Photo Credit: Flipkart
గత సంవత్సరం విడుదలైన Oppo K12 కి ప్రత్యక్ష వారసుడిగా Oppo K13 5G ప్రారంభం కానుంది
త్వరలోనే Oppo K13 5G హ్యాండ్‌సెట్ భారత్‌లో లాంఛ్ అవుతుందని నిర్ధారణయ్యింది. ఒక పత్రికా ప్రకటన ద్వారా Oppo కొత్త K సిరీస్ స్మార్ట్ ఫోన్ రాకను వెల్లడించింది. ఈ ఫోన్ ఫ్లిప్‌కార్ట్ ద్వారా మన దేశంలో అమ్మకానికి రానుంది. అంతేకాదు, Oppo K13 5G ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 8400 ప్రాసెసర్‌తో వచ్చే అవకాశాలు ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. ఇది గత ఏడాది వచ్చిన Oppo K12కి కొనసాగింపుగా రానుంది. స్నాప్‌డ్రాగన్ 7 Gen 3 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ రన్ అవ్వడంతోపాటు 100W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో సపోర్ట్‌తో 5,500mAh బ్యాటరీతో దీనిని రూపొందించారు.ఇండియన్ మొబైల్ మార్కెట్‌లోకి,ఈ చైనీస్ టెక్ బ్రాండ్ త్వరలోనే మన దేశంలో కొత్త Oppo K13 5G ని విడుదల చేయనుంది. అయితే, ఖచ్చితమైన లాంఛ్ తేదీని ఇంకా వెల్లడించనప్పటికీ, ఇది మొదటగా ఇండియన్ మొబైల్ మార్కెట్‌లోకి రానున్నట్లు మాత్రం నిర్ధారించబడింది. రాబోయే కొత్త Oppo K సిరీస్ స్మార్ట్ ఫోన్ స్మూత్ గేమింగ్ ఎక్స్‌పీరియన్స్‌ను, వేగవంతమైన ఛార్జింగ్ సపోర్ట్‌తో లాంగ్ బ్యాటరీ లైఫ్‌ను అందిస్తుందని కంపెనీ చెబుతోంది.
ఫ్లిప్‌కార్ట్ తన వెబ్‌సైట్‌లో కొత్త Oppo K13 5G రాకను టీజ్ చేయడానికి ప్రత్యేక మైక్రోసైట్‌ను క్రియేట్ చేసింది. దీనికి సంబంధించిన అధికారిక వివరాలు బయటకు రానప్పటికీ, మొబైల్ మార్కెట్‌లో ఇది MediaTek Dimensity 8400 ప్రాసెసర్‌ను కలిగి ఉంటుందని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. అయితే, దీనిపై ఇప్పటి వరకూ ఎలాంటి స్పష్టత రాలేదు. రాబోయే హ్యాండ్‌సెట్‌కు అందించబోయే ప్రాసెసర్ ఆధారంగా, అమ్మకాలు ఆధారపడి ఉంటాయని మార్కెట్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
గత సంవత్సరం కంపెనీ నుంచి వచ్చిన Oppo K13 5Gకు కొనసాగింపుగా Oppo K12x స్మార్ట్ ఫోన్ వస్తోంది. K12x ఫోన్ మన దేశంలో రెండు మిలియన్‌ల అమ్మకాల మైలురాయిని అందుకున్నట్లు Oppo వెల్లడించింది. అంతేకాదు, 2024లో ఫ్లిప్‌కార్ట్ పండుగ అమ్మకాల సమయంలో అత్యధికంగా అమ్ముడైన ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్‌లలో ఇది కూడా ఒకటిగా ఉందని చెబుతున్నారు. కంపెనీ గత 2024 జూలైలో విడుదలైన ఈ మొబైల్ 6GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 12,999గా మార్కెట్‌కు పరిచయం చేసింది.
Oppo K12 మోడల్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 ప్రాసెసర్, 6.7-అంగుళాల ఫుల్-HD+ (2,412 x 1,080 పిక్సెల్స్) AMOLED డిస్‌ప్లే, 50-మెగాపిక్సల్ డ్యూయల్ రియల్ కెమెరా సెటప్‌తో సెప్టెంబర్ 2024లో మార్కెట్‌లోకి వచ్చింది. దీనిని 100W SuperVOOC ఛార్జింగ్ మద్దతుతో 5500mAh బ్యాటరీ సామర్థ్యంతో రూపొందిచారు. ఇది ఇన్-డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కలిగి ఉండడంతోపాటు దుమ్ము, స్ప్లాష్ నియంత్రణకు IP54-రేటెడ్ బిల్డ్‌ను కలిగి ఉంది. రాబోయే కొత్త మోడల్‌కు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాలంటే మాత్రం మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే మరి.
ప్రకటన
ప్రకటన