Photo Credit: Vivo
Vivo T3 Ultra is expected to join the Vivo T3 Pro 5G (pictured) handset in the country
స్మార్ట్‌ఫోన్‌ల తయారీ దిగ్గజ సంస్థ Vivo నుంచి Vivo T3 Ultra పేరుతో కొత్త మోడల్ త్వరలో దేశీయ మార్కెట్‌లోకి విడుదల కానున్నట్లు సమాచారం. అయితే, ఈ హ్యాండ్‌సెట్ లాంచ్ వివరాలు కంపెనీ ఇంకా అధికారికంగా ధృవీకరించలేదు. కానీ, స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించిన వివరాలు ఆన్‌లైన్‌లో చక్కర్లు కొడుతున్నాయి. ఇప్పటికే అనేక లీక్‌లు, నివేదికల ఆధారంగా ఈ ఫోన్ లాంచ్ టైమ్‌లైన్‌తో పాటు RAM, స్టోరేజ్ వేరియంట్‌లు, దేశీయ మార్కెట్‌లో దీని ధరలను మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. Vivo T3 Ultra దేశంలో ప్రస్తుతం ఉన్న Vivo T3 సిరీస్ ఫోన్‌ల జాబితాలో చేరవచ్చని తెలుస్తోంది. మరెందుకు ఆలస్యం.. ఈ హ్యాండ్‌సెట్‌కు సంబంధించిన మరిన్ని ఆసక్తికరమైన విషయాలను చూసేద్దామా?!
మోడల్ నంబర్ V2426తో Vivo హ్యాండ్‌సెట్ గీక్‌బెంచ్‌లో గుర్తించబడింది. అది Vivo T3 Ultra మోడల్‌గా భావిస్తున్నారు. సింగిల్-కోర్ మరియు మల్టీ-కోర్ పరీక్షలలో ఫోన్ వరుసగా 1,854, 5,066 పాయింట్లను స్కోర్ చేసింది. ఈ పరీక్షించబడిన వేరియంట్ 12GB RAM మరియు ఆండ్రాయిడ్ 14 OSకి సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్ ఆక్టా-కోర్ చిప్‌సెట్‌ను కలిగి ఉందని లిస్టింగ్ చూపిస్తుంది. అలాగే, Mediatek డైమెన్సిటీ 9200+ SoCగా సూచించబడుతుంది. ఈ సిరీస్‌లో వచ్చిన మోడల్స్‌తో పోల్చితే చాలా మార్పులు కనిపిస్తున్నాయి.
ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్..
Vivo T3 Ultraకు సంబంధించి పీచర్స్ విషయానికి వస్తే.. ఈ హ్యాండ్‌సెట్ 120Hz రిఫ్రెష్ రేట్, 4500nits పీక్ బ్రైట్‌నెస్‌తో 6.77-అంగుళాల 1.5K 3D కర్వ్డ్ AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంటుందని గత లీక్‌ల ఆధారంగా గుర్తించబడింది. అలాగే, MediaTek డైమెన్సిటీ 9200+ SoCని 12GB వరకు RAM మరియు 256GB వరకు ఆన్‌బోర్డ్ స్టోరేజీ సామర్థ్యంతో రూపొందించబడింది. కెమెరా విభాగంలో, Vivo T3 Ultra ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS) సపోర్ట్‌తో 50-మెగాపిక్సెల్ Sony IMX921 ప్రైమరీ సెన్సార్, వెనుకవైపు 8-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ యాంగిల్ షూటర్‌ని అందించవచ్చు. అలాగే, ఫ్రంట్ కెమెరా స్లాట్ 16-మెగాపిక్సెల్ సెన్సార్‌ను కలిగి ఉంటుంది.
Vivo T3 Ultra 80W వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,500mAh బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఫోన్ దుమ్ము మరియు నీటి నిరోధకత కోసం అల్ట్రా-స్లిమ్, IP68 రేటింగ్‌ను కలిగి ఉంటుంది. భద్రత కోసం ఇది ఇన్-డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌తో అమర్చబడిందని చెబుతున్నారు. అలాగే, డ్యూయల్ స్పీకర్లను కూడా కలిగి ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. ఇక ధర విషయానికొస్తే.. Vivo T3 Ultra భారతదేశంలో 8GB + 128GB వేరియంట్ కోసం రూ. 30,999, 8GB + 256GB మరియు 12GB + 256GB వేరియంట్‌ల కోసం వరుసగా రూ. 32,999, రూ. 34,999గా ఉండవచ్చు. ఈ ఫోన్ ఫ్రాస్ట్ గ్రీన్, లూనా గ్రే రంగులలో అందుబాటులో ఉండవచ్చు. ఇది సెప్టెంబరు మొదటివారంలో దేశీయ మార్కెట్‌లో ప్రారంభించబడుతుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.
ప్రకటన
ప్రకటన