దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ సంస్థ Samsung దేశీయ మార్కెట్‌లోకి Galaxy A06 మోడల్ ఫోన్‌ను తీసుకురానుంది. ఇది గతేడాది నవంబర్‌లో లాంచ్ అయిన Galaxy A05కి కొనసాగింపుగా వస్తున్నట్లు మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అయితే, గత కొన్ని వారాలుగా ఈ మోడల్ విషయంలో అనేక ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. Galaxy A06 ఫోన్ అంచనా ధరతోపాటు కొన్ని కీలక స్పెసిఫికేషన్‌లు బయటకు వచ్చాయి. అలాగే, రెండు రంగుల్లో ఇది అందుబాటులోకి రానుందని కూడా X వేదికగా లీక్ అయింది. ఈ మోడల్‌కు సంబంధించిన మరిన్ని విశేషాలను చూసేద్దాం రండి!
ఈ Samsung Galaxy A06 మోడల్ LED ఫ్లాష్ యూనిట్‌తో పాటు డ్యూయల్ రియర్ కెమెరా సిస్టమ్‌తో అందుబాటులోకి రానుంది. ప్యానల్ పైభాగంలో ఈ రెండు వేరువేరు కెమెరా యూనిట్‌లు నిలువుగా అమర్చబడి ఉంటాయి. ఈ ప్యానెల్ మునుపటి Galaxy A05 మాదిరిగానే కనిపిస్తోంది. లీక్ అయిన ఇమేజ్‌లను బట్టీ Samsung Galaxy A06 ఫోన్ ముందు ప్యానెల్ స్లిమ్ బెజెల్స్‌తో ఫ్లాట్ డిస్‌ప్లే ఆకర్షణీయంగా కనిపిస్తోంది. పైభాగం మద్యలో ఉన్న వాటర్-డ్రాప్ నాచ్ ఫ్రంట్ కెమెరా సెన్సార్‌ను కలిగి ఉంటుందని అంచనా వేస్తున్నారు. అలాగే, పవర్ మరియు వాల్యూమ్ బటన్‌లు ఫోన్‌కు కుడివైపు అంచున అమర్చబడినట్లు కనిపిస్తోంది. ఇది Galaxy A55తోపాటు Galaxy A35లలో కనిపించే మాదిరిగానే ఉంటుంది. దీంతోపాటు Galaxy A06 ఫోన్ నలుపు, సిల్వర్ రంగులలో అందంగా కనిపిస్తున్నాయి.
6.7 అంగుళాల LCD స్క్రీన్‌తో..
Samsung Galaxy A06 ఫోన్ 15W చార్జింగ్ సపోర్ట్‌తో 5000mAh సామర్థ్యం ఉన్న శక్తివంతమైన బ్యాటరీతో వస్తుందని అంచనా వేస్తున్నారు. ఆండ్రాయిడ్ 14 OS వర్షన్ పై పని చేయనుంది. అలాగే, 6GB RAMతో వస్తున్న ఈ Samsung Galaxy A06 ఫోన్ 6.7 అంగుళాల LCD స్క్రీన్‌తో మీడియా టెక్ హెలియో జీ85 ప్రాసెసర్ కలిగి ఉంటుందని అంచనా వేస్తున్నారు. 3.5 mm హెడ్ ఫోన్ జాక్, యూఎస్బీ టైప్ సీ పోర్ట్, స్పీకర్ గ్రిల్ లాంటి ఫీచర్లతో గత నివేదికల ఆధారంగా దీని ధర రూ. 18000 వరకూ ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇలాంటి ఫీచర్‌లతో ఈ ధరకు మార్కెట్‌లోకి వస్తే మాత్రం ఇతర స్మార్ట్‌ఫోన్ కంపెనీలకు గట్టి పోటీ ఉంటుందని మార్కెట్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
Samsung Galaxy A05 తరహా ఫీచర్స్..
అలాగే, గతేడాది విడుదలైన Samsung Galaxy A05 ఫోన్‌ను అంచనా వేస్తూ.. ఈ కొత్త మోడల్‌పై మార్కెట్ వర్గాలు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నాయి. Galaxy A05 4GB+64GB, 6GB+128 GB రెండు వేరియంట్లలో అందుబాటులోకి వచ్చింది. వీటి ధర కూడా వరుసగా రూ.9,999,రూ.12,499గా ఉన్నాయి. ఇక రంగుల విషయానికి వస్తే.. బ్లాక్, లైట్ గ్రీన్, సిల్వర్ మూడు రంగుల్లో విడుదలయ్యాయి. ఇందులో 6.7 అంగుళాల హెచ్‌డీ పీఎల్‌ఎస్ ఎల్‌సీడీ డిస్‌ప్లేతో రూపొందించారు. అలాగే, ఆండ్రాయిడ్ 13 ఆధారిత వన్ యూఐ స్కిన్‌తో ఇది పనిచేస్తోంది. ఇందులోనూ మీడియాటెక్ హీలియో జీ85 ప్రాసెసర్ అమర్చడంతోపాటు అదనంగా 6GB మెమోరీని జోడించే అవకాశాన్ని అందించారు. ఫోన్ వెనక 50MP ప్రధాన కెమెరా, 2MP కెమెరాను సెట్ చేశారు. సెల్ఫీతోపాటు వీడియో కాల్స్ కోసం ముందువైపున 8MP కెమెరా అందించారు. 5000mAh బ్యాటరీ సామర్థ్యంతో 25W ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేసేలా రూపొందించి విడుదల చేశారు. Samsung Galaxy A06 కూడా ఈ తరహా ఫీచర్స్‌తోనే అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు.