ఒప్పో సంస్థ తన అత్యంత శక్తివంతమైన ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ 'ఫైండ్ X9 అల్ట్రా' విడుదలకు రంగం సిద్ధం చేసింది.
Photo Credit: X/ Oppo
రెండు 200MP కెమెరాలతో వస్తున్న Oppo Find X9 Ultra!
ఒప్పో సంస్థ తన అత్యంత శక్తివంతమైన ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ 'ఫైండ్ X9 అల్ట్రా' విడుదలకు రంగం సిద్ధం చేసింది. వచ్చే వారం చైనా సహా అంతర్జాతీయ మార్కెట్లలో ఈ ఫోన్ గ్రాండ్ ఎంట్రీ ఇవ్వబోతోంది. ఇప్పటికే విడుదలైన టీజర్లు టెక్ ప్రియుల్లో భారీ అంచనాలు పెంచేశాయి. ముఖ్యంగా కెమెరా ప్రేమికులను ఆకట్టుకునేలా దీని డిజైన్ ఉంది. పాత మోడల్ ఫైండ్ X9 ప్రో పోలికలు కనిపిస్తున్నా ఇందులో మరిన్ని వినూత్న మార్పులు చేశారు. వెనుక వైపున ఉండే భారీ వృత్తాకార కెమెరా మాడ్యూల్ ఈ ఫోన్ ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. ఒకప్పుడు ప్రొఫెషనల్ కెమెరాలకు మాత్రమే పరిమితమైన ఫీచర్లను ఇప్పుడు స్మార్ట్‌ఫోన్‌లో చూపిస్తూ ఒప్పో సరికొత్త ట్రెండ్‌కు తెరలేపింది.
ఈ ఫోన్ డిజైన్ చూస్తే టెక్నాలజీ స్టైల్ కలబోతగా అనిపిస్తుంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న చిత్రాల ప్రకారం దీని వెనుక భాగం రెండు రకాల ఫినిషింగ్‌లతో వస్తోంది. ఒక వైపు లెదర్ లాంటి సాఫ్ట్ టెక్స్‌చర్ ఉంటే మరోవైపు స్మూత్ గ్లాస్ ఫినిషింగ్ ఇచ్చారు. ఈ డ్యూయల్ టోన్ లుక్ ఫోన్‌కు ప్రీమియం ఫీల్ ఇస్తోంది. నలుపు ఇంకా ఆరెంజ్ రంగుల్లో ఈ ఫోన్ అందుబాటులో ఉండనుంది. ఆ రంగుల పేర్లు ఇప్పటికీ సస్పెన్స్ అయినప్పటికీ అల్ట్రా లుక్ మాత్రం అదిరిపోయింది. హ్యాసెల్‌బ్లాడ్ లోగోను సెంటర్లో ఉంచడం ద్వారా ఈ ఫోన్ ఫోటోగ్రఫీకి ఎంతటి ప్రాధాన్యత ఇస్తుందో కంపెనీ చెప్పకనే చెప్పింది.
కెమెరా విషయానికి వస్తే ఇది నిజమైన విజువల్ మాన్స్టర్ అని చెప్పవచ్చు. ఇందులో రెండు 200 మెగాపిక్సెల్ సెన్సార్లు ఉండటం విశేషం. దీనికి తోడు 50 మెగాపిక్సెల్ సామర్థ్యం గల 10x ఆప్టికల్ టెలిఫోటో లెన్స్‌ను అమర్చారు. అంటే దూరంగా ఉన్న వస్తువులను కూడా అత్యంత స్పష్టతతో క్లిక్ మనిపించవచ్చు. క్వాలిటీ విషయంలో రాజీ పడకుండా 8K అల్ట్రా క్లియర్ వీడియో రికార్డింగ్ సదుపాయం కూడా కల్పించారు. నేటి తరం క్రియేటర్లకు రీల్స్ అలాగే వ్లాగ్స్ చేయడానికి ఇది ఒక అద్భుతమైన ఆయుధంలా మారుతుంది. ప్రొఫెషనల్ కెమెరా వాడాల్సిన అవసరం లేకుండానే కేవలం ఈ మొబైల్‌తో అద్భుతాలు సృష్టించవచ్చు.
.
Something Ultra This Way Comes.#OPPOFindX9Ultra #YourNextCamera pic.twitter.com/pzallvz4IB
— OPPO (@oppo) April 13, 2026
ఫోటోగ్రఫీ పిచ్చోళ్ల కోసం ఒప్పో 'హ్యాసెల్‌బ్లాడ్ ఎర్త్ ఎక్స్‌ప్లోరర్ మాస్టర్ సెట్' పేరిట ఒక లిమిటెడ్ ఎడిషన్‌ను కూడా అనౌన్స్ చేసింది. ఇది హ్యాసెల్‌బ్లాడ్ X2D 100C మోడల్ స్ఫూర్తితో తయారైంది. చూడ్డానికి ఇది ఒక సాధారణ ఫోన్ బాక్సులా కాకుండా ఒక ప్రొఫెషనల్ కిట్‌లా కనిపిస్తుంది. సాహస యాత్రలు చేసే వారికి ప్రకృతి అందాలను బంధించే వారికి ఇది ఒక సరైన బహుమతి అని చెప్పవచ్చు. ఇందులో ఉండే ప్రత్యేకమైన కెమెరా యాక్సెసరీలు ఫోన్ వాడకాన్ని మరో స్థాయికి తీసుకువెళ్తాయి. కలెక్టర్లు సైతం ఈ ఫోన్ కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపేలా దీన్ని తీర్చిదిద్దారు.
![]()
Oppo Find X9 Ultra Hasselblad Earth Explorer Master Set
Photo Credit: Weibo/ Oppo
ఈ మాస్టర్ సెట్‌లో కొన్ని ఆసక్తికరమైన వస్తువులు ఉన్నాయి. అందులో ముఖ్యంగా హ్యాసెల్‌బ్లాడ్ ప్రొఫెషనల్ టెలికన్వర్టర్ అల్ట్రా ఉంటుంది. అలాగే ఫోన్‌ను పట్టుకోవడానికి వీలుగా ఉండే ఒక స్పెషల్ కెమెరా హ్యాండిల్ కేస్ ఇస్తున్నారు. వీటికి అదనంగా ఒక యూనిక్ సీరియల్ నంబర్‌తో కూడిన అథెంటిసిటీ సర్టిఫికేట్ కూడా లభిస్తుంది. ప్రతికూల వాతావరణంలో సైతం ఫోటోలు తీయడానికి ఈ పరికరాలు తోడ్పడతాయి. కేవలం ఫోన్ మాత్రమే కాకుండా ఒక పూర్తి స్థాయి ఫోటోగ్రఫీ అనుభవాన్ని యూజర్లకు అందించడమే ఒప్పో లక్ష్యంలా కనిపిస్తోంది. పాత తరం కెమెరా ఫీచర్లను కొత్త తరం టెక్నాలజీకి జోడించి ఈ బండిల్‌ను డిజైన్ చేశారు.
ధర విషయానికి వస్తే ఒప్పో ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఏప్రిల్ 21న జరగబోయే లాంచ్ ఈవెంట్‌లో అన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. ఈ లోపు సోషల్ మీడియాలో లీక్ అవుతున్న సమాచారం ప్రకారం దీని రేటు భారీగానే ఉండే అవకాశం కనిపిస్తోంది. ప్రీమియం ఫీచర్లు అలాగే లిమిటెడ్ ఎడిషన్ యాక్సెసరీల కారణంగా ఇది లగ్జరీ విభాగంలో నిలుస్తుంది. గ్లోబల్ మార్కెట్‌లో ఈ ఫోన్ ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో చూడాలి. ఆపిల్ లేదంటే శామ్ సంగ్ వంటి బ్రాండ్లకు గట్టి పోటీ ఇచ్చేలా ఒప్పో తన అస్త్రాన్ని సిద్ధం చేసుకుంది. కొత్తదనంతో పాటు పవర్‌ఫుల్ పర్ఫార్మెన్స్ కోరుకునే వారికి ఇది బెస్ట్ ఛాయిస్ అవుతుంది.
ప్రకటన
ప్రకటన