Photo Credit: Samsung
One UI 7 will be available in beta early this year, Samsung confirmed
శాన్‌జోస్‌లో జరిగిన Samsung డెవలపర్ కాన్ఫరెన్స్ 2024లో Samsung కంపెనీ తమ స్మార్ట్‌ఫోన్‌లు, ఇతర డివైజ్‌ల కోసం One UI 7 అప్‌డేట్‌ను ప్రకటించింది. ఈ దక్షిణ కొరియా టెక్నాలజీ యూనిట్ దాని రాబోయే అప్‌డేట్‌ను పూర్తి రీడిజైన్ చేసిన ఇంటర్‌ఫేస్, కొత్త డిజైన్ ఎలిమెంట్స్‌తోపాటు ఇతర అంశాలను జోడించినట్లు వెల్లడించింది. ఇది రిజిస్టర్డ్ బీటా టెస్టర్‌ల కోసం దాని రోల్‌అవుట్, పవర్‌ను అందించే మొదటి శామ్‌సంగ్ డివైజ్ సహా One UI 7 లాంచింగ్ అంచనా టైమ్‌లైన్‌ను కూడా ప్రకటించింది.
Samsung చెబుతున్నదాని ప్రకారం.. ఈ One UI 7 అప్‌డేట్ Purposeful simplicity, బలమైన ముద్రవేడంతోపాటు భావోద్వేగ అనుబంధం అనే మూడు ప్రధాన లక్ష్యాలను కలిగి ఉంది. వినియోగదారు ఏం చేయాలనుకుంటున్నారో అర్థం చేసుకోవడానికి, అక్కడి సంక్లిష్టతను తగ్గించడానికి One UI 7 రూపొందించబడిందని కంపెనీ తెలిపింది. క్లీనర్ లుక్‌ని నిర్ధారించడంతోపాటు మరింత స్థిరత్వాన్ని తీసుకురావడానికి దీని డిజైన్ సరికొత్తగా క్రమబద్ధీకరించబడింది. అంటే, దాదాపు సమూల మార్పులతో సరికొత్తగా ఆవిష్కరించినట్లు చెప్పొచ్చు.
అయితే, Galaxy వినియోగదారులకు సంవత్సరాలుగా సుపరిచితమైన Samsung Android స్కిన్‌లోని కొన్ని సిగ్నేచర్ డిజైన్ ఎలిమెంట్‌లను One UI 7 ఇప్పటికీ అలాగే ఉంచుతుంది. అంతేకాదు, వినియోగదారు సంతృప్తిని మరింత పెంచాలనే లక్ష్యంతో న్యూ బ్లర్ సిస్టమ్ మరో అదనపు ఫీచర్‌గా చెప్పొచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ పరిచయం చేసిన కొత్త ఫీచర్‌లలో ఒకటి న్యూ హోమ్ స్క్రీన్ గ్రిడ్. ఇది ఇప్పటి Galaxy పరికరాల్లో ఉన్నప్పటికీ, స్లికర్ ఉపయోగించడానికి మరింత సులభతరంగా ఉంటుందని కంపెనీ స్పష్టం చేసింది.
ఆండ్రాయిడ్ 15 Samsung స్మార్ట్‌ఫోన్‌లకు One UI 7ను తీసుకువస్తుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. ప్రధానంగా.. నెక్ట్ జనరేషన్ Android ఆపరేటింగ్ సిస్టమ్ (OS) గత నెలలో ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. అయితే, కొన్ని ఒరిజినల్ పరికరాల తయారీదారులు (OEMలు) మాత్రమే తమ పరికరాల కోసం దీనిని రూపొందించారు. అలాగే, One UI 7 గుడ్ లాక్‌కు సపోర్ట్ చేస్తుందని Samsung ధృవీకరించింది. ఇది కూడా వినియోగదారులు అదరనపు ఆకర్షణగా నిలుస్తుందని మార్కెట్ వర్గాలు అంచా వేస్తున్నాయి.
Samsung తన కొత్త One UI 7 అప్‌డేట్ ఈ ఏడాది చివర్లో గెలాక్సీ పరికరాల్లో బీటాలో అందుబాటులో ఉంటుందని తెలిపింది. ఈ సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ అధికారిక వెర్షన్ వచ్చే ఏడాది నుండి వినియోగదారులందరి కోసం విడుదల చేయబడుతుంది. అలాగే, One UI 7తో వచ్చిన మొదటిదిగా తర్వాతి Samsung Galaxy S సిరీస్ నిలుస్తుంది. అది గెలాక్సీ S25 సిరీస్ కావచ్చని, మొత్తంగా 2025 ప్రారంభంలో దాని అరంగేట్రం ఉంటుందని స్పష్టమైంది. ఈ ప్రకటనతో Samsung నుంచి మరిన్ని విషయాలను తెలుసుకునేందుకు మార్కెట్ వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.
ప్రకటన
ప్రకటన