Photo Credit: Poco
భారత్‌లో Poco X7 5G సిరీస్ లాంచ్ అవుతోంది. ఈ లైనప్‌లో Poco X7 5G, Poco X7 Pro 5G స్మార్ట్ ఫోన్‌లు ఉన్నాయి. ఇందులో బేస్ మోడల్ MediaTek Dimensity 7300 అల్ట్రా ప్రాసెసర్‌తో పని చేస్తోంది. అలాగే, 45W వైర్డ్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,500mAh బ్యాటరీతో వస్తోంది. ఇక ప్రో వేరియంట్ MediaTek Dimensity 8400 అల్ట్రా ప్రాసెసర్, 90W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 6,550mAh భారీ బ్యాటరీని కలిగి ఉంది. ఇవి 50-మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా, 20-మెగాపిక్సెల్ సెల్ఫీ షూటర్‌తో వస్తున్నాయి.
Poco X7 5G ధర 8GB + 128GB మోడల్ రూ. 21,999, 8GB + 256GB వేరియంట్ ధర రూ. 23,999గా నిర్ణయించారు. ఈ ఫోన్ కాస్మిక్ సిల్వర్, గ్లేసియర్ గ్రీన్, పోకో ఎల్లో షేడ్స్‌లో వస్తుంది. అలాగే, Poco X7 Pro 5G ఫోన్ 8GB + 256GB కాన్ఫిగరేషన్ ధర రూ. 26,999, 12GB + 256GB వేరియంట్ ధర రూ. 28,999గా ఉంది. ఇది నెబ్యులా గ్రీన్, అబ్సిడియన్ బ్లాక్, పోకో ఎల్లో రంగులలో లభిస్తోంది.
Poco X7 5G ప్రో, వెనిల్లా మోడల్‌లు వరుసగా ఫిబ్రవరి 14, ఫిబ్రవరి 17 నుండి ఫ్లిప్‌కార్ట్ ద్వారా మన దేశంలో కొనుగోలు చేసేందుకు అందుబాటులో ఉంటాయి. ICICI బ్యాంక్ కస్టమర్లు రూ. 2,000 బ్యాంక్ ఆఫర్‌ను పొందొచ్చు. Poco X7 Pro 5G కొనుగోలుదారులు మొదటి రోజు సేల్‌లో అదనంగా రూ. 1,000 డిస్కౌంట్ కూపన్‌ను సొంతం చేసుకోవచ్చు.
Poco X7 5G ఫోన్ 120Hz వరకు రిఫ్రెష్ రేట్, 240Hz టచ్ శాంప్లింగ్ రేట్, 3,000nits వరకు పీక్ బ్రైట్‌నెస్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ప్రొటెక్షన్‌తో 6.67-అంగుళాల 1.5K కర్వ్డ్ AMOLED డిస్‌ప్లేతో వస్తోంది. Poco X7 Pro 5G ఫోన్ 3,200nits పీక్ బ్రైట్‌నెస్ లెవల్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్‌తో 6.73-అంగుళాల 1.5K ఫ్లాట్ AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. వెనిల్లా ఆప్షన్ LPDDR4X RAM, UFS 2.2 ఆన్‌బోర్డ్ స్టోరేజ్‌కు సపోర్ట్ చేస్తుంది.
Poco X7 5G ఫోన్ Android 14-ఆధారిత HyperOSతో రానుంది. Poco X7 Pro 5G ఆండ్రాయిడ్ 15 ఆధారిత HyperOS 2.0 అవుట్-ఆఫ్-ది-బాక్స్‌పై రన్ అవుతోంది. ఈ రెండు హ్యాండ్‌సెట్‌లు మూడు సంవత్సరాల OS అప్‌గ్రేడ్‌లు, నాలుగు సంవత్సరాల సెక్యురిటీ అప్‌డేట్‌లను పొందనున్నాయి. వీటికి 5G, Wi-Fi 6, బ్లూటూత్ 5.3, USB టైప్-C పోర్టులు ఉన్నాయి. ఇవి దుమ్ము, నీటి నియంత్రణ కోసం IP66+IP68+IP69 రేటింగ్‌లను కలిగి ఉన్నాయి. TÜV రీన్‌ల్యాండ్‌లో బ్లూ లైట్, ఫ్లికర్-ఫ్రీ సర్టిఫైడ్, డాల్బీ అట్మాస్‌తో డ్యూయల్ స్టీరియో స్పీకర్‌లతో వస్తున్నాయి.
ప్రకటన
ప్రకటన