Photo Credit: Realme
తాజా నివేదిక ప్రకారం Realme P3 Ultra త్వరలోనే భారత్‌లో విడుదల కానుంది. ఈ ఏడాది అక్టోబర్‌లో Realme P1 స్పీడ్ లాంచ్ తర్వాత Realme P సిరీస్ నుంచి ఇండియాలో అడుగుపెడుతోన్న హ్యాండ్‌సెట్ ఇదే. ఈ తాజా స్మార్ట్ ఫోన్ గరిష్టంగా 12GB RAM, 256GB వరకు ఆన్‌బోర్డ్ స్టోరేజ్‌తో రూపొందించబడింది. ఇదే సమయంలో ఈ చైనీస్ స్మార్ట్ ఫోన్ తయారీదారు భారత్‌లో Realme 14x మోడల్‌ను లాంచ్ చేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. మరెందుకు ఆలస్యం.. ఈ Realme P3 Ultra ఫోన్‌కు సంబంధిచిన కీలక అంశాలను చూసేద్దాం రండి!
తాజాగా ఆన్‌లైన్‌లో లభిస్తోన్న నివేదిక ప్రకారం, Realme P3 Ultra ఫోన్ జనవరి 2025 చివరి నాటికి భారత్‌లో లాంచ్ కానుంది. అలాగే, ఈ హ్యాండ్‌సెట్ మోడల్ నంబర్ RMX5030తో రన్ చేయబడుతున్నట్లు నివేదికలో వెల్లడైంది. అలాగే, ఇది గరిష్టంగా 12GB RAM, 256GB వరకు ఆన్‌బోర్డ్ స్టోరేజ్‌తో లభించనుంది. Realme P సిరీస్‌లో అల్ట్రా మోడల్ కొత్త వేరియంట్ అని, ఇది P3లో భాగంగా బేస్, ప్రో మోడళ్లు కూడా చేరవచ్చని అంచనా వేస్తున్నారు. ఈ హ్యాండ్‌సెట్ గ్లాస్ బ్యాక్ ప్యానెల్‌తో బూడిద రంగు కలర్‌వేలో కనిపిస్తోంది.
ఈ డెవలప్‌మెంట్ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) సర్టిఫికేషన్ వెబ్‌సైట్‌లో రెండు Realme స్మార్ట్ ఫోన్‌ల రిపోర్టులను సూచిస్తూ, భారత్‌లో వీటి విడుదల సమయాన్ని ధృవీకరిస్తోంది. ముఖ్యంగా, Realme P2 Pro మోడల్ ప్రస్తుతానికి కంపెనీ లైనప్‌లో అత్యంత ఖరీదైన P సిరీస్ స్మార్ట్ ఫోన్‌గా ఉంది. ఈ మోడల్‌కు సంబంధించిన మోనికర్ ప్రకారం, Realme P3 అల్ట్రా ఫీచర్లను మరింత మెరుగుపరుస్తుందని అంచనా వేయవచ్చు.
Realme P2 Pro 5G ఫోన్ 120Hz వరకు రిఫ్రెష్ రేట్, 2,000 యూనిట్ల గరిష్ట బ్రైట్‌నెస్‌తో కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i ప్రొటక్షన్‌ను కలిగి ఉంటుంది. అలాగే, 6.7-అంగుళాల ఫుల్-HD+ 3D కర్వ్డ్ AMOLED స్క్రీన్‌ను అందించారు. ఈ హ్యాండ్‌సెట్ 4nm ఆక్టా-కోర్ స్నాప్‌డ్రాగన్ 7s Gen 2 ప్రాసెసర్‌తో శక్తిని గ్రహిస్తు, అడ్రినో 710 GPUతో అటాచ్ చేయబడి ఉంటుంది. అలాగే, 12GB వరకు LPDDR4x RAM, 512GB UFS 3.1 ఆన్‌బోర్డ్ స్టోరేజీని అందించారు. ఇది Android 14-ఆధారిత Realme UI 5తో రన్ అవుతుంది.
కెమెరా విషయానికి వస్తే.. Realme P3 అల్ట్రా డ్యూయల్ రియర్ కెమెరా యూనిట్‌తో వస్తోంది. ఇందులో 50-మెగాపిక్సెల్ Sony LYT-600 ప్రైమరీ సెన్సార్‌తో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS), 8 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ షూటర్‌ను అమర్చారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం దీని ముందు భాగంలో 32-మెగాపిక్సెల్ కెమెరాను అందించారు. అలాగే, ఈ హ్యాండ్‌సెట్ 80W వైర్డు SuperVOOC ఛార్జింగ్‌కు సపోర్ట్‌తో 5,200mAh బ్యాటరీని కలిగి ఉంటుంది.
ప్రకటన
ప్రకటన