Photo Credit: Vivo
చైనాలో Vivo X200 సిరీస్ విడుదలైంది. కంపెనీ Vivo X200, X200 Pro, X200 Pro Mini పేరుతో మూడు హ్యాండ్‌సెట్‌లను లాంచ్ చేసింది. ఇందులో రెండు హ్యాండ్‌సెట్‌లు గతంలో వచ్చిన X100 సిరీస్ స్పెసిఫికేషన్స్‌తో రూపొందించారు. అయితే, X200 Pro Mini మాత్రం పూర్తిగా కొత్త మోడల్ అని కంపెనీ చెబుతోంది. మొత్తంగా Vivo X200 సిరీస్ న్యూ MediaTek డైమెన్సిటీ 9400 ప్రాసెసర్, ఆరిజిన్ OS 5 వంటి స్పెసిఫికేషన్‌లను కలిగి ఉంది. Vivo కంపెనీ సొంత వెర్షన్ సర్కిల్ టు సెర్చ్‌తో సహా AI ద్వారా ఆపరేట్ చేయబడుతుంది.
చైనాలో Vivo X200 ధర 12GB+256GB స్టోరేజ్ వేరియంట్ CNY 4,300 (సుమారు రూ. 51,000) నుండి ప్రారంభమవుతుంది. అలాగే, 12GB+512GB, 16GB+512GB, 16GB+1TB స్టోరేజ్ వేరియంట్‌లలో కూడా అందుబాటులో ఉంది. Vivo X200 Pro ధర 12GB+256GB స్టోరేజ్ మోడల్ CNY 5,999 (దాదాపు రూ. 63,000) నుండి ప్రారంభమవుతుంది. Vivo X200 Pro Mini అదే వేరియంట్ కోసం CNY 4,699 (దాదాపు రూ. 56,000) చెల్లించాల్సి ఉంటుంది. ఇవి కార్బన్ బ్లాక్, టైటానియం గ్రే, మూన్‌లైట్ వైట్, సఫైర్ బ్లూ అనే నాలుగు రంగులలో అందుబాటులో ఉన్నాయి. ఇవి ప్రీఆర్డర్‌లకు అవకాశం కల్పించారు. X200, X200 Pro Mini అక్టోబర్ 19న స్టోర్‌లలో విక్రయానికి అందుబాటులో ఉంటాయి. X200 Pro మాత్రం అక్టోబర్ 25 నుండి కొనుగోలు చేయవచ్చు.
Vivo X200 స్మార్ట్‌ఫోన్ 6.67-అంగుళాల 10-బిట్ OLED LTPS క్వాడ్-కర్వ్డ్ స్క్రీన్‌ను Zeiss నేచురల్ కలర్ సపోర్ట్‌తో వస్తుంది. HDR 10+, 4,500 నిట్‌ల గరిష్ట బ్రైట్‌నెస్ కోసం హై-ఫ్రీక్వెన్సీ PWM డిమ్మింగ్‌ను పొందుతుంది. కెమెరా విషయానికి వస్తే.. ఇది 50-మెగాపిక్సెల్ సోనీ IMX921 ప్రైమరీ కెమెరా, 50-మెగాపిక్సెల్ సోనీ IMX882 టెలిఫోటో సెన్సార్, 50-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ షూటర్‌తో కూడిన ట్రిపుల్ రియర్ కెమెరా యూనిట్‌లో వస్తుంది. ఈ మూడు మోడల్‌లు న్యూ MediaTek డైమెన్సిటీ 9400 ప్రాసెసర్‌తో పని చేస్తాయి.
Vivo X200 Pro కొన్ని మార్పులు మినహా స్టాండర్డ్ మోడల్‌కు సమానమైన స్క్రీన్‌ను అందించారు. ఇది 120Hz వరకు వేరియబుల్ రిఫ్రెష్ రేట్‌తో కూడిన LTPO ప్యానెల్‌ను ఉంటుంది. ఈ మోడల్‌లోని డిస్‌ప్లే 1.63 మి.మీతో సన్నగా ఉండే బెజెల్స్‌ను కలిగి ఉంది. X200 Pro Mini కాంపాక్ట్ 6.31-అంగుళాల ఫ్లాట్ డిస్‌ప్లేతో వస్తుంది. X200 లైనప్‌లోని రెండు ప్రో మోడల్‌లు న్యూ 50-మెగాపిక్సెల్ Sony LYT-818 కెమెరా, 50-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ యాంగిల్ లెన్స్‌తో కూడిన ట్రిపుల్ రియర్ కెమెరా యూనిట్‌ను అందించారు. టెలిఫోటో కెమెరాలో స్వల్ప మార్పులు ఉన్నాయి. Vivo X200 Pro, X200 Pro Mini వరుసగా 6,000mAh, 5,800mAh బ్యాటరీ సామర్థ్యంతో రెండూ 90W వైర్డు ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తాయి.
ప్రకటన
ప్రకటన