Photo Credit: Realme
భారత్‌లో వచ్చే ఏడాదికి Realme Narzo 80 Ultra ఫోన్ లాంచ్ కావచ్చని ఓ నివేదిక ఆదారంగా వెల్లడైంది. అలాగే, Narzo సిరీస్ స్మార్ట్ ఫోన్‌లలో రాబోయే ఈ మోడల్ అల్ట్రా-బ్రాండెడ్‌గా ఇందులో పేర్కొన్నారు. అంతేకాదు, Narzo 80 Ultra లాంచ్ టైమ్‌లైన్, దీని స్టోరేజ్ కెపాసిటీ వివరాలు కూడా బహిర్గతం అయ్యాయి. త్వరలోనే Realme Narzo 70 Curve హ్యాండ్‌సెట్ మన దేశంలో లాంచ్ కానున్నట్లు నివేదికలో వెల్లడైంది. అలాగే, ఈ వారంలోనే Realme 14x ఫోన్‌ను దేశీయ మార్కెట్‌లోకి కంపెనీ విడుదల చేసింది. మరి, Narzo సిరీస్ నుంచి వస్తోన్న ఈ సరికొత్త మోడల్ గురించిన వివరాలు తెలుసుకుందామా!
RMX5033 మోడల్ నంబర్‌తో భారత్‌లోకి Realme Narzo 80 Ultra స్మార్ట్ ఫోన్ తర్వలోనే అడుగుపెట్టనున్నట్లు మార్కెట్ వర్గాలకు వెల్లడయ్యేలా ఓ నివేదిక ద్వారా బహిర్గతమైంది. ఈ స్మార్ట్ ఫోన్ 2025 జనవరి చివరి నాటికి కంపెనీ నుంచి లాంచ్ కాబోతున్న మొదటి Narzo Ultra మోడల్‌గా దేశీయ మార్కెట్‌లో విడుదల కాబోతున్నట్లు పేర్కొంది. దీంతో ఈ నివేదికపై మార్కెట్ వర్గాలలో మరింత ఆసక్తి నెలకొంది.
ఈ లీకైన మోనికర్ ప్రకారం.. Realme Narzo 80 Ultra హ్యాండ్‌సెట్ ఈ Narzo సిరీస్‌లోనే అత్యంత సామర్థ్యం గల మోడల్‌గా మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. అంతేకాదు, ఈ హ్యాండ్‌సెట్ వైట్ గోల్డ్ రంగులో అందుబాటులోకి రానున్నట్లు నివేదికలో వెల్లడైంది. అలాగే, ఇది 8GB RAM, 128GB ఇన్‌బిల్డ్ స్టోరేజీతో అటాచ్ చేయబడినట్లు చెబుతోంది. ఇదే సందర్భంలో ఈ స్మార్ట్ ఫోన్ ఇతర RAM, స్టోరేజీ కాన్ఫిగరేషన్‌లలోనూ లభించే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు.
మరో నివేదికలో మోడల్ నంబర్ RMX5030 (Realme P3 అల్ట్రాగా భావిస్తున్నారు)తో కూడిన ఫోన్ 2025 జనవరి చివరి నాటికి మన దేశంలో లాంచ్ కానున్నట్లు అంచనా వేస్తోంది. ఇది గరిష్టంగా 12GB RAM, 256GB వరకు ఆన్‌బోర్డ్ స్టోరేజీని కలిగి ఉండొచ్చని చెబుతోంది. అలాగే, ఈ కంపెనీ సెప్టెంబర్‌లో మన దేశీయ మార్కెట్‌లోకి Realme P2 Pro 5G స్మార్ట్ ఫోన్‌ను పరిచయం చేసిన విషయం తెలిసిందే. దీని 8GB + 128GB వేరియంట్ ధర రూ. 21,999గా మార్కెట్‌లో అందుబాటులో ఉంది. అయితే, ఈ కొత్త మోడల్స్‌కు సంబంధించిన ధరల వివరాలు ఇంకా బహిర్గతం కాలేదు.
Realme Narzo 70 Curve ఫోన్ మోడల్ నంబర్ RMX3990తో వీటితోపాటు ఈ నెల చివరి నాటికి భారత్‌లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. అలాగే, ఈ స్మార్ట్ ఫోన్‌ను విడుదలకు సంబంధించి కంపెనీ ఎలాంటి ప్రకటన కూడా వెలువరించలేదు. ఇదే సమయంలో ఈ ఈ హ్యాండ్‌సెట్‌ను కూడా వచ్చే ఏడాదికి విడుదల చేసే అవకా
ప్రకటన
ప్రకటన