The Freestyle+ లో ప్రధాన ఆకర్షణగా నిలిచేది AI OptiScreen టెక్నాలజీ

CES 2026 కు ముందే ఆవిష్కరించిన The Freestyle+, మొదటి తరం Freestyle ప్రత్యేక డిజైన్‌ను కొనసాగిస్తూనే, మరింత ఆధునిక AI ఫీచర్లు, మెరుగైన బ్రైట్‌నెస్ మరియు విస్తృతమైన ఎంటర్‌టైన్‌మెంట్ సపోర్ట్‌తో ముందుకు వచ్చింది.

The Freestyle+ లో ప్రధాన ఆకర్షణగా నిలిచేది AI OptiScreen టెక్నాలజీ

Photo Credit: Samsung

శామ్సంగ్ ఎలక్ట్రానిక్స్ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ది ఫ్రీస్టైల్+ లాంచ్‌ను ప్రకటించింది.

ముఖ్యాంశాలు
  • AI OptiScreen టెక్నాలజీతో ఆటోమేటిక్ పిక్చర్ ఆప్టిమైజేషన్
  • 430 ISO Lumens బ్రైట్‌నెస్, గత మోడల్ కంటే రెట్టింపు వెలుతురు
  • 360° బిల్ట్-ఇన్ స్పీకర్ & OTT సపోర్ట్, బయటి డివైజ్ అవసరం లేదు
ప్రకటన

AI ఆధారిత పోర్టబుల్ ప్రోజెక్టర్‌తో కొత్త స్థాయి ఎంటర్‌టైన్‌మెంట్ అనుభవం. Samsung Electronics తన తాజా AI పవర్డ్ పోర్టబుల్ ప్రోజెక్టర్ ‘The Freestyle+' ను గ్లోబల్‌గా విడుదల చేసినట్లు అధికారికంగా ప్రకటించింది. విభిన్న ప్రదేశాల్లో మరింత సులభంగా, వ్యక్తిగత అవసరాలకు అనుగుణంగా ఎంటర్‌టైన్‌మెంట్ అనుభవాన్ని అందించడమే లక్ష్యంగా ఈ కొత్త మోడల్‌ను రూపొందించారు. CES 2026 కు ముందే ఆవిష్కరించిన The Freestyle+, మొదటి తరం Freestyle ప్రత్యేక డిజైన్‌ను కొనసాగిస్తూనే, మరింత ఆధునిక AI ఫీచర్లు, మెరుగైన బ్రైట్‌నెస్ మరియు విస్తృతమైన ఎంటర్‌టైన్‌మెంట్ సపోర్ట్‌తో ముందుకు వచ్చింది. ఎలాంటి క్లిష్టమైన సెటప్ అవసరం లేకుండా, ఎక్కడైనా సులభంగా కంటెంట్‌ను ఆస్వాదించేలా ఇది రూపొందించబడింది. Samsung Visual Display బిజినెస్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ హన్ లీ మాట్లాడుతూ, “మన జీవనశైలికి అనుగుణంగా సహజంగా మారే డిస్‌ప్లేలను రూపొందించాలన్నదే Samsung విజన్ అని చెప్పారు. నిజమైన పోర్టబిలిటీతో పాటు, పరిసరాలకు అనుగుణంగా చిత్ర నాణ్యతను మెరుగుపరిచే AI టెక్నాలజీని కలపడం ద్వారా, The Freestyle+ ఎక్కడ ఉన్నా ఒకే స్థాయి అనుభవాన్ని అందిస్తుంది” అని తెలిపారు.

The Freestyle+ లో ప్రధాన ఆకర్షణగా నిలిచేది AI OptiScreen టెక్నాలజీ. ఇది ప్రోజెక్టర్ ఉన్న ప్రదేశాన్ని గుర్తించి, స్క్రీన్ క్వాలిటీని ఆటోమేటిక్‌గా సర్దుబాటు చేస్తుంది. వినియోగదారులు కేవలం ప్రోజెక్టర్‌ను ఉంచి, ఆన్ చేస్తే చాలు.

ఇందులో3D Auto Keystone సూటిగా లేని గోడలు, మూలలు లేదా కర్టెన్స్‌పై ప్రొజెక్ట్ చేసినా డిస్టోర్షన్ సరిచేస్తుంది. Real-time Focus ఆప్షన్ ప్రోజెక్టర్ కదిలినప్పుడల్లా ఫోకస్‌ను స్వయంచాలకంగా సర్దుతుంది. Screen Fit & Wall Calibration స్క్రీన్ పరిమాణం, గోడ రంగును బట్టి చిత్రాన్ని క్లియర్‌గా చూపిస్తుంది. ఇవన్నీ కలిపి Samsung యొక్క Vision AI Companion ప్లాట్‌ఫామ్ ద్వారా

సిలిండర్ ఆకారంలో ఉండే The Freestyle+ డిజైన్, గది నుంచి గదికి లేదా బయటకు తీసుకెళ్లేందుకు అనుకూలంగా ఉంటుంది. 430 ISO Lumens బ్రైట్‌నెస్‌తో, గత తరం కంటే దాదాపు రెట్టింపు వెలుతురు అందిస్తుంది. 180 డిగ్రీల రోటేషన్ సపోర్ట్‌తో గోడలు, నేల లేదా సీలింగ్‌పై కూడా ప్రొజెక్ట్ చేయవచ్చు.
ఆన్-ది-గో ఎంటర్‌టైన్‌మెంట్ & 360° సౌండ్, బిల్ట్-ఇన్ Samsung TV Plus, ప్రముఖ OTT యాప్‌లు, Samsung Gaming Hub సపోర్ట్‌తో ఎలాంటి బయటి డివైజ్ అవసరం లేకుండా కంటెంట్‌ను ఆస్వాదించవచ్చు.

అదనంగా, 360 డిగ్రీ స్పీకర్ ద్వారా రూమ్‌ను నింపే ఆడియో లభిస్తుంది. Q-Symphony సపోర్ట్‌తో Samsung సౌండ్‌బార్లతో కలిసి మరింత రిచ్ సౌండ్ అనుభవాన్ని అందిస్తుంది. Samsung, జనవరి 6–9 మధ్య జరిగే CES 2026 లో The Freestyle+ ను ప్రదర్శించనుండగా, 2026 తొలి అర్ధభాగంలో దశలవారీగా గ్లోబల్ మార్కెట్‌లో విడుదల చేయనుంది.

ces_story_below_text

ప్రకటన

ప్రకటన

#తాజా కథనాలు
  1. మార్కెట్లోకి రానున్న మోటో న్యూ సిరీస్.. ఎక్స్70 ఎయిర్ ప్రో ఫీచర్స్ ఇవే
  2. త్వరలోనే వన్ ప్లస్ నార్డ్ 6.. కీ ఫీచర్స్ ఇవే
  3. ఈ Privacy Display ఫీచర్ పనిచేయాలంటే, సాధారణ OLED స్క్రీన్ సరిపోదు.
  4. The Freestyle+ లో ప్రధాన ఆకర్షణగా నిలిచేది AI OptiScreen టెక్నాలజీ
  5. ఆసక్తికరమైన విషయం ఏంటంటే, 200MP HP2 సెన్సార్ ఇదే ఇప్పటికే Galaxy S25 Ultraలో కూడా ఉపయోగించారు.
  6. సాఫ్ట్‌వేర్ పరంగా చూస్తే, ఈ డివైస్‌లో పలు ఇంటిగ్రేటెడ్ AI టూల్స్ ఉన్నాయి.
  7. వాట్సప్‌లో న్యూ ఇయర్ స్పెషల్ ఫీచర్స్.. ఇక ప్రత్యేకం కానున్న కొత్త ఏడాది
  8. Find N6లో శక్తివంతమైన ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉండనుంది.
  9. వాట్సప్‌లో న్యూ ఇయర్ స్పెషల్ ఫీచర్స్.. ఇక ప్రత్యేకం కానున్న కొత్త ఏడాది
  10. దీంతో ఫోటోగ్రఫీ మరియు జూమ్ క్వాలిటీలో కొత్త స్థాయిని అందించే అవకాశముంది
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »