రియల్‌మే పి3 లైట్ 5జి లిల్లీ వైట్, పర్పుల్ బ్లోసమ్ మరియు మిడ్‌నైట్ లిల్లీ రంగులలో లభిస్తుందని నిర్ధారించబడింది
Photo Credit: Realme
రియల్‌మే పి3 లైట్ 5జి లిల్లీ వైట్, పర్పుల్ బ్లోసమ్ మరియు మిడ్‌నైట్ లిల్లీ రంగులలో లభిస్తుందని నిర్ధారించబడింది
రియల్ మీ తన కొత్త స్మార్ట్‌ఫోన్ రియల్ మీ P3 లైట్ 5G ను సెప్టెంబర్ 13న భారత మార్కెట్లో విడుదల చేయడానికి సిద్ధమైంది. అధికారిక లాంచ్‌కు కేవలం కొన్ని రోజులు ముందే, ఈ ఫోన్ ధర మరియు వేరియంట్ వివరాలు ఫ్లిప్‌కార్ట్‌లో డిస్ప్లే అయ్యాయి. కంపెనీ ఇప్పటికే ఈ ఫోన్‌లో మీడియాటెక్ డైమెన్సిటీ 6300 5G చిప్‌సెట్, భారీ 6,000mAh బ్యాటరీ మరియు 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటాయని ధృవీకరించింది. ఈ ఫోన్ మూడు ప్రత్యేక కలర్ ఆప్షన్‌లలో లభించనుంది. అలాగే 6.67 అంగుళాల డిస్‌ప్లే, 32MP రియర్ కెమెరా మరియు 8MP సెల్ఫీ కెమెరా వంటి ముఖ్య ఫీచర్లు అందించనుంది.
ఫ్లిప్‌కార్ట్‌లో లిస్టింగ్ ప్రకారం, రియల్ మీ P3 లైట్ 5G ధర రూ.12,999 వద్ద ప్రారంభమవుతుంది, ఇది 4GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్‌కి వర్తిస్తుంది. 6GB RAM + 128GB స్టోరేజ్ మోడల్ ధర రూ.13,999గా ఉంది. అదనంగా, ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ లేదా ఫ్లిప్‌కార్ట్ SBI క్రెడిట్ కార్డ్ ద్వారా చెల్లింపు చేస్తే 5% క్యాష్‌బ్యాక్ ఆఫర్ లభిస్తుంది. ప్రస్తుతం ఫోన్ కమింగ్ సూన్ ట్యాగ్‌తో కనిపిస్తుంది. ఈ ఫోన్ అఫీషియల్ సేల్ డేట్ సెప్టెంబర్ 13న లాంచ్ సమయంలో ప్రకటించే అవకాశం ఉంది.
ఈ స్మార్ట్‌ఫోన్ లిల్లీ వైట్, పర్పుల్ బ్లాసమ్ మరియు మిడ్‌నైట్ లిల్లీ కలర్ ఆప్షన్‌లలో అందుబాటులో ఉంటుంది. ఇది ఆండ్రాయిడ్ 15 బేస్డ్ రియల్ మీ UI 6.0 తో వస్తుంది. 6.67-అంగుళాల HD+ డిస్‌ప్లే (720×1,604 పిక్సెల్స్ రిజల్యూషన్), 120Hz రిఫ్రెష్ రేట్, 625 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ ను కలిగి ఉంటుంది.
ఫోన్ లోపల ఆక్టా-కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్‌సెట్ పనిచేస్తుంది. ఫోన్ వెనుక భాగంలో 32MP కెమెరా యూనిట్, ముందు భాగంలో 8MP సెల్ఫీ కెమెరా ఉంటుంది. IP64 రేటింగ్ కలిగిన ఈ ఫోన్ డస్ట్ మరియు స్ప్లాష్ ప్రూఫ్ డిజైన్ తో వస్తుంది.
బ్యాటరీ విషయానికి వస్తే, రియల్‌మీ P3 లైట్ 5Gలో 6,000mAh బ్యాటరీ ఉంటుంది, ఇది 45W ఫాస్ట్ ఛార్జింగ్ మరియు 5W రివర్స్ ఛార్జింగ్ సపోర్ట్‌ను అందిస్తుంది. ఫోన్ మందం కేవలం 7.94mm మాత్రమే ఉండడం వలన ఇది సన్నగా, స్టైలిష్‌గా ఉంటుంది. ఈ ఫోన్ స్పెసిఫికేషన్లో మరియు ధరను బట్టి పరిశీలిస్తే ఇది మిడిల్ క్లాస్ బడ్జెట్ ఫోన్ గా తెలుస్తుంది. ఈ కేటగిరీలో ఉన్న మిగతా ఫోన్లకు ఈ ఫోన్ లాంచ్ అయిన తర్వాత కాంపిటీషన్ గా నిలిచి అవకాశం ఉంటుంది.
ప్రకటన
ప్రకటన