Photo Credit: Realme
Realme P3 Pro 5G గెలాక్సీ పర్పుల్ (చిత్రంలో), నెబ్యులా గ్లో మరియు సాటర్న్ బ్రౌన్‌లో అందుబాటులో ఉంది
కంపెనీ మిడ్‌రేంజ్ P సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లలో భాగంగా మన దేశంలో Realme P3x 5Gతో పాటు Realme P3 Pro 5Gని లాంఛ్ చేసింది. ఈ స్మార్ట్ ఫోన్‌లు 50-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 6000mAh బ్యాటరీతో రూపొందించబడి ఉన్నాయి. Realme P3 Pro 5G స్నాప్‌డ్రాగన్ 7s Gen 3 చిప్‌సెట్‌తో నడుస్తుంది. Realme P3x 5G ఇటీవల ప్రారంభించబడిన MediaTek డైమెన్సిటీ 6400 ప్రాసెసర్‌ని కలిగి ఉంది. ఇవి Realme UI 6.0 యూజర్ ఇంటర్‌ఫేస్‌తో Android 15పై నడుస్తాయి.
ఇండియాలో Realme P3 Pro 5G ధర 8GB RAM, 128GB స్టోరేజ్ కలిగిన బేస్ మోడల్ రూ. 23,999 నుండి ప్రారంభమవుతోంది. ఈ హ్యాండ్‌సెట్ 8GB+256GB, 12GB+256GB వేరియంట్‌లలోనూ అందుబాటులో ఉంది. వీటి ధర వరుసగా రూ. 24,999, రూ. 26,999గా ఉంది. ఫిబ్రవరి 25 నుండి కంపెనీ వెబ్‌సైట్‌తోపాటు ఫ్లిప్‌కార్ట్ ద్వారా గెలాక్సీ పర్పుల్, నెబ్యులా గ్లో, సాటర్న్ బ్రౌన్ కలర్ ఆప్షన్‌లలో లభించనుంది.
Realme P3x 5G ధర 6GB+128GB, 8GB+128GB RAM స్టోరేజ్ కాన్ఫిగరేషన్‌లలో వరుసగా రూ. 13,999, రూ. 14,999గా కంపెనీ నిర్ణయించింది. ఇది ఫిబ్రవరి 28న మన దేశంలో Realme వెబ్‌సైట్, Flipkart ద్వారా లూనార్ సిల్వర్, మిడ్‌నైట్ బ్లూ, స్టెల్లార్ పింక్ అనే మూడు కలర్ ఆప్షన్‌లలో లభిస్తాయి. దీంతోపాటు బ్యాంక్ కార్డ్ ఆఫర్‌లతో Realme P3 Pro 5Gపై రూ. 2,000, Realme P3x 5G పై రూ. 1,000 తగ్గింపును పొందొచ్చు.
కంపెనీ P3 Pro 5Gలో 6.83-అంగుళాల 1.5 కె (1,472x2,800 పిక్సెల్స్) క్వాడ్ కర్వ్డ్ అమోలెడ్ స్క్రీన్‌ను 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 450 పిపి పిక్సెల్స్ డెన్సిటీతో అందించింది. అలాగే, P3x 5Gలో 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌తో 6.7-అంగుళాల ఫుల్-హెచ్‌డి+ (1,080x2,400 పిక్సెల్స్) ఎల్‌సిడి స్క్రీన్ ఉంటుంది.
P3 Pro 5Gలో Sony IMX896 సెన్సార్, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్‌తో కూడిన 50-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఉంది. ముందుభాగంలో Sony IMX480 సెన్సార్‌తో కూడిన 16-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను అందించారు. P3x 5Gలో 50-మెగాపిక్సెల్ వెనుక కెమెరా, 8-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉన్నాయి. ఇవి USB టైప్-C పోర్ట్‌తో పాటు 5G, 4G LTE, Wi-Fi, బ్లూటూత్, GPS కనెక్టివిటీకి సపోర్ట్ చేస్తాయి.
P3 Pro 5G, P3x 5G రెండింటికీ 80W, 45W వద్ద ఛార్జ్ చేయగల 6000mAh బ్యాటరీలను అందించారు. మిలిటరీ గ్రేడ్ షాక్ రెసిస్టెన్స్, దుమ్ము- నీటి నియంత్రణకు IP68+IP69 రేటింగ్‌లను కలిగి ఉన్నాయి. అలాగే, P3 Pro 5Gలో కొన్ని AI ఫీచర్స్‌ను అందించారు. వీటిలో AI బెస్ట్ ఫేస్, AI ఎరేస్ 2.0, AI మోషన్ డెబ్లర్, AI రిఫ్లెక్షన్ రిమూవర్ ఉన్నాయి.
ప్రకటన
ప్రకటన