అధికారికంగా పరిచయం చేసింది. ఈ డివైస్‌ను ప్రత్యేకంగా నోట్స్ రాయడం, చదవడం, క్రియేటివ్ వర్క్ కోసం రూపొందించగా, ఇది ReMarkable Paper Pro, Kindle Scribe వంటి ప్రీమియం డివైస్‌లకు గట్టి పోటీగా నిలవనుంది.
Photo Credit: TCL
TCL అధికారికంగా నోట్ A1 NxtPaper ను ఆవిష్కరించింది.
TCL తాజాగా తన కొత్త డిజిటల్ నోట్-టేకింగ్ డివైస్ Note A1 NxtPaper ను అధికారికంగా పరిచయం చేసింది. ఈ డివైస్‌ను ప్రత్యేకంగా నోట్స్ రాయడం, చదవడం, క్రియేటివ్ వర్క్ కోసం రూపొందించగా, ఇది ReMarkable Paper Pro, Kindle Scribe వంటి ప్రీమియం డివైస్‌లకు గట్టి పోటీగా నిలవనుంది. TCL Note A1 NxtPaper లో భారీ 8,000mAh బ్యాటరీ ఇవ్వబడింది. కంపెనీ దీన్ని “లాంగ్ స్టాండ్బై” సామర్థ్యంతో రూపొందించిందని చెబుతోంది. అంతేకాదు, 33W ఫాస్ట్ వైర్డ్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది. పనితీరు విషయానికి వస్తే, ఇందులో 8GB ర్యామ్, 256GB ఇంటర్నల్ స్టోరేజ్ అందించారు. ఈ డివైస్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచేది 11.5 అంగుళాల NxtPaper Pure డిస్‌ప్లే. ఇది 2200 x 1440 రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్, 300 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ తో వస్తుంది. కళ్లకు తక్కువ ఒత్తిడి కలిగేలా సర్టిఫైడ్ ఐ కంఫర్ట్ ఫీచర్లు ఉండటంతో పాటు, పేపర్ లాంటి రిఫ్లెక్షన్ లేని క్లారిటీని అందిస్తుంది. చుట్టూ ఉన్న వెలుతురుకు అనుగుణంగా బ్రైట్‌నెస్ మారే అడాప్టివ్ బ్రైట్‌నెస్ కూడా ఇందులో ఉంది.
ఈ డివైస్‌ను MediaTek Helio G100 ప్రాసెసర్ నడుపుతోంది. ఫోటోగ్రఫీ కోసం వెనుకవైపు 13MP కెమెరా ఉంది. ఆడియో ఎక్స్పీరియన్స్ మెరుగ్గా ఉండేందుకు రెండు స్పీకర్లు, అలాగే వాయిస్ ఇన్‌పుట్, మీటింగ్ రికార్డింగ్‌ల కోసం ఎనిమిది మైక్రోఫోన్లు ఇచ్చారు.
Note A1 NxtPaper తో పాటు TCL అందిస్తున్న T-Pen Pro స్టైలస్ కూడా ఒక ప్రధాన హైలైట్గా నిలవనుంది. ఇది డ్యూయల్-టిప్ డిజైన్‌తో, ఎరేజర్ సపోర్ట్‌తో వస్తుంది. 8,192 ప్రెషర్ లెవెల్స్, 5ms కంటే తక్కువ లేటెన్సీ ఉండటంతో, నిజమైన పెన్సిల్‌తో పేపర్‌పై రాసిన అనుభూతిని ఇస్తుందని TCL చెబుతోంది. అధికారికంగా ఇది “పెన్సిల్-లైక్ రైటింగ్” సర్టిఫికేషన్ పొందింది. సాఫ్ట్‌వేర్ పరంగా చూస్తే, ఈ డివైస్‌లో పలు ఇంటిగ్రేటెడ్ AI టూల్స్ ఉన్నాయి. AI Rewrite, Writing Assist వంటి ఫీచర్లు రాతను మెరుగుపరచడంలో సహాయపడతాయి. అలాగే Inspiration Space అనే ఫీచర్ ద్వారా ఐడియాలు, కంటెంట్‌ను సక్రమంగా ఆర్గనైజ్ చేసుకోవచ్చు. రియల్-టైమ్ ట్రాన్స్‌క్రిప్షన్, ట్రాన్స్‌లేషన్, ఆటోమేటెడ్ మీటింగ్ సమ్మరీలు వంటి సౌకర్యాలు కూడా ఇందులో ఉన్నాయి.
డిజైన్ విషయానికి వస్తే, TCL Note A1 కేవలం 5.5mm మందం మాత్రమే ఉండి, అల్యూమినియం యూనిబాడీ నిర్మాణంతో వస్తుంది. బరువు సుమారు 500 గ్రాములు. అవసరాన్ని బట్టి ఫ్లిప్ కేస్, కీబోర్డ్ కేస్ వంటి ఆప్షనల్ యాక్సెసరీస్ కూడా అందుబాటులో ఉంటాయి. ధర విషయానికి వస్తే, TCL Note A1 NxtPaper ను $549 ధరకు మార్కెట్లోకి తీసుకురానున్నారు. ఇది ఫిబ్రవరి చివరి నాటికి యూరప్, నార్త్ అమెరికా, APAC ప్రాంతాల్లో విక్రయాలకు అందుబాటులోకి రానుంది. నోట్స్ రాయడం, చదవడం, డిజిటల్ క్రియేటివిటీని ఇష్టపడే వినియోగదారులకు ఇది ఒక ఆకర్షణీయమైన కొత్త ఎంపికగా నిలవనుంది.
ces_story_below_text
ప్రకటన
ప్రకటన
New Year 2026 Scam Alert: This WhatsApp Greeting Could Wipe Your Bank Account