ఇండియాలో జూన్ 27న Samsung Galaxy M36 5G లాంఛ్‌.. ధ‌ర ఎంతో తెలుసా

Galaxy M36 5G ఫోన్ ధరతోపాటు డిజైన్ విశేషాలను కంపెనీ టీజ్ చేసింది. తాజాగా, కెమెరా, బిల్డ్, డైమెన్షన్‌తోపాటు కీలక స్పెసిఫికేషన్స్ తోపాటు విడుద‌ల తేదీని తెలుసుకుందాం రండి!

ఇండియాలో జూన్ 27న Samsung Galaxy M36 5G లాంఛ్‌.. ధ‌ర ఎంతో తెలుసా

Photo Credit: Samsung

Samsung Galaxy M36 5G ఆరెంజ్ హేజ్, సెరీన్ గ్రీన్ మరియు వెల్వెట్ బ్లాక్ షేడ్స్‌లో వస్తుంది

ముఖ్యాంశాలు
  • ఆండ్రాయిడ్ 15 సాఫ్ట్‌వేర్‌, One UI 7 అవుట్ ఆఫ్ ది బాక్స్‌లో రన్ అవుతుంది
  • వెనుక కెమెరాతోపాటు ఫ్రంట్ కెమెరా కూడా 4K వీడియో రికార్డింగ్‌కు సపోర్ట్
  • ఇండియ‌న్ మార్కెట్‌లో రూ. 20000 కంటే త‌క్కువ ధ‌ర‌ను కలిగి ఉంటుంది
ప్రకటన

వినియోగదారుల అవసరాల‌కు అనుగుణంగా సరికొత్త స్మార్ట్ ఫోన్లను పరిచయం చేయడంలో ముందుండే Samsung కంపెనీ ఈసారి Samsung Galaxy M36 5G మొబైల్ ను ఇండియన్ మార్కెట్‌కు తీసుకొచ్చింది. ఇది గత ఏడాది జూలైలో మన దేశీయ మార్కెట్లోకి వచ్చిన Galaxy M35 5Gకి కొనసాగింపుగా రాబోతోంది. ఈ మోడల్‌కు సంబంధించిన పూర్తి వివరాలు అధికారికంగా వెల్లడికానప్పటికీ, ఫోన్ ధరతోపాటు డిజైన్ విశేషాలను కంపెనీ టీజ్ చేసింది. తాజాగా, కెమెరా, బిల్డ్, డైమెన్షన్‌తోపాటు కీలక స్పెసిఫికేషన్స్ తోపాటు విడుద‌ల తేదీని తెలుసుకుందాం రండి!స్పెసిఫికేషన్స్ పై స్పష్టత,రాబోయే Samsung Galaxy M36 5G స్మార్ట్ ఫోన్ Exynos 1380 ప్రాసెసర్‌తో శక్తిని గ్రహిస్తుంచడంతోపాటు 6జీబీ RAM తో అటాచ్ చేయబడి ఉంటుంది. అలాగే, ఆండ్రాయిడ్ 15 సాఫ్ట్‌వేర్‌, One UI 7 అవుట్ ఆఫ్ ది బాక్స్‌లో రన్ అవుతుంది. అంతే కాదు, ఇటీవల Geekbench లో ఎస్ఎం ఎం366బీ మోడల్ నంబర్‌తో Galaxy M36 5G కనిపించడంతో ఈ స్పెసిఫికేషన్స్ పై స్పష్టత వచ్చినట్లయిందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.

మూడు కెమెరా సెన్సార్‌ల‌ను

ల్యాండింగ్ పేజీలో విడుదలైన ఇమేజ్‌ల‌ ప్రకారం Galaxy M36 5G హ్యాండ్‌సెట్‌ కెమెరా గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. వెనుక టాప్ లెప్ట్ కార్నర్‌లో పిల్ షేప్ మాడ్యూల్‌లో ఎల్ఈడీ ఫ్లాష్ పక్కన మూడు కెమెరా సెన్సార్‌ల‌ను చూడొచ్చు. 50 మెగాపిక్సెల్ ట్రిపుల్ రియర్ కెమెరా యూనిట్‌తో ఈ ఫోన్‌ను రూపొందించారు. అంతే కాదు, Galaxy M36 5G వెనుక కెమెరాతోపాటు ఫ్రంట్ కెమెరా కూడా 4K వీడియో రికార్డింగ్‌కు సపోర్ట్ చేస్తాయని కంపెనీ స్పష్టం చేసింది.

జూన్ 27న విడుద‌ల

Galaxy M36 5G ఫోన్ మ‌న దేశంలో జూన్ 27న విడుద‌ల కానున్న‌ట్లు కంపెనీ అధికారికంగా ఓ ప‌త్రికా ప్ర‌క‌ట‌న‌ను విడుద‌ల చేసింది. Samsung ఇండియా అధికారిక వెబ్ సైట్‌తోపాటు లైవ్ అమెజాన్ మైక్రోసైట్‌, ఈ కామ‌ర్స్ సైట్ ల ద్వారా కొనుగోలుకు అందుబాటులో ఉంటుంద‌ని స్ప‌ష్టం చేసింది. ఇప్ప‌టికే Galaxy M సిరీస్‌కు మ‌న దేశంలో మంచి ఆద‌ర‌ణ ఉండ‌డంతో రాబోయే హ్యాండ్‌సెట్ ఇత‌ర పోటీదారుల‌కు గ‌ట్టి పోటీ ఇచ్చే అవ‌కాశాలు ఉన్న‌ట్లు మార్కెట్ వ‌ర్గాలు భావిస్తున్నాయి.

రూ. 20000 కంటే త‌క్కువ

తాజా Samsung Galaxy M36 5G హ్యాండ్‌సెట్ ఇండియ‌న్ మార్కెట్‌లో రూ. 20000 కంటే త‌క్కువ ధ‌ర‌ను కలిగి ఉంటుంద‌ని ఇటీవ‌లే కంపెనీ అధికారికంగా వెల్ల‌డించింది. ఈ స్మార్ట్ ఫోన్ సెరీన్ గ్రీన్‌, వెల్వెట్ బ్లాక్‌, ఆరెంజ్ హేజ్ అనే మూడు ఆక‌ర్ష‌ణీయ‌మైన‌ క‌ల‌ర్ ఆప్ష‌న్‌ల‌లో ల‌భించ‌నుంది. అలాగే, స్క్రీన్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్ట‌స్ డిస్‌ప్లే ర‌క్ష‌ణ‌తో రాబోతుంది. ఈ మొబైల్ గూగుల్ జెమెనీ, స‌ర్కిల్ టు సెర్చ్ లాంటి ఏఐ ఫీచ‌ర్స్‌తో రూపొందించ‌బ‌డింది. మ‌రి కొనుగోలుదారుల నుంచి ఎలాంటి స్పంద‌న వ‌స్తుందో తెలియాలంటే జూన్ 27 వ‌ర‌కూ వేచి చూడాల్సిందే

ప్రకటన

ప్రకటన

#తాజా కథనాలు
  1. కొత్త ఏడాదిలో సామ్ సంగ్ నుంచి అద్భుతమైన ఫీచర్స్‌తో రానున్న టీవీలు.. ప్రత్యేకతలు ఇవే
  2. మార్కెట్లోకి హానర్ విన్, విన్ ఆర్‌టి మోడల్స్.. కీ ఫీచర్స్ గురించి తెలుసా?
  3. సాఫ్ట్‌వేర్ పరంగా, Realme 16 Pro+ Android 16 ఆధారిత Realme UI 7తో రన్ అవుతుంది.
  4. Moto G Power (2026) అమెరికాలో $299.99 ధరతో విడుదలైంది.
  5. సాఫ్ట్‌వేర్ పరంగా, Realme 16 Pro+ Android 16 ఆధారిత Realme UI 7తో రన్ అవుతుంది.
  6. స్ట్రాటజీతో రేట్లు పెంచేసిన సామ్ సంగ్.. ఇక నెక్ట్స్ ఐఫోన్ వంతు
  7. వీటిలో ఇప్పటికే 3,500 పోస్టులు భర్తీ అయ్యాయని ఆయన తెలిపారు.
  8. అంతేకాదు, భారీగా 9,000mAh బ్యాటరీ ఇవ్వనున్నట్లు ప్రచారం జరుగుతోంది.
  9. అదిరే కెమెరా ఫీచర్స్‌తో ఒప్పో Find X9.. ఈ ప్రత్యేకతలు తెలుసుకున్నారా?
  10. ఇది 2026 వసంతకాలంలో విడుదలయ్యే అవకాశం ఉందని సమాచారం.
© Copyright Red Pixels Ventures Limited 2025. All rights reserved.
Trending Products »
Latest Tech News »