ఒప్పో K13 టర్బో 8GB + 128GB వేరియంట్ ధర రూ. 27,999 కాగా, 8GB + 256GB మోడల్ ధర రూ. 29,999గా నిర్ణయించారు. ఇవి ఫస్ట్ పర్పుల్, నైట్ వైట్, మిడ్‌నైట్ మ్యావరిక్ కలర్ ఆప్షన్లలో ఆగస్ట్ 18 నుంచి విక్రయానికి అందుబాటులో ఉంటాయి.
Photo Credit: Oppo
Oppo K13 టర్బో సిరీస్ IPX6, IPX8 మరియు IPX9 వాటర్ రెసిస్టెన్స్ రేటింగ్‌లను కలుస్తుందని పేర్కొన్నారు
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ ఒప్పో, భారతీయ వినియోగదారుల కోసం కొత్త K13 టర్బో మరియు K13 టర్బో ప్రో మోడళ్లను సోమవారం అధికారికంగా విడుదల చేసింది. జూలైలో చైనాలో తొలిసారిగా పరిచయమైన ఈ మోడళ్లు, ఇప్పుడు ఆకట్టుకునే ఫీచర్లతో భారత మార్కెట్లోకి వచ్చాయి. వీటిలో 7,000mAh సామర్థ్యం గల భారీ బ్యాటరీ, 80W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్, బైపాస్ చార్జింగ్ సపోర్ట్, అలాగే 7,000 చ.మి.మీ. VC కూలింగ్ యూనిట్ వంటి ప్రత్యేకమైన ఆకర్షణలు ఉన్నాయి. అదనంగా, ఇన్‌బిల్ట్ ఫ్యాన్ యూనిట్లు, ఎయిర్ డక్ట్స్‌తో యాక్టివ్ కూలింగ్ సిస్టమ్‌ను అందించారు. 50 మెగాపిక్సెల్ డ్యూయల్ రియర్ కెమెరా, 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా, అలాగే IPX6, IPX8, IPX9 రేటింగ్స్‌తో మల్టీ-లెవెల్ వాటర్ రెసిస్టెన్స్ వీటి ప్రత్యేకతగా చెబుతున్నారు.
ఒప్పో K13 టర్బో 8GB + 128GB వేరియంట్ ధర రూ. 27,999 కాగా, 8GB + 256GB మోడల్ ధర రూ. 29,999గా నిర్ణయించారు. ఇవి ఫస్ట్ పర్పుల్, నైట్ వైట్, మిడ్‌నైట్ మ్యావరిక్ కలర్ ఆప్షన్లలో ఆగస్ట్ 18 నుంచి విక్రయానికి అందుబాటులో ఉంటాయి. మరోవైపు, ఒప్పో K13 టర్బో ప్రో 8GB + 256GB మోడల్ ధర రూ. 37,999, 12GB + 256GB వేరియంట్ ధర రూ. 39,999గా ఉంది. ఇవి మిడ్‌నైట్ మ్యావరిక్, పర్పుల్ ఫాంటమ్, సిల్వర్ నైట్ రంగుల్లో ఆగస్ట్ 15 నుంచి లభ్యమవుతాయి. ఈ రెండు మోడళ్లు ఫ్లిప్‌కార్ట్, ఒప్పో ఇండియా ఈ-స్టోర్ మరియు ఎంపిక చేసిన ఆఫ్‌లైన్ స్టోర్లలో అమ్మకానికి అందుబాటులో ఉంటాయి. ఎంపిక చేసిన బ్యాంక్ కార్డులపై రూ. 3,000 వరకు ఇన్‌స్టంట్ డిస్కౌంట్, అలాగే తొమ్మిది నెలల వరకు నో-కాస్ట్ EMI సదుపాయం లభిస్తుంది. అదనంగా, ఒప్పో “టర్బో బ్యాక్ క్లిప్” అనే ఎక్స్‌టర్నల్ కూలింగ్ యాక్సెసరీని కూడా విడుదల చేసింది, దీని ధర రూ. 3,999గా ఉంది.
ఈ సిరీస్‌లోని రెండు ఫోన్లు 6.80 అంగుళాల 1.5K (1,280×2,800 పిక్సెల్స్) AMOLED డిస్ప్లేతో వస్తాయి. ఇవి 120Hz రిఫ్రెష్ రేట్, 240Hz టచ్ శాంప్లింగ్ రేట్, 1,600 నిట్స్ గ్లోబల్ బ్రైట్‌నెస్‌ను అందిస్తాయి.ఒప్పో K13 టర్బో మోడల్‌లో మీడియా టెక్ డైమెన్సిటీ 8450 ప్రాసెసర్ ఉండగా, టర్బో ప్రో మోడల్‌లో స్నాప్ డ్రాగన్ 8s జెన్ 4 చిప్‌సెట్ ఉపయోగించారు. రెండూ గరిష్టంగా 12GB RAM, 256GB స్టోరేజ్‌తో వస్తాయి.
ఆండ్రాయిడ్15 బేస్డ్ ColorOS 15.0.2తో విడుదలైన ఈ మోడళ్లకు రెండు సంవత్సరాల వరకు మెజర్ OS అప్‌డేట్లు, మూడు సంవత్సరాల సెక్యూరిటీ అప్‌డేట్లు అందించబడతాయి. కెమెరా పరంగా, ఈ రెండు మోడళ్లలో 50MP మెయిన్ కెమెరా, 2MP సెకండరీ సెన్సార్, అలాగే 16MP ఫ్రంట్ కెమెరా లభిస్తాయి. ఇక కనెక్టివిటీ విషయాన్ని వస్తే 5G, 4G, Wi-Fi 7, బ్లూటూత్ 5.4, GPS, NFC, USB Type-C వంటి కనెక్టివిటీ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. సెక్యూరిటీ ఫీచర్గా ఇన్-డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సర్ ఇచ్చారు. K13 టర్బో బరువు 207 గ్రాములు, ప్రో మోడల్ బరువు 208 గ్రాములు ఉంది. ఈ రెండిటిస్ డైమెన్షన్స్ 162.78×77.22×8.31 మిల్లీమీటర్లు ఉన్నాయి.
ప్రకటన
ప్రకటన