ఈ డ్యూయల్ సిమ్ సపోర్ట్ కలిగిన ఈ ఫోన్ రీయల్ మీ UI 6.0 ఆండ్రాయిడ్ 15 పై నడుస్తుంది. 6.67-అంగుళాల HD+ డిస్ప్లే (720×1,604 పిక్సెల్స్ రిజల్యూషన్) 120Hz రిఫ్రెష్ రేట్ మరియు 625 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ తో వస్తుంది
Photo Credit: Realme
రియల్‌మే పి3 లైట్ 5జిలో 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.67-అంగుళాల డిస్‌ప్లే ఉంది
రియల్ మీ తన కొత్త స్మార్ట్‌ఫోన్ రియల్ మీ P3 Lite 5G ను భారత మార్కెట్లో విడుదల చేసింది. P సిరీస్‌లోకి వచ్చిన ఈ తాజా మోడల్ లిల్లీ వైట్, పర్పుల్ బ్లాసమ్, మరియు మిడ్‌నైట్ లిల్లీ అనే మూడు అందమైన కలర్ ఆప్షన్లలో అందుబాటులోకి వచ్చింది. దీన్ని శక్తివంతమైన 6,000mAh భారీ బ్యాటరీ, అలాగే 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ లభిస్తుంది.ధర మరియు అందుబాటు,రియల్ మీ P3 Lite 5G ధరను రియల్ మీ చాలా ఆకర్షణీయంగా నిర్ణయించింది. 4GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.12,999 అలాగే 6GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.13,999గా నిర్ణయించింది. ప్రత్యేక ప్రారంభ ఆఫర్ కింద ఈ రెండు వేరియంట్లు వరుసగా రూ.10,499 మరియు రూ.11,499లకు లభ్యం కానున్నాయి. ఈ ఫోన్ సెప్టెంబర్ 22 అర్థరాత్రి 12 గంటల నుంచి ఫ్లిప్ కార్ట్ మరియు రియల్ మీ అధికారిక వెబ్‌సైట్‌లో అమ్మకానికి సిద్ధంగా ఉంటుంది.
డ్యూయల్ సిమ్ సపోర్ట్ కలిగిన ఈ ఫోన్ రీయల్ మీ UI 6.0 ఆండ్రాయిడ్ 15 పై నడుస్తుంది. 6.67-అంగుళాల HD+ డిస్ప్లే (720×1,604 పిక్సెల్స్ రిజల్యూషన్) 120Hz రిఫ్రెష్ రేట్ మరియు 625 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ తో వస్తుంది. ఇది డే-టు-డే యూజ్‌లో కూడా కళ్ళకు హాయిగా అనిపించే విజువల్ క్వాలిటీ ఇస్తుంది.అదనంగా, IP64 రేటింగ్ ఉండటం వల్ల ఇది డస్ట్ మరియు వాటర్ అసిస్టెంట్ సర్టిఫికేషన్ కూడా లభించనుంది.
ఈ ఫోన్‌లో మీడియా టెక్ డైమెన్సిటీ 6300 చిప్‌సెట్‌తో పాటు గరిష్టంగా 6GB RAM అందిస్తున్నారు. స్టోరేజ్ ను 128GB వరకు అందిస్తున్నారు మరియు మైక్రోSD కార్డ్ ద్వారా 2TB వరకు విస్తరించుకోవచ్చు. అదనంగా, 18GB వరకు వర్చువల్ RAM సపోర్ట్ కూడా ఉంది. ఇది మల్టీ టాస్కింగ్ పర్పస్ కి బాగా యూస్ అవుతుంది.
కెమెరా సెక్షన్ లో 32MP రియర్ కెమెరా (f/1.8 అపర్చర్ తో) స్పష్టమైన ఫోటోలు ఇస్తుంది. సెల్ఫీలు మరియు వీడియో కాల్స్ కోసం 8MP ఫ్రంట్ కెమెరా ఉంది. అదనంగా, "రెయిన్‌వాటర్ స్మార్ట్ టచ్" అనే ప్రత్యేక ఫీచర్ తో తడి చేతులతో కూడా ఫోన్‌ను సులభంగా ఉపయోగించవచ్చు.
కనెక్టివిటీ పరంగా 5G, 4G LTE, Wi-Fi, Bluetooth 5.3, GPS, USB Type-C పోర్ట్ లు అందుబాటులో ఉన్నాయి. Hi-Res ఆడియో సర్టిఫికేషన్ మరియు OReality ఆడియో సపోర్ట్ ఉన్న స్పీకర్లు వినియోగదారులకి అద్భుతమైన ఆడియో అనుభవాన్ని అందిస్తాయి. సెన్సర్లలో యాక్సిలరేషన్ సెన్సర్, ఫింగర్‌ప్రింట్ సెన్సర్, ఫ్లికర్ సెన్సర్, లైట్ సెన్సర్ మరియు జియోమాగ్నెటిక్ సెన్సర్ ఉన్నాయి.
ఈ ఫోన్ మిడ్ రేంజ్ బడ్జెట్లో ఇతర కంపెనీల ఫోన్లకు గట్టి కాంపిటీషన్ ఇచ్చే అవకాశం ఉంది. రియల్ మీ అభిమానులు ఈ ఫోన్ లాంచింగ్ కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.
ప్రకటన
ప్రకటన