Photo Credit: Realme
చైనాలో ఈ ఏడాది డిసెంబర్‌లోనే Realme Neo 7 లాంచ్ కాబోతున్నట్లు స్పష్టమైంది. అయితే, విడుడదలకు సంబంధించిన ఖచ్చితమైన తేదీపై మాత్రం ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. ఇదిలా ఉంటే, లాంచ్‌కు ముందే రాబోయే స్మార్ట్ ఫోన్ ధర, బిల్డ్, బ్యాటరీ వివరాలను కంపెనీ టీజ్ చేసింది. ఈ హ్యాండ్‌సెట్ MediaTek డైమెన్సిటీ 9300+ ప్రాసెసర్, 7000mAh బ్యాటరీ సామర్థ్యంతో రాబోతోంది. అలాగే, Realme Neo 7 ఫోన్‌లు కూడా Realme GT Neo 6, GT Neo 6 SEల మాదిరిగానే మంచి సేల్‌ను అందుకుంటాయని కంపెనీ భావిస్తోంది.
చైనాలో Realme Neo 7 ధర CNY 2,499 (సుమారు రూ. 29,100) వద్ద ప్రారంభం కానున్నట్లు కంపెనీ Weibo పోస్ట్‌లో వెల్లడించింది. అలాగే, ఈ హ్యాండ్‌సెట్ 2 మిలియన్ పాయింట్ల కంటే ఎక్కువ AnTuTu స్కోర్‌ని కలిగి ఉందని స్పష్టం చేసింది. దీంతోపాటు 6500mAh కంటే ఎక్కువ సామర్థ్యం కలిగిన బ్యాటరీతోపాటు దుమ్ము, నీటిని నియంత్రించేందుకు IP68 కంటే ఎక్కువ రేటింగ్‌ను కలిగి ఉంటుందని కంపెనీ పోస్ట్‌లో స్పష్టతను ఇచ్చింది.
చైనాలోని Realme అధికారిక Realme ఈ-స్టోర్‌తోపాటు ఇతర ఈ-కామర్స్ సైట్‌ల ద్వారా Neo 7 కోసం ముందస్తు బుకింగ్‌లు చేసుకునేందుకు అవకాశం కల్పించింది. అలాగే, ఈ స్మార్ట్ ఫోన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను లాంచ్‌కు కొన్ని రోజుల ముందు వెల్లడి కానున్నట్లు మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. దీంతో ఈ ఫీచర్స్‌తో వచ్చే ఇతర మోడల్స్‌కు ఇది మంచి పోటీ ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
Realme Neo 7 ఫోన్ AnTuTu స్కోర్ 2.4 మిలియన్ కంటే ఎక్కువగా ఉన్నట్లు గతంలోనే బహిర్గతమైన విషయం తెలిసిందే. అంతేకాదు, ఇది MediaTek డైమెన్సిటీ 9300+ ప్రాసెసర్, 7000mAh భారీ బ్యాటరీతో రానున్నట్లు కూడా వెల్లడైంది. అలాగే, ఈ స్మార్ట్ ఫోన్ దుమ్ము, నీటి నియంత్రణ కోసం IP68 నుంచి IP69 రేటింగ్‌లతో వచ్చే అవకాశం ఉన్నట్లు భావిస్తున్నారు. ఈ అంశం Neo 7 మోడల్‌కు ఆదనపు ఆకర్షణగా నిలుస్తుంది.
గతంలోనే చైనా 3C సర్టిఫికేషన్ సైట్‌లోని లిస్టింగ్ ప్రకారం.. 80W వైర్డు SuperVOOC ఛార్జింగ్‌కు సపోర్ట్‌తో Realme Neo 7 లాంచ్ కానున్నట్లు స్పష్టమైంది. అలాగే, ఈ హ్యాండ్‌సెట్ పెద్ద 1.5K రిజల్యూషన్ డిస్‌ప్లేతో రావచ్చని కూడా ప్రచారంలో ఉంది. ప్రస్తుతం మార్కెట్‌లో అందుబాటులో ఉన్న Realme GT Neo 6 స్మార్ట్ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 8s Gen 3 ప్రాసెసర్, 120W ఛార్జింగ్ సపోర్ట్‌తో 5500mAh బ్యాటరీ, 6.78-అంగుళాల 1.5K 8T LTPO AMOLED స్క్రీన్‌తో వస్తోంది. చైనాలో ఈ మోడల్ 12GB + 256GB వేరియంట్ ధర CNY 2,099 (దాదాపు రూ. 22,000) వద్ద ప్రారంభమవుతుందన్న విషయం తెలిసిందే.
ప్రకటన
ప్రకటన