కొత్త వర్షన్‌లో BlueVolt Technology అప్‌గ్రేడ్ చేయబడింది

వివో తన స్మార్ట్‌ఫోన్ల కోసం తాజా ఆపరేటింగ్ సిస్టమ్ OriginOS 6 ను బుధవారం గ్లోబల్ మార్కెట్లలో అధికారికంగా ప్రకటించింది.

కొత్త వర్షన్‌లో BlueVolt Technology అప్‌గ్రేడ్ చేయబడింది

Photo Credit: Vivo

OriginOS 6 నవంబర్ నుండి OTA అప్‌డేట్‌గా అందుబాటులోకి రానుంది

ముఖ్యాంశాలు
  • కొత్త ఆపరేటింగ్ సిస్టం ప్రకటించిన వివో
  • ఆపిల్ తరహాలో Origin Island
  • అధునూతన AI ఫీచర్లుతో అందుబాటులోకి
ప్రకటన

వివో తన స్మార్ట్‌ఫోన్ల కోసం తాజా ఆపరేటింగ్ సిస్టమ్ OriginOS 6 ను బుధవారం గ్లోబల్ మార్కెట్లలో అధికారికంగా ప్రకటించింది. ఇప్పటివరకు వినియోగదారులు ఉపయోగిస్తున్న FuntouchOS స్థానంలో ఇది వస్తోంది. ఆండ్రాయిడ్ 16 ఆధారంగా రూపుదిద్దుకున్న ఈ కొత్త సిస్టమ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) యుగంలో “మనిషి-కంప్యూటర్ పరస్పర చర్యలను పూర్తిగా పునర్నిర్వచిస్తుంది” అని కంపెనీ చెబుతోంది.

కొత్త Origin Smooth Engine ద్వారా సిస్టమ్‌ ప్రాసెసింగ్, స్టోరేజ్, డిస్‌ప్లే వంటి ప్రధాన భాగాలను ఆప్టిమైజ్ చేస్తూ మరింత స్మూత్ యూజర్ అనుభవం అందిస్తుందని వివో వెల్లడించింది. అదనంగా కొత్త మోషన్ ఎఫెక్ట్స్, ఫాంట్‌లు, కస్టమైజేషన్ ఆప్షన్లు మరియు అనేక AI ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి.

OriginOS 6 విడుదల షెడ్యూల్:

వివో ప్రకారం, OriginOS 6 నవంబర్ నుండి దశలవారీగా ఓవర్-ద-ఎయిర్ (OTA) అప్‌డేట్ రూపంలో అందుబాటులోకి వస్తుంది. అప్‌డేట్ మొదట కొన్ని ఎంపిక చేసిన మోడళ్లకు వస్తుంది, తరువాత క్రమంగా ఇతర పరికరాలకు విస్తరించనుంది.

ప్రధాన ఫీచర్లు:

కొత్త Origin Animation System యూజర్ ఇంటర్‌ఫేస్‌ను మరింత లైవ్లీగా, బ్యూటిఫుల్ గా మార్చుతుంది. ఇందులో స్ప్రింగ్ యానిమేషన్, బ్లర్ ట్రాన్సిషన్, మార్ఫింగ్ యానిమేషన్, వన్ షాట్ యానిమేషన్ వంటి కొత్త మోషన్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. యాప్ లాంచింగ్ వేగాన్ని పెంచడానికి వివో ప్రత్యేకంగా రూపొందించిన Snap-Up Engine 50 యాప్స్ వరుసగా ఓపెన్ చేసినా 16 శాతం వేగంగా ప్రతిస్పందిస్తుంది. టచ్ రెస్పాన్స్ కూడా 41 శాతం వేగంగా ఉంటుందని కంపెనీ చెబుతోంది.

కొత్త Origin Design System ద్వారా కలర్, షేప్, ఐకాన్, ఫాంట్, లేఅవుట్, మెటీరియల్ మరియు డెప్త్ లాంటి అన్ని విజువల్ ఎలిమెంట్లను ఒకే ఫార్మాట్లో ఉంచుతుంది. అదనంగా Vivo Sans అనే కొత్త ఫాంట్ 40కి పైగా భాషలను సపోర్ట్ చేస్తుంది, అలాగే అక్షరాల మందాన్ని యూజర్ అవసరానికి అనుగుణంగా మార్చుకోవచ్చు.

యూజర్ ఇంటర్‌ఫేస్:

యూజర్ ఇంటర్‌ఫేస్‌లో డైనమిక్ గ్లో మరియు ట్రాన్స్లుసెంట్ కలర్ అంశాలు చేరాయి, ఇవి Apple యొక్క “Liquid Glass” డిజైన్‌కు దగ్గరగా ఉంటాయి. కొత్త లాక్‌స్క్రీన్ గ్రిడ్ 4x7 లేఅవుట్ ఆప్షన్‌తో వస్తుంది. అదనంగా ఫ్లిప్ కార్డ్స్ ఫీచర్ ద్వారా ఫోన్ టిల్ట్ చేసినప్పుడు ఫోల్డర్లు ఆటోమేటిక్‌గా మారతాయి.

ఆపిల్ యొక్క “Dynamic Island” నుండి ప్రేరణ పొందిన Origin Island సిస్టమ్ టాప్ భాగంలో పిల్ ఆకారంలో కనిపిస్తూ రియల్ టైమ్ స్టేటస్ అప్‌డేట్స్, నోటిఫికేషన్లు చూపిస్తుంది. ఇది Android 16 లోని Live Updates ఫీచర్‌తో కూడా సమన్వయంగా పనిచేస్తుంది.

AI ఫీచర్లు మరియు ప్రొడక్టివిటీ టూల్స్:

AI ఆధారిత ఫీచర్లలో AI రీటచ్, AI ఎరేస్, AI ఇమేజ్ ఎక్స్పాండర్, AI ఫోటో ఇన్హాన్స్ , స్మార్ట్ కాల్ అసిస్టెంట్, డాక్ మాస్టర్, AI క్రియేషన్, AI సెర్చ్ వంటి అనేక కొత్త టూల్స్ ఉన్నాయి. అదనంగా Gemini మరియు Circle to Search ఫీచర్లను కూడా మరింత మెరుగుపరిచారు.

భద్రత మరియు బ్యాటరీ మెరుగులు:

కొత్త వర్షన్‌లో BlueVolt Technology అప్‌గ్రేడ్ చేయబడింది. ఇది పవర్ ఎఫిషియెన్సీని పెంచి, ఛార్జింగ్ సమయంలో సిస్టమ్ స్థిరత్వాన్ని కాపాడుతుంది. వివో ప్రకారం, భద్రత మరియు ప్రైవసీ పరంగా కూడా OriginOS 6 మరింత రక్షణాత్మకంగా రూపుదిద్దుకుంది. మొత్తానికి, OriginOS 6 వివో యూజర్లకు నూతన రూపకల్పన, వేగవంతమైన పనితీరు, విస్తృత AI అనుభవం, ఇంకా మెరుగైన భద్రతతో కూడిన ఒక సమగ్ర అప్‌డేట్‌గా నిలుస్తుంది.

Comments

ప్రకటన

ప్రకటన

#తాజా కథనాలు
  1. హువావే నుంచి సరికొత్త స్మార్ట్ ఫోన్, 5500mAh బ్యాటరీ, డ్యూయల్ రియర్ కెమెరా యూనిట్‌
  2. Huawei ఇప్పటివరకు Nova Flip S ప్రాసెసర్ లేదా RAM వివరాలను అధికారికంగా వెల్లడించలేదు
  3. అదనంగా, Vivo కంపెనీ Vivo Sans అనే కొత్త ఫాంట్‌ను ప్రవేశపెట్టింది
  4. అక్టోబర్ చివర్లో లేదా నవంబర్ ప్రారంభంలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది
  5. వాట్సప్‌లో అదిరే అప్డేట్.. త్వరలోనే ప్రారంభం
  6. ఆపిల్ నుంచి కొత్త మ్యాక్ బుక్ ప్రో.. అదిరే ఫీచర్స్
  7. ఇన్ స్టాగ్రాంలో దీపావళి స్పెషల్.. ఈ ఎడిట్ గురించి మీకు తెలుసా?
  8. సామ్ సంగ్ గెలాక్సీ ఎస్26 ఎడ్జ్ మోడల్‌కి గుడ్ బై.. దాని స్థానంలో రానున్నది ఇదే
  9. ఒప్పో వాచ్ ఎస్ ప్రారంభం.. కళ్లు చెదిరే ధర, ఫీచర్స్
  10. ఈ రెండు ఫోన్లూ 80W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తాయి
© Copyright Red Pixels Ventures Limited 2025. All rights reserved.
Trending Products »
Latest Tech News »