్మెన్స్ కోర్లు, ఆరు ఎఫిషెన్సీ కోర్లతో కలిపి 2.4GHz పీక్ క్లాక్ స్పీడ్ అందిస్తుంది. స్టోరేజ్ పరంగా, ఇది LPDDR4X RAM మరియు UFS 2.2 ఇంటర్నల్ స్టోరేజ్ తో వస్తుంది. అదనంగా, microSD కార్డు ద్వారా స్టోరేజ్ విస్తరణకు కూడా అవకాశం ఉంది.
Oppo A6 5G వెనుక భాగంలో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ కలదు. ఇందులో 50MP వైడ్-యాంగిల్ ప్రైమరీ కెమెరా (f/1.8 అపర్చర్, 27mm ఫోకల్ లెన్త్, ఆటోఫోకస్) ఉంది. అలాగే 2MP మోనోక్రోమ్ సెన్సార్ (f/2.4 అపర్చర్, 22mm ఫోకల్ లెన్త్, 10x డిజిటల్ జూమ్) అందించబడింది. సెల్ఫీల కోసం 16MP ఫ్రంట్ కెమెరా (f/2.4 అపర్చర్, 23mm ఫోకల్ లెన్త్) ఉంది. రియర్ మరియు ఫ్రంట్ కెమెరాలు రెండూ 1080p వీడియో రికార్డింగ్ 60fps సపోర్ట్ చేస్తాయి.
ఈ ఫోన్‌లో 7,000mAh బ్యాటరీతో పాటు 80W వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్ అందుబాటులో ఉంది. సెక్యూరిటీ కోసం ఇన్-డిస్ప్లే ఆప్టికల్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్ ఇవ్వబడింది. ఇతర సెన్సర్లలో ప్రాక్సిమిటీ సెన్సర్, అంబియంట్ లైట్ సెన్సర్, ఎలక్ట్రానిక్ కంపాస్, యాక్సిలరోమీటర్ ఉన్నాయి. కనెక్టివిటీ ఆప్షన్లలో 5G, 4G, GPS, GLONASS, Galileo, QZSS, Beidou సపోర్ట్ చేస్తుంది. డిజైన్ పరంగా చూస్తే, ఫోన్ పరిమాణం 158.20×75.02×8mm, బరువు సుమారు 185 గ్రాములు మాత్రమే.
ప్రకటన
ప్రకటన
Microsoft Announces Latest Windows 11 Insider Preview Build With Ask Copilot in Taskbar, Shared Audio Feature
Samsung Galaxy S26 Series Specifications Leaked in Full; Major Camera Upgrades Tipped