లాంచ్‌కు ముందే TUV రైన్‌ల్యాండ్ వెబ్‌సైట్‌లో ప్ర‌త్య‌క్ష‌మైన‌ Galaxy A56, Galaxy A36, Galaxy A26

Galaxy A56, Galaxy A36లు ఇటీవలి ఫ్లాగ్‌షిప్ S-సిరీస్ ఫోన్‌ల మాదిరిగానే అదే వేగవంతమైన వైర్డు ఛార్జింగ్ సామర్థ్యానికి సపోర్ట్ చేయవచ్చని అంచనా.

లాంచ్‌కు ముందే TUV రైన్‌ల్యాండ్ వెబ్‌సైట్‌లో ప్ర‌త్య‌క్ష‌మైన‌ Galaxy A56, Galaxy A36, Galaxy A26

Photo Credit: Samsung

సామ్‌సంగ్ ఫోన్‌లు వాటి పూర్వీకుల మాదిరిగానే డిజైన్‌ను కలిగి ఉన్నాయని చెప్పారు

ముఖ్యాంశాలు
  • Samsung త్వరలో ప్రపంచవ్యాప్తంగా కొత్త మోడళ్లను విడుదల చేయనుంది
  • నివేదిక‌ ప్రకారం Galaxy A26కి 25W ఛార్జింగ్ సపోర్ట్ ఉండవచ్చని తెలుస్తోంది
  • Galaxy A56 బ్లూటూత్ 5.3, Wi-Fi 6తో FCC వెబ్‌సైట్‌లో క‌నిపిస్తోంది
ప్రకటన

గత వారం జరిగిన Galaxy అన్‌ప్యాక్డ్ 2025 ఈవెంట్‌లో ఫ్లాగ్‌షిప్ Galaxy S25 సిరీస్‌ను ఆవిష్కరించిన తర్వాత, Samsung త్వరలో మరో మూడు స్మార్ట్ ఫోన్‌ల విడుదలకు సిద్ధ‌మవుతోంది. దీనికి బ‌లం చేకూర్చేలా.. Galaxy A56, Galaxy A36, Galaxy A26 అనే ఫోన్‌లు తాజాగా సర్టిఫికేషన్ వెబ్‌సైట్‌లో ప్ర‌త్య‌క్ష‌మ‌య్యాయి. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఈ స్మార్ట్ ఫోన్‌ల‌ అరంగేట్రంపై చ‌ర్చ‌కు దారితీసింది. అంతేకాదు, ఈ లిస్ట్‌లోని మూడు మోడళ్ల ఛార్జింగ్ కెపాసిటీపై కూడా మార్కెట్ వ‌ర్గాలు ఆస‌క్తి చూపిస్తున్నాయి. Galaxy A56, Galaxy A36లు ఇటీవలి ఫ్లాగ్‌షిప్ S-సిరీస్ ఫోన్‌ల మాదిరిగానే అదే వేగవంతమైన వైర్డు ఛార్జింగ్ సామర్థ్యానికి సపోర్ట్ చేయవచ్చని అంచనా.

వెబ్‌సైట్‌లో మోడ‌ల్ నెంబ‌ర్‌లు

Gizmochina నివేదిక ప్రకారం.. ఈ మూడు స్మార్ట్‌ ఫోన్‌లు కొలోన్‌లోని గ్లోబల్ టెస్టింగ్, వెరిఫికేష‌న్‌, ప్రొడ‌క్ట్‌ సర్టిఫికేషన్ కోసం ఏర్పాటు చేసిన TUV రైన్‌ల్యాండ్ వెబ్‌సైట్‌లో బ‌హిర్గ‌తం అయ్యాయి. అలాగే, Galaxy A56 మోడల్ నంబర్లు SM-A566B/DS, SM-A566B, SM-A566E/DS, SM-A566E కలిగి ఉన్నట్లు తెలుస్తోంది. Galaxy A36 మోడ‌ల్‌ SM-A366B, SM-A336B/DS, SM-A366E, SM-A366E/DS, SM-A366U, SM-A366U1, SM-A366W, SM-S366V, SM-A3660 మోడళ్లలో అందుబాటులో ఉండే అవ‌కాశం ఉంది. ఈ నివేదిక‌పై పూర్తి స్థాయిలో వివ‌రాలు తెలిసేందుకు కాస్త స‌మ‌యం ప‌ట్టే అవ‌కాశాలు ఉన్నాయి.

మరొక మోడల్ లాంచ్

అలాగే, పైన పేర్కొన్న రెండు స్మార్ట్ ఫోన్‌ల గురించి ఇలాంటి అంశాలు వెలువ‌డిన‌ప్ప‌టికీ, TUV రైన్‌ల్యాండ్ వెబ్‌సైట్ కూడా నంబర్ సిరీస్‌లో మరొక మోడల్ లాంచ్ ఉండొచ్చ‌ని చెబుతోంది. Galaxy A26 అనే ఈ ప్రొడ‌క్ట్‌ SM-A266B/DS, SM-A266B, SM-A266M/DS, SM-A266M మోడల్ నంబర్లతో లిస్ట్ అవుట్ చేయ‌బ‌డిన‌ట్లు స్ప‌ష్టమైంది. దీంతో రాబోయే కొత్త మోడ‌ల్స్ సంఖ్య మూడుకు చేరిన‌ట్లు స్ప‌ష్ట‌మైంది.

నెమ్మదిగా ఛార్జింగ్‌కు స‌పోర్ట్

ఈ లిస్ట్‌ Galaxy A56, Galaxy A36 ఫోన్‌లు 45W ఫాస్ట్ ఛార్జింగ్‌కు స‌పోర్ట్ చేస్తాయ‌ని కూడా వెల్లడిస్తోంది. అంతే కాదు, ఈ Galaxy A26 మోడ‌ల్‌ 25W వద్ద కొంచెం నెమ్మదిగా ఛార్జింగ్‌కు స‌పోర్ట్ చేస్తుంది. దీంతో ఛార్జింగ్ కెపాసిటీపై కూడా పెద్ద ఎత్తున చ‌ర్చ జ‌రుగుతోంది. ఈ సామ‌ర్థ్యంపై కంపెనీ అధికారిక ప్ర‌క‌ట‌న కోసం మార్కెట్ వ‌ర్గాలు ఆస‌క్తిగా ఎదురు చూస్తున్న‌ట్లు కొన్ని నివేదిక‌లు చెబుతున్నాయి. అంతే కాదు, రాబోయే Samsung Galaxy A56 మోడల్ నంబర్ SM-A566E/DS కలిగిన US ఫెడరల్ కమ్యూనికేషన్స్ కమిషన్ (FCC) వెబ్‌సైట్‌లో లిస్ట్ అవుట్‌ చేయబడిందని కూడా నివేదించబడింది.

కనెక్టివిటీకి స‌పోర్ట్ ఇలా

ఈ తాజా జాబితా బ్లూటూత్ 5.3, Wi-Fi 6, NFC, GNSS కనెక్టివిటీకి స‌పోర్ట్ చేస్తుంద‌ని వెల్లడిస్తోంది. ఫోన్ 10V 4.5A (సుమారుగా 45W) వద్ద ఛార్జింగ్‌కు స‌పోర్ట్ చేస్తుందని నివేదించబడింది. అయిన‌ప్పటికీ, ఇది FCC డేటాబేస్‌లో Samsung EP-TA800 అడాప్టర్‌తో క‌నిపిస్తోంది. అంతే కాదు, ఇది 25W వైర్డ్ ఛార్జింగ్ కోసం రేట్ చేయబడింది

Comments

ప్రకటన

ప్రకటన

#తాజా కథనాలు
  1. 30 వేలకే పోకో ఫోన్.. కళ్లు చెదిరే తగ్గింపు
  2. మోటో నుంచి కొత్త మోడల్.. బ్యాటరీ కెపాసిటీ ఎంతంటే
  3. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ 2025లో స్మార్ట్ టీవీలపై అద్భుతమైన ఎర్లీ డీల్స్ అందుబాటులో ఉన్నాయి
  4. ఈ సారి అమెజాన్ ఎకో డివైజ్‌లపై పెద్ద ఎత్తున ఆఫర్లు ఉన్నాయి
  5. AI ఫీచర్లతో గూగుల్ ఫిక్సల్ 10 ప్రో ఫోల్డబుల్ ఫోన్ వచ్చేసింది, ధర ఎంతో తెలుసా
  6. రెడ్మీ 15 5G భారత మార్కెట్లో విడుదల... ధర, ఫీచర్స్, ఇతర స్పెసిఫికేషన్స్ డీటెయిల్స్ మీకోసం
  7. తక్కువ ధరకు 4GB RAMతో Poco M7 Plus 5G కొత్త వేరియంట్ ఫోన్, త్వరలో ఫ్లిప్‌కార్ట్‌లో సేల్స్ ప్రారంభం
  8. iQOO 15 హ్యాండ్‌సెట్ ఫోటోలు లీక్, వేర్వేరు కలర్స్‌లో సరికొత్త లుక్‌లో హ్యాండ్‌సెట్
  9. సెప్టెంబర్ 19 నుంచి ఇవ్వాల్సిన డెలివరీలు వాయిదా పడుతున్నాయి
  10. రియల్ మీ P3 Lite 5G ధరను రియల్‌ మీ చాలా ఆకర్షణీయంగా నిర్ణయించింది.
© Copyright Red Pixels Ventures Limited 2025. All rights reserved.
Trending Products »
Latest Tech News »