ప్రముఖ స్మార్ట్ ఫోన్‌ల తయారీ సంస్థ Tecno Phantom త్వరలోనే Tecno Phantom V ఫ్లిప్ 2 5G స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేయనున్నట్లు స్పష్టమైంది. అయితే, విడుదల తేధీ అధికారికంగా తెలయనప్పటికీ ఈ మోడల్‌కు సంబంధించిన స్పెసిఫికేషన్‌లు మరియు ధర ఏ పరిధిలో ఉంటాయో టిప్‌స్టర్ ద్వారా బహిర్గతమయ్యాయి. Tecno Phantom కంపెనీ తగ సంవత్సరం విడుదల చేసిన Tecno Phantom Vకి అప్‌డేటెడ్ వెర్షన్‌గా ఈ Tecno Phantom V ఫ్లిప్ 2 5G స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి ఆవిష్కరించనున్నట్లు తెలుస్తోంది. ఇది మార్కెట్‌లో ఉన్న చవకైన ఫోల్డబుల్ మోడల్స్‌లో ఒకటిగా చెప్పొచ్చు. క్లామ్‌షెల్ ఫోల్డబుల్ తెలిపిన వివరాల ప్రకారం.. ఇది మీడియా టెక్ డైమెన్సిటీ 8020 ప్రాసెసర్ ద్వారా శక్తిని పొందుతుంది. అలాగే, 64-మెగాపిక్సెల్ డ్యూయల్ రియర్ కెమెరాలతో దీనిని రూపొందించారు. మరెందుకు ఆలస్యం.. Tecno Phantom V ఫ్లిప్ 2 5G స్మార్ట్‌ఫోన్ మోడల్‌కు సంబంధించిన ఆసక్తికరమైన విషయాలను చూసేద్దాం రండి!
టిప్‌స్టర్ వివరాల ప్రకారం..
ట్విట్టర్ వేదికగా Tipster Paras Guglani (@passionategeekz) Tecno Phantom V ఫ్లిప్ 2 5G ధర పరిధితోపాటు స్పెసిఫికేషన్‌లను వెల్లడించారు. టిప్‌స్టర్ వెల్లడించిన వివరాల ప్రకారం.. రాబోయే ఫ్లిప్-స్టైల్ ఫోల్డబుల్ మోడల్ ధర మన దేశంలో రూ. 55,000 నుంచి రూ. 60, 000 వరకూ ఉంటుంది. అలాగే, ఇది గ్రే, గ్రీన్ కలర్ ఆప్షన్‌లలో లభించనున్నట్లు తెలిపారు. Tecno Phantom V ఫ్లిప్ 5G మోడల్‌తో పోల్చి చూసినప్పుడు దాని ధర 8GB RAM + 256GB స్టోరేజ్ వేరియంట్ రూ. 54,999గా ఉంది. అలాగే, ఈ మోడల్ బ్లాక్, మిస్టిక్ డాన్ షేడ్స్‌లో లభిస్తుంది. ఆండ్రాయిడ్ 14తో పని చేస్తుంది..
Tecno Phantom V ఫ్లిప్ 2 మోడల్ 6.9-అంగుళాల ఫుల్-HD+ (1,080x2,640 పిక్సెల్‌లు) AMOLED మెయిన్ డిస్‌ప్లేతో వస్తుంది. అలాగే, 466x466 పిక్సెల్‌ల రిజల్యూషన్‌తో 1.32-అంగుళాల కవర్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఇది ఆక్టా-కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 8020 ప్రాసెసర్‌తో రన్ అవుతుంది. ఇది గతంలో ఉన్న మోడల్‌తో పోల్చినప్పుడు MediaTek డైమెన్సిటీ 8050 ప్రాసెసర్ కంటే అప్‌గ్రేడ్ వెర్షన్‌గా గుర్తించవచ్చు. ఇది ఆండ్రాయిడ్ 14తో పని చేస్తుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
గత మోడల్ మాదిరిగానే..
ఇక కెమెరా పని తీరు విషయానికి వస్తే.. Tecno Phantom V మాదిరిగానే Tecno Phantom V ఫ్లిప్ 2 5G కూడా అవే స్పెసిఫికేషన్స్‌తో రాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ స్మార్ట్ ఫోన్ 64-మెగా పిక్సెల్ ప్రైమరీ సెన్సర్ కెమెరాను కలిగి ఉంటుంది. క్వాడ్ ఫ్లాష్ లైట్ యూనిట్‌తో 13-అంగుళాల మెగా పిక్సెల్ సెన్సర్ విత్ వైడ్ యాంగిల్ లెన్స్ కెమెరాను అందించనున్నారు. అలాగే, సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ప్రత్యేకంగా 32-మెగాపిక్సెల్ సెన్సర్ కెమెరాను అమర్చనున్నారని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. దీంతోపాటు Tecno Phantom V మాదిరిగానే రాబోయే మోడల్‌లోనూ క్లామ్‌షెల్ ఫోల్డబుల్ 4,000mAh బ్యాటరీని అందివ్వనున్నారు. ఫోన్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, సపోర్ట్ ఫేస్ అన్‌లాక్ ఫీచర్‌ని కలిగి ఉంటుంది. నిజానికి, Tecno Phantom V 5జీతోపాటు వై-ఫై 6, ఎన్ఎఫ్సీ, బ్లూటూత్ 5.1 కనెక్టివిటీ, ఎల్లా జీపీటీ 3.0కు మద్దతుగా ఉన్నట్లే Tecno Phantom V ఫ్లిప్ 2 5G కూడా ఉంటుందని అంచనా వేస్తున్నారు. దీని బరువు 196 గ్రాములుగా ఉండనుంది. మరి ఇప్పటికే మార్కెట్‌లో ఉన్న పార్ట్‌బుల్ ఫోన్‌లతో ఈ మోడల్ ఫోన్ ఎంతవరకూ పోటీ ఉంటుందో తెలియాలంటే మాత్రం Tecno Phantom అధికారికంగా ఓ ప్రకటన విడుదల చేయాల్సిందే!