ఆపిల్‌తో పాటు Qualcomm కూడా 2nm నోడ్ ఆధారంగా స్నాప్‌డ్రాగన్ ప్రాసెస‌ర్‌ల‌ను లాంఛ్ చేయ‌నుందా

స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ మూడవ తరం ప్రాసెస‌ర్ యొక్క తక్కువ శక్తివంతమైన iteration తో లాంఛ్ చేయ‌వ‌చ్చు. వచ్చే ఏడాది ఆపిల్ 2nm నోడ్ ఆధారంగా దీని A20 ప్రాసెస‌ర్‌ను కూడా ప్రవేశపెట్టనుంది.

ఆపిల్‌తో పాటు Qualcomm కూడా 2nm నోడ్ ఆధారంగా స్నాప్‌డ్రాగన్ ప్రాసెస‌ర్‌ల‌ను లాంఛ్ చేయ‌నుందా

Photo Credit: Qualcomm

స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ చిప్‌సెట్ 2023 నాటి స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 మరియు ప్రస్తుత ఫ్లాగ్‌షిప్ SoCకి వారసుడు.

ముఖ్యాంశాలు
  • SM8950 స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ 2కి 2nm కొన‌సాగింపుగా ఉంటుందని అంచనా
  • SM8945 అండర్‌క్లాక్డ్ GPU కోర్లతో తక్కువ శక్తివంతమైన వేరియంట్ కావచ్చు
  • Qualcomm తయారీకి TSMC, Samsung ఫౌండ్రీ రెండింటినీ ఉపయోగించవచ్చు
ప్రకటన

Qualcomm తమ‌ ఫ్లాగ్‌షిప్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెస‌ర్‌కు successor ని ఈ ఏడాది లాంఛ్ చేయ‌నున్న‌ట్లు వార్త‌లు చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ 3 గా పిలువబడే ఈ ప్రాసెస‌ర్‌ యొక్క successor ని 2nm ప్రాసెస్‌లో తయారు చేయొచ్చు అని ఓ టిప్‌స్టర్ పేర్కొన్నాడు. మెరుగైన లితోగ్రఫీ Qualcomm ఫ్లాగ్‌షిప్ 2026 ప్రాసెసర్‌ కోసం మాత్రమే కాకుండా మరొక వేరియంట్ కోసం కూడా దీనిని రూపొందించ‌నున్న‌ట్లు సూచిస్తోంది. అలాగే, ఇది ఉద్దేశించిన స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ మూడవ తరం ప్రాసెస‌ర్ యొక్క తక్కువ శక్తివంతమైన iteration తో లాంఛ్ చేయ‌వ‌చ్చు. వచ్చే ఏడాది ఆపిల్ 2nm నోడ్ ఆధారంగా దీని A20 ప్రాసెస‌ర్‌ను కూడా ప్రవేశపెట్టనుంది.

SM8950, SM8945 ఆధారంగా

ఇందుకు సంబంధించిన పూర్తి సమాచారం డిజిటల్ చాట్ స్టేషన్ నుండి వచ్చింది. చైనీస్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ వీబోలోని ఒక పోస్ట్‌లో.. టిప్‌స్టర్ Qualcomm 2026 ప్రాసెస‌ర్‌ల గురించిన కీల‌క విష‌యాల‌ను పంచుకున్నారు. అమెరికాకు చెందిన ఈ చిప్‌మేకర్ వచ్చే ఏడాది 2nm నోడ్ - SM8950, SM8945 ఆధారంగా రెండు ప్రాసెస‌ర్‌ల‌ను ప్రారంభించనుందని అంచ‌నా వేస్తున్నారు. ఇది ప్ర‌స్తుతం ఉన్న ప్రాసెస‌ర్‌ల‌తో పోల్చితే శ‌క్తివంత‌మైన‌దిగా కూడా భావించ‌వ‌చ్చు.

శక్తివంతమైన GPUతో

గ‌తంలో వ‌చ్చిన‌ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ 2 కు కొనసాగింపుగా ఇది ఉంటుందని, ప్రీమియం స్మార్ట్ ఫోన్‌ల కోసం ఫ్లాగ్‌షిప్ ప్రాసెసర్‌గా ప్రవేశపెట్టబడుతుందని అంచనా వేస్తున్నారు. అంతే కాదు, రెండోది ఉద్దేశించిన స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ 3 తక్కువ శక్తివంతమైన iteration తో ప్రవేశించవచ్చని భావిస్తున్నారు. ఇది 2nm ప్రాసెస్‌లో కూడా తయారు చేయబడుతుందని భావిస్తున్న‌ప్ప‌టికీ, అండర్‌క్లాక్ చేయబడిన GPU కోర్‌లతో లేదా పూర్తిగా తక్కువ శక్తివంతమైన GPUతో రావచ్చని స‌మాచారం. అయితే, దీనిపై ఎలాంటి స్ప‌ష్ట‌తా లేదు.

TSMC, Samsung Foundry పై

కంపెనీ ఉత్పత్తి ఖర్చులను తగ్గించడానికి, Qualcomm డ్యూయల్-సోర్సింగ్ ప్ర‌ణాళిక‌ను అవలంబిస్తున్నట్లు మార్కెట్ వ‌ర్గాలు అంచ‌నా వేస్తున్నాయి. అందులో భాగంగా, దీని 2026 ఫ్లాగ్‌షిప్ స్మార్ట్ ఫోన్ ప్రాసెస‌ర్‌ తయారీ కోసం ఇది TSMC, Samsung Foundry రెండింటిపై ఆధారపడి ఉండే అవ‌కాశాలు ఉన్నాయి. ఈ ప్రణాళిక పూర్తి స్థాయిలో కార్య‌రూపం దాల్చితే మాత్రం కంపెనీ ఎక్కువ మొత్తంలో ఖ‌ర్చును త‌గ్గించుకున్నట్లు అవుతుంద‌ని మార్కెట్ వ‌ర్గాలు భావిస్తున్నాయి.

ఐఫోన్ 18 మోడళ్లకు శక్తిని

తాజా WCCFTech నివేదిక ప్రకారం, ఆపిల్ కూడా కొత్త ప్ర‌ణాళిక‌ల‌ను వేస్తున్న‌ట్లు స‌మాచారం. ఈ కంపెనీ వచ్చే ఏడాది A20 ప్రోగా పిలువబడే 2nm ప్రాసెస‌ర్‌ను ప్రవేశపెట్టడానికి సిద్ధమవుతోంది. ఇది ఐఫోన్ 18 మోడళ్లకు శక్తినిస్తుందని అంచ‌నా వేస్తున్నారు. ఈ కుపెర్టినో ఆధారిత టెక్నాలజీ దిగ్గజం దీని 2nm నోడ్ కోసం TSMC మొదటి విక్రేత కావచ్చు. TSMC N2 అని పిలవబడే ఇది పవర్ ప్రయోజనాలను కొనసాగిస్తూ ఫుల్‌-నోడ్ పనితీరును అందించే నానోషీట్ ట్రాన్సిస్టర్ నిర్మాణాన్ని అందిస్తుందని సూచిస్తోంది.

Comments

ప్రకటన

ప్రకటన

#తాజా కథనాలు
  1. 30 వేలకే పోకో ఫోన్.. కళ్లు చెదిరే తగ్గింపు
  2. మోటో నుంచి కొత్త మోడల్.. బ్యాటరీ కెపాసిటీ ఎంతంటే
  3. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ 2025లో స్మార్ట్ టీవీలపై అద్భుతమైన ఎర్లీ డీల్స్ అందుబాటులో ఉన్నాయి
  4. ఈ సారి అమెజాన్ ఎకో డివైజ్‌లపై పెద్ద ఎత్తున ఆఫర్లు ఉన్నాయి
  5. AI ఫీచర్లతో గూగుల్ ఫిక్సల్ 10 ప్రో ఫోల్డబుల్ ఫోన్ వచ్చేసింది, ధర ఎంతో తెలుసా
  6. రెడ్మీ 15 5G భారత మార్కెట్లో విడుదల... ధర, ఫీచర్స్, ఇతర స్పెసిఫికేషన్స్ డీటెయిల్స్ మీకోసం
  7. తక్కువ ధరకు 4GB RAMతో Poco M7 Plus 5G కొత్త వేరియంట్ ఫోన్, త్వరలో ఫ్లిప్‌కార్ట్‌లో సేల్స్ ప్రారంభం
  8. iQOO 15 హ్యాండ్‌సెట్ ఫోటోలు లీక్, వేర్వేరు కలర్స్‌లో సరికొత్త లుక్‌లో హ్యాండ్‌సెట్
  9. సెప్టెంబర్ 19 నుంచి ఇవ్వాల్సిన డెలివరీలు వాయిదా పడుతున్నాయి
  10. రియల్ మీ P3 Lite 5G ధరను రియల్‌ మీ చాలా ఆకర్షణీయంగా నిర్ణయించింది.
© Copyright Red Pixels Ventures Limited 2025. All rights reserved.
Trending Products »
Latest Tech News »