Photo Credit: Realme
భారతీయ మొబైల్ మార్కెట్‌లోకి చాలా రోజులకు Realme తన కొత్త Realme GT 7 ప్రోని లాంచ్ చేసింది. రెండేళ్ల క్రితం.. అంటే, 2022లో విడుదలైన Realme GT 2 ప్రో తర్వాత GT ప్రో మోడల్ నుంచి వచ్చిన కొత్త మోడల్ Realme GT 7 ప్రో. గతంలో వచ్చిన మోడల్‌ల కంటే ఈ Realme GT 7 ప్రో అనేక అప్‌గ్రేడ్‌లతోపాటు కొత్త హార్డ్‌వేర్‌ను కంపెనీ పరిచయం చేస్తోంది. చాలాకాలంగా GT 7 ప్రోని ప్రత్యేకంగా చూపించేందుకు ప్రయత్నం చేస్తూనే ఉంది. అయితే, ఎవ్వరూ ఊహించని విధంగా ఈ కొత్త ఫోన్ ధర మునుపటి మోడల్ కంటే చాలా ఎక్కువగా నిర్ణయించారు.
Realme GT 7 Pro ప్రారంభ ధర మన దేశీయ మార్కెట్‌లో 12GB + 256GB వేరియంట్ రూ. 59,999గా నిర్ణయించారు. 16GB + 512GB వేరియంట్ ధర రూ. 65,999గా ఉంది. ఈ హ్యాండ్‌సెట్ నవంబర్ 29 మధ్యాహ్నం 12 గంటల నుంచి Realme అధికారిక వెబ్‌సైట్‌తోపాటు అమెజాన్‌లో కొనుగోలుకు అవకాశం కల్పించారు. GT 7 ప్రో మార్స్ ఆరెంజ్, గెలాక్సీ గ్రే అనే రెండు ఆకర్షణీయమైన రంగులలో లభిస్తుంది. Realme GT 7 Pro ఫుల్-HD+ రిజల్యూషన్‌తో గరిష్టంగా 120Hz స్క్రీన్ రిఫ్రెష్ రేట్‌ను అందించే 6.78-అంగుళాల LTPO AMOLED ప్యానెల్‌తో వస్తోంది. డాల్బీ విజన్, HDR10+ కంటెంట్‌కు కూడా సపోర్ట్ చేస్తుంది. 162.45x76.89x8.55mm పరిమాణంతో 222 గ్రాముల బరువుతో అందుబాటులోకి వస్తుంది.
న్యూ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్‌తో మనదేశంలో వచ్చిన మొదటి స్మార్ట్‌ఫోన్‌గా Realme GT 7 Pro గుర్తింపు పొందింది. ఇది గరిష్టంగా 16GB LPDDR5X RAM, 512GB వరకు UFS 4.0 స్టోరేజీతో అటాచ్ చేయబడింది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న స్నాప్‌డ్రాగన్ 8 Gen 3 ప్రాసెసర్ కంటే దీని పనితీరు మరింత మెరుగ్గా ఉంటుందని కంపెనీ చెబుతోంది. ఈ Realme GT 7 Pro ఫోన్ కెమెరా గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఇందులో సోనీ IMX906 50-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, సోనీ IMX882 50-మెగాపిక్సెల్ టెలిఫోటో కెమెరా, సోనీ IMX355 8-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ కెమెరాను అందించారు. సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం 16-మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాను అమర్చారు. ఇది Android 15 ఆధారిత Realme UI 6.0లో రన్ అవుతుంది.
కంపెనీ మూడు సంవత్సరాల సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌లు, నాలుగు సంవత్సరాల సెక్యూరిటీ అప్‌డేట్‌లను అందిస్తున్నట్లు కంపెనీ ధృవీకరించింది. ఇదే మోడల్ చైనాలో 6,500mAh బ్యాటరీతో విడుదలకాగా, ఇండియాలో మాత్రం Realme 5,800mAh బ్యాటరీతో మార్కెట్‌లోకి తీసుకువస్తోంది. ఈ ఫోన్ చైనా వేరియంట్ మాదిరిగానే 120W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. ఇది 30 నిమిషాల్లో 1 నుండి 100 శాతం వరకు ఛార్జ్ అవుతుందని కంపెనీ చెబుతోంది.
ప్రకటన
ప్రకటన