Photo Credit: Samsung
Samsung Galaxy S25 Ultra One UI 7తో కొత్త కెమెరా ఫీచర్లను పొందుతుంది
జనవరి నెల మొదట్లో కంపెనీ ఫ్లాగ్‌షిప్ ఫోన్ లైనప్‌లో టాప్-ఆఫ్-ది-లైన్ ఆఫర్‌గా Samsung Galaxy S25 Ultra లాంచ్ చేయబడింది. ఇది హార్డ్‌వేర్ అప్‌గ్రేడ్‌లతో, ముఖ్యంగా కెమెరా పరంగా మంచి ఫీచర్స్‌తో పరిచయమైంది. అయితే, మోషన్ ఫోటో, 10-బిట్ HDR వీడియో వంటి కొన్ని కొత్త కెమెరా-సెంట్రిక్ ఫీచర్స్ పాత Galaxy మోడళ్లకు కూడా అందుబాటులో ఉంటాయని ఓ నివేదిక తెలిపింది. ఇవి One UI అప్‌డేట్‌తో కంపెనీ పాత హ్యాండ్‌సెట్‌ల్లో రానున్నట్లు భావిస్తున్నారు. మరెందుకు ఆలస్యం, Samsung తీసుకు వస్తున్న ఆ సరికొత్త అప్‌డేట్లు ఏంటో చూసేద్దామా?!
SamMobile నివేదిక ప్రకారం.. Samsung One UI 7.1 అప్‌డేట్ పాత మోడళ్లలోనూ Galaxy S25 Ultraలో పైన చెప్పబడిన మరిన్ని ఫీచర్లను అందించవచ్చు. ఇందులో పాతకాలపు స్టైల్‌తో కూడిన ఆరు ఫిల్మ్-స్టైల్ ఫిల్టర్‌లతో సహా 10 కొత్త ఫిల్టర్‌లు ఉండవచ్చు. వాటిలో కొన్ని సాఫ్ట్, షార్ప్, ఇంటెన్స్, సబ్టల్, వార్మ్, డార్క్ వంటివి ఉంటాయి. పాత Galaxy వినియోగదారులు ఈ ఫిల్టర్‌లను కలర్ టెంపరేచర్, కాంట్రాస్ట్, సాచురేషన్‌తో తీర్చిదిద్దవచ్చని నివేదించబడింది. ఫోటోలలోని పరిసరాలకు సరిపోయేలా రూపొందించబడిన AI- ఆధారిత కస్టమ్ ఫిల్టర్లు కూడా ఉన్నాయి.
ఆపిల్‌తో పాటు, వీడియో రికార్డింగ్ కోసం Samsung LOG ఫార్మాట్‌ను కూడా ప్రవేశపెడుతుందని నివేదించబడింది. ఇది 8L 30fps వరకు వీడియో రికార్డింగ్‌కు సపోర్ట్ ఇచ్చే అవకాశం ఉంది. అంతే కాదు, ఖచ్చితమైన కలర్ గ్రేడింగ్ కోసం 3D LUT అప్లికేషన్‌లను ఉపయోగించుకునేలా చేస్తుంది. Galaxy S25 Ultra ఫోన్ 10-బిట్ HDR వీడియోను పరిచయం చేస్తోంది. ఇది త్వరలో పాత Galaxy ఫోన్‌లలో అందుబాటులోకి వస్తుందని భావిస్తున్నారు. వరుసగా హైబ్రిడ్ లాగ్ గామా, HDR10+ సపోర్ట్‌తో డీటైల్డ్ విజువల్స్ రెండింటి ఎంపికలను కలిగి ఉందని సూచిస్తోంది.
ఈ ఫోన్‌లు వర్చువల్ ఎపర్చరు నియంత్రణకు సపోర్ట్ ఇస్తాయని, F1.4 నుండి F16 వరకు ప్రొఫెషనల్-గ్రేడ్ డెప్త్-ఆఫ్-ఫీల్డ్ సర్దుబాట్లను అందిస్తాయని కూడా నివేదించబడింది. కంపెనీ ఈ Galaxy S25 అల్ట్రాలో ఇన్-బిల్ట్ 2048, 4096 డిజిటల్ ND ఫిల్టర్‌లను అందిస్తోంది. ఇది పాత Galaxy మోడళ్లకు కూడా అందుబాటులోకి రావచ్చని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.
ఆపిల్ లైవ్ ఫోటోల మాదిరిగానే, Samsung మోషన్ ఫోటోను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇది మూమెంట్‌ను కాప్చూర్ చేయడంతోపాటు షట్టర్‌ను తాకడానికి ముందు, తరువాత 1.5-సెకన్ల స్నిప్పెట్‌లను కూడా కాప్చూర్ చేస్తుంది. అదే సమయంలో, కొత్త సింగిల్ టేక్ విత్ టైమ్ మెషిన్ సాధనం రికార్డింగ్ ప్రారంభమయ్యే ముందు 5 సెకన్ల ఫుటేజ్‌ను కాప్చూర్ చేస్తుంది. అలాగే, ఫుటేజ్‌ను రికార్డ్ చేస్తున్నప్పుడు వినియోగదారులు 12-మెగాపిక్సెల్ స్టిల్ ఫోటోలను తీసుకునేందుకు వీలు కల్పిస్తుంది. ఈ ఫీచర్‌లను పాత Galaxy పరికరాలకు కూడా అందుబాటులోకి తీసుకురానున్నట్లు
ప్రకటన
ప్రకటన