వాస్తవానికి, ఇది గత కొన్ని సంవత్సరాల్లోనే అత్యంత ఆలస్యమైన Galaxy S సిరీస్ విడుదల తేదీగా నిలవనుంది. ఉదాహరణకు, Galaxy S25 సిరీస్ ఫిబ్రవరి 7, 2025న మార్కెట్‌లోకి రాగా, Galaxy S24 సిరీస్ జనవరి 31, 2024న విడుదలైంది.
Photo Credit: Samsung
Samsung Galaxy S26 లాంచ్ ఆలస్యం కావడంతో మొత్తం సిరీస్ విడుదల తేదీ మార్చి మధ్యలో నిర్ణయించబడుతుంది.
కొత్తగా వెలువడిన ఓ రిపోర్ట్ ప్రకారం, Samsung తన రాబోయే ఫ్లాగ్‌షిప్ Galaxy S26 సిరీస్ విడుదలను ఈసారి ఆలస్యం చేయనుంది. ఈ ఆలస్యం కారణంగా Galaxy S26, S26+ మరియు S26 Ultra మోడళ్లన్నీ కలిపి మార్చి మధ్యలోనే మార్కెట్‌లోకి వచ్చే అవకాశం ఉంది. Dealabs వెల్లడించిన సమాచారం ప్రకారం, ముఖ్యంగా ఫ్రాన్స్ మార్కెట్‌లో Samsung మార్చి 11 తేదీన Galaxy S26 సిరీస్‌ను విక్రయాలకు అందించాలనుకుంటోంది. దీనికి ముందు, ఫిబ్రవరి 26న అధికారిక లాంచ్ ఈవెంట్ నిర్వహించే అవకాశం ఉంది. ఆ ఈవెంట్ ఫ్రాన్స్ స్థానిక సమయానుసారం సాయంత్రం 7 గంటలకు జరగనుండగా, అదే సమయంలో అమెరికాలో మధ్యాహ్నం 12 గంటలు (ET), ఉదయం 9 గంటలు (PT) అవుతుంది. విడుదల తేదీలు ప్రాంతానికీ ప్రాంతానికి మారినా, ఫ్రాన్స్‌లో మార్చి 11న విడుదలైతే, అమెరికా, యూరప్‌లోని ఇతర దేశాలు, దక్షిణ కొరియా వంటి ప్రధాన మార్కెట్లలో కూడా అదే తేదీకి దగ్గరగా విడుదలయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.
వాస్తవానికి, ఇది గత కొన్ని సంవత్సరాల్లోనే అత్యంత ఆలస్యమైన Galaxy S సిరీస్ విడుదల తేదీగా నిలవనుంది. ఉదాహరణకు, Galaxy S25 సిరీస్ ఫిబ్రవరి 7, 2025న మార్కెట్‌లోకి రాగా, Galaxy S24 సిరీస్ జనవరి 31, 2024న విడుదలైంది. అంతకుముందు Galaxy S23 సిరీస్ కూడా ఫిబ్రవరి 17, 2023కే వినియోగదారుల చేతికి చేరింది. ఈ నేపథ్యంలో చూస్తే, మార్చి 11న విడుదల కావడం అంటే 2018లో వచ్చిన Galaxy S9 (మార్చి 16, 2018) తర్వాత ఇంత ఆలస్యం కావడం ఇదే తొలిసారి. Galaxy S26 సిరీస్ విషయంలో Samsung వ్యూహం ఇటీవలి నెలల్లో కొంత గందరగోళంగా మారిందనే చెప్పాలి. మొదటగా, ఈ లైనప్‌లో Ultra మోడల్‌తో పాటు చిన్న స్క్రీన్ సైజ్‌లో రీబ్రాండెడ్ Galaxy S26 “Pro”, అలాగే మూడో మోడల్‌గా Galaxy S26 Edge ఉండబోతున్నాయనే ప్రచారం జరిగింది. అయితే కాలక్రమేణా ఆ ప్లాన్ పూర్తిగా మారిపోయింది.
అక్టోబర్ నెలలో వచ్చిన నివేదికల ప్రకారం, Galaxy S25 Edge ఆశించిన స్థాయిలో విజయాన్ని సాధించకపోవడం, అలాగే Apple యొక్క iPhone Air ప్రభావం నేపథ్యంలో Samsung “Pro” బ్రాండింగ్‌ను పూర్తిగా పక్కన పెట్టింది. దాంతో పాటు Galaxy S26 Edge మోడల్‌ను కూడా రద్దు చేసి, మళ్లీ Plus మోడల్‌ను తిరిగి తీసుకురావాలని నిర్ణయించుకుంది. ఇదే మార్పు కారణంగా 2026 ఫ్లాగ్‌షిప్ సిరీస్ విడుదలలో ఆలస్యం జరిగింది. సాధారణంగా అయితే, ఈ సమయానికి (జనవరి మధ్య నాటికి) Galaxy S సిరీస్ లాంచ్ దశకు చాలా దగ్గరగా ఉండేది.
ఇదిలా ఉండగా, Apple తన రాబోయే iPhone 17 ధరలను యథాతథంగా కొనసాగించాలనే నిర్ణయం తీసుకోవడం కూడా Samsungపై ప్రభావం చూపినట్లు తెలుస్తోంది. ఆ నిర్ణయం కారణంగా Samsung తన ధరలు, ఫీచర్లు, ముఖ్యంగా చాలాకాలంగా ఎదురుచూస్తున్న కెమెరా అప్‌గ్రేడ్ అంశాలపై కూడా పునరాలోచన చేసినట్లు రిపోర్టులు చెబుతున్నాయి. మొత్తం మీద, Galaxy S26 సిరీస్ వెనుక ఉన్న వ్యూహ మార్పులే ఈ ఆలస్యానికి ప్రధాన కారణంగా మారాయి.
ces_story_below_text
ప్రకటన
ప్రకటన
Vivo V70 Series India Launch Timeline Leaked; Two Models Expected to Debut