Find X9 అనేది 7,025mAh 'గ్లేసియర్' బ్యాటరీతో వస్తుండగా.. Find X9 Pro 7,500mAh బ్యాటరీతో రానుందట.
Photo Credit: Weibo/Zhou Yibao
Oppo Find X9 (ఎడమ) ఫ్లాట్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది
Oppo Find X9 సిరీస్ త్వరలో చైనాలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఈ మేరకు ఈ కొత్త మోడల్స్ గురించి రకరకాల లీక్స్ వస్తూనే ఉన్నాయి. Oppo Find X9, Find X9 Pro ఫీచర్స్ గురించి అంతా మాట్లాడుకుంటున్నారు. కంపెనీ మొదట Find X9, Find X9 Pro మోడల్‌ను లాంచ్ చేస్తుందని భావిస్తున్నారు. అయితే భవిష్యత్తులో 'అల్ట్రా' వేరియంట్‌ను ప్రవేశపెట్టవచ్చు అని తెలుస్తోంది. కంపెనీ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఇటీవల Oppo Find X9, Find X9 Proలను కాస్త టీజర్ రూపంలో పరిచయం చేశారు. వాటి బ్యాటరీ సైజులతో సహా కొన్ని కీలక స్పెసిఫికేషన్‌లను కూడా ధృవీకరించారు. రాబోయే మోడళ్ల కొలతలు కూడా లీక్ అయ్యాయి.
Oppo Find ప్రొడక్ట్ మేనేజర్ జౌ యిబావో బేస్ ఈ న్యూ మోడల్ Oppo Find X9 అనేది 7,025mAh 'గ్లేసియర్' బ్యాటరీతో వస్తుందని ధృవీకరించారు. అయితే Find X9 Pro 7,500mAh బ్యాటరీతో రానుందట. Oppo Find X9 సిరీస్ కోల్డ్ కార్వింగ్ టెక్నాలజీని కలిగి ఉంటుంది. టైటానియం కలర్ ఆప్షన్‌లో వస్తుందట. రాబోయే Oppo Find X9 సిరీస్ నాలుగు వైపులా యూనిఫాం బెజెల్స్‌తో ఫ్లాట్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఈ హ్యాండ్‌సెట్‌లు గణనీయంగా మెరుగైన వీడియో సామర్థ్యాలను కలిగి ఉన్నాయని పేర్కొన్నారు.
Oppo Find X9 లైనప్ Android 16 ఆధారంగా ColorOS 16 పని చేస్తుందట. ఇందులో Apple పరికరాల్లో కనిపించే కొన్ని ఫీచర్లను కూడా సపోర్ట్ చేస్తుందట. కంపెనీ సీనియర్ ఎగ్జిక్యూటివ్ AirPods 4 ను Oppo Find X9 తో జత చేసి చూపించారు. రాబోయే స్మార్ట్‌ఫోన్‌లలో కంటికి అనుకూలమైన మెటీరియల్‌తో డిస్‌ప్లేలు, సున్నితమైన వీక్షణ కోసం యాంటీ-మోషన్ సిక్‌నెస్ మోడ్ కూడా ఉంటాయి. ఫోన్‌లలో హాసెల్‌బ్లాడ్-ట్యూన్ చేయబడిన కెమెరాలు కూడా ఉంటాయి.
టిప్‌స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ వెనిల్లా Oppo Find X9 7.9mm ప్రొఫైల్ కలిగి ఉంటుందని, దాదాపు 203g బరువు ఉంటుందని Weibo పోస్ట్‌లో పేర్కొంది. Oppo Find X9 Pro 8.25mm మందంతో, దాదాపు 224g బరువు ఉంటుందని భావిస్తున్నారు. రెండు హ్యాండ్‌సెట్‌లు 80W వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తాయి.
ఒప్పో ఫైండ్ X9 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.59-అంగుళాల 1.5K ఫ్లాట్ LTPO OLED డిస్‌ప్లేను పొందే అవకాశం ఉంది. ఇది MediaTek Dimensity 9500 SoC ద్వారా ఎనర్జీని పొందుతుంది. అల్ట్రాసోనిక్ ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌ను కలిగి ఉంటుంది.
ప్రకటన
ప్రకటన