Photo Credit: Xiaomi
ఈ వారం Redmi K80 సిరీస్ 120W వైర్డు, 50W వైర్‌లెస్ ఛార్జింగ్‌కు సపోర్ట్‌తో, 6000mAh బ్యాటరీతో అధికారికంగా అందుబాటులోకి రానుంది. అలాగే, ఈ చైనీస్ టెక్ దిగ్గజం భారీ బ్యాటరీతో మరొక స్మార్ట్‌ఫోన్‌ను కూడా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు చైనీస్ టిప్‌స్టర్ ఇటీవల బహిర్గతం చేసింది. ఈ కొత్త Xiaomi స్మార్ట్‌ఫోన్‌లో 90W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 7,000mAh భారీ బ్యాటరీని అందిస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు, రాబోయే ఈ స్మార్ట్ ఫోన్ స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్‌తో లాంచ్ కానున్నట్లు మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. మరెందుకు ఆలస్యం.. ఆ విశేషాలేంటో చూసేద్దామా.
టిప్‌స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ Weiboలో Xiaomi హ్యాండ్‌సెట్ 7,000mAh బ్యాటరీతో వస్తున్నట్లు పేర్కొంది. అలాగే, ఇది స్నాప్‌డ్రాగన్ 8s Gen 3కి కొనసాగింపుగా భావిస్తున్న SM8735 ప్రాసెసర్‌పై రన్ అవుతుందని సూచిస్తోంది. ఈ ప్రాసెసర్‌ని స్నాప్‌డ్రాగన్ 8s Elite లేదా స్నాప్‌డ్రాగన్ 8s Gen 4 అని పిలిచే అవకాశం ఉంది. అలాగే, Xiaomi ఫోన్ 90W వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇవ్వడంతోపాటు ఇది మిడ్ రేడ్ డ్రైవ్‌గా రావచ్చని భావిస్తున్నారు. అయితే, దీనిపై మాత్రం పూర్తి స్పష్టత రావాలసి ఉందని మార్కెట్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
దీనిపై పలు భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే, Samsung, Tecno, Itel, Oukitel లాంటి బ్రాండ్‌ల నుంచి Xiaomi కంటే పెద్ద బ్యాటరీ సామర్థ్యం గల కొన్ని స్మార్ట్ ఫోన్‌లు రావడంతో 7,000mAh బ్యాటరీతో వచ్చిన మొదటి ఫోన్‌గా దీనిని భావించలేము. అయితే, ఇది చాలా మెయిన్ స్ట్రీమ్ Android ఫోన్‌ల కంటే ముందు ఉందని మాత్రం చెప్పొచ్చు. OnePlus, Realme, Honorతో సహా పలు చైనీస్ బ్రాండ్‌లు తమ హ్యాండ్‌సెట్‌లలో అధిక సామర్థ్యం అందించే సిలికాన్ ఆధారిత బ్యాటరీలను ఉపయోగించడం మొదలుపెట్టాయి. ఈ వినియోగం ముమ్మాటికీ మంచి పరిణామంగానే భావించవచ్చని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.
అయితే, Xiaomi 7,000mAh బ్యాటరీ ఫోన్ లాంచ్ గురించిన అధికారిక ప్రకటన వెలువడకపోవడంతో ఇవి ఊహాగానాలుగానే మిగిలిపోయాయి. ఇటీవలే విడుదలైన OnePlus 13 స్మార్ట్ ఫోన్ 6,000mAh బ్యాటరీతో అందుబాటులోకి వచ్చిన విషయం తెలిసిందే. అయితే, iQOO 13 చైనీస్ వేరియంట్ 6,150mAh కలిగి ఉంది. అలాగే, రాబోయే Realme Neo 7 మోడల్ 7,000mAh బ్యాటరీని కలిగి ఉంటుందని ప్రచారంలో ఉంది.
Realme GT 7 Pro చైనీస్ వెర్షన్ కూడా 6,500mAh బ్యాటరీతో వచ్చింది. దాదాపు అన్ని Xiaomi, Redmi స్మార్ట్‌ఫోన్‌లు 5,000mAh బ్యాటరీలతోనే అందుబాటులోకి వస్తున్నాయి. అంతేకాదు, ఈ రాబోయే Redmi K80 సిరీస్ 120W వైర్డు, 50W వైర్‌లెస్ ఛార్జింగ్‌కు సపోర్ట్‌తో 6,000mAh బ్యాటరీతో వస్తుందని మాత్రం స్పష్టమైంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలిసేందుకు మరికొన్ని రోజుల సమయం పట్టొచ్చు.
ప్రకటన
ప్రకటన