ఒప్పో ఎఫ్ సిరీస్ నుంచి ఈ ఏడాది మార్చిలో ఎఫ్ 29, ఎఫ్ 29 ప్రోలు మార్కెట్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు ఈ సిరీస్‌లో భాగంగా ఎఫ్ 31, ఎఫ్ 31 ప్రో, ఎఫ్ 31 ప్రో ప్లస్‌లు మార్కెట్లోకి వచ్చేందుకు సిద్దమయ్యాయి. ఈ మేరకు వీటికి సంబంధించిన లుక్, ధర, ఫీచర్స్ మార్కెట్లోకి ముందే వచ్చాయి.
Photo Credit: Oppo
Oppo F29 సిరీస్ వారసులు 80W ఛార్జింగ్‌కు మద్దతుతో వస్తారని భావిస్తున్నారు
మార్కెట్లో ఒప్పో ఫోన్స్‌కి ఉన్న డిమాండ్ అందరికీ తెలిసిందే. కెమెరా, ఆడియో, వీడియో ఇలా అన్నింట్లోనూ అద్భుతమైన క్వాలిటీని ఇచ్చే ఈ ఒప్పో ఫోన్లకు మంచి క్రేజ్ ఏర్పడింది. ఇక ఇందులో భాగంగా ఇప్పటికే ఒప్పో ఎఫ్ 29 మార్కెట్లో అందరినీ ఆకట్టుకుంది. ఇక ఇప్పుడు ఒప్పో ఎఫ్ నుంచి మరో సిరీస్ వచ్చేసింది. Oppo F29 లైనప్‌కు కంటిన్యూగా Oppo F31 సిరీస్‌కు సంబంధించి లీక్ అయిన డిజైన్ రెండర్‌ల రూపంలో బయటకు వచ్చింది. F-సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లలో భాగంగా Oppo F31, Oppo F31 Pro, Oppo F31 Pro+ మార్కెట్లోకి రాబోతోన్నాయి. ఈ రాబోయే హ్యాండ్‌సెట్‌లలోని కొన్ని స్పెసిఫికేషన్‌లను కూడా ఒక టిప్‌స్టర్ లీక్ చేశారు. Oppo F31, Oppo F31 Proలు MediaTek డైమెన్సిటీ చిప్‌సెట్‌ను కలిగి ఉన్నాయని అంటున్నారు. అయితే Oppo F31 Pro+ స్నాప్‌డ్రాగన్ 7 Gen 3 SoC ద్వారా నడుస్తుందని అంటున్నారు.ఇక ఈ మూడు మోడళ్లలో 7,000mAh కెపాసిటీతో బ్యాటరీ వస్తుందని చెబుతున్నారు.
Oppo F31 సిరీస్ డిజైన్ రెండర్‌లు, స్పెసిఫికేషన్‌లను ఎక్స్ స్పేస్ యూజర్ (గతంలో ట్విట్టర్)లో టిప్‌స్టర్ అభిషేక్ యాదవ్ (@yabhishekhd) లీక్ చేశారు. రెండర్ Oppo F31 Pro+ని తెలుపు, గులాబీ, నీలం రంగులలో రానుందట, ఇందులో వృత్తాకార ఆకారంలో ఉండే బ్యాక్ కెమెరా ఉంటుందట. Oppo F31 Pro బంగారు, నలుపు రంగులలో రానుందట, చదరపు ఆకారంలో వెనుక కెమెరా వంపుతిరిగిన అంచులతో ఉంటుందట.
చివరగా, లీకైన చిత్రంలో ప్రామాణిక Oppo F31 ఎరుపు, ఊదా, నీలం రంగులలో ఉంటుందట. ఇది LED ఫ్లాష్,కెమెరా సెన్సార్‌లతో చదరపు ఆకారంలో ఉన్న బ్యాక్ కెమెరాతో ఉంటుందట
టిప్‌స్టర్ ప్రకారం, Oppo F31, Oppo F31 Pro, Oppo F31 Pro+ 7,000mAh బ్యాటరీని కలిగి ఉంటాయని తెలుస్తోంది. Oppo F31 Pro+ ఫ్లాట్ డిస్‌ప్లే, స్నాప్‌డ్రాగన్ 7 Gen 3 ప్రాసెసర్‌ను కలిగి ఉండవచ్చని అంచనా. ఇది 12GB RAM + 256GB స్టోరేజ్ కాన్ఫిగరేషన్‌లో అందుబాటులో ఉంటుందని చెబుతున్నారు.
Oppo F31 Pro MediaTek Dimensity 7300 SoC పై నడుస్తుందని అంచనా వేస్తున్నారు. అయితే Oppo F31 MediaTek Dimensity 6300 SoC ద్వారా నడుస్తుందని చెబుతారు. రెండు ఫోన్లు 80W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తాయని చెబుతున్నారు.
మునుపటి నివేదికల ప్రకారం Oppo F31 సిరీస్ భారతదేశంలో సెప్టెంబర్ 12 , సెప్టెంబర్ 14 మధ్య ప్రారంభం అవ్వాలి. అవి ఇప్పటికే ఉన్న Oppo F29 లైనప్ కంటే కొన్ని హార్డ్‌వేర్ అప్‌గ్రేడ్‌లతో వస్తాయని భావిస్తున్నారు.
ఈ ఏడాది మార్చిలో ఒప్పో F29, ఒప్పో F29 ప్రో లను భారతదేశంలో విడుదల చేసింది. వాటికి 6.7-అంగుళాల పూర్తి-HD+ AMOLED డిస్ ప్లే, 50-మెగాపిక్సెల్ డ్యూయల్ రేర్ కెమెరా ఉన్నాయి. స్టాండర్డ్ మోడల్ హుడ్ కింద స్నాప్‌డ్రాగన్ 6 Gen 1 చిప్ ఉంది. అయితే ప్రో వేరియంట్ మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ఎనర్జీ SoC పై నడుస్తుంది.
ప్రకటన
ప్రకటన