Photo Credit: Vivo
భారత్‌లో ఇటీవలే Vivo X200 సిరీస్ పరిచయం అయిన విషయం తెలిసిందే. తాజాగా Vivo నుంచి X200 అల్ట్రా మోడల్‌ను లాంచ్ చేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ Vivo X200 అల్ట్రా గురించిన ఎలాంటి వివారాలను కూడా కంపెనీ అధికారికంగా వెల్లడించనప్పటికీ, కొత్త మోడల్ కెమెరాకు సంబంధించిన కీలక విషయాలు బహిర్గతమయ్యాయి. 200-మెగాపిక్సెల్ సెన్సార్‌తో కూడిన ట్రిపుల్ రియర్ కెమెరా యూనిట్‌ను Vivo X200 అల్ట్రా కలిగి ఉంటుంది. అలాగే, కెమెరా యూనిట్ గరిష్టంగా 120fps (సెకన్ పెర్ ఫ్రేమ్స్)తో 4K రిజల్యూషన్ వీడియోలను రికార్డ్ చేయగలదని ప్రచారం జరుగుతోంది.
ప్రముఖ చైనీస్ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ Weiboలోని ఓ పోస్ట్‌లో టిప్‌స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ Vivo X200 అల్ట్రా ఫోన్ 50-మెగాపిక్సెల్ మెయిన్ సెన్సార్, 50-మెగాపిక్సెల్ సెకండరీ సెన్సార్, 200-మెగాపిక్సెల్ కెమెరాతో కూడిన ట్రిపుల్ రియర్ కెమెరా యూనిట్‌ను కలిగి ఉంటుందని వెల్లడించింది. అలాగే, ప్రధాన కెమెరా వైడ్ లెన్స్ కలిగి ఉంటుందని అంచనా వేస్తున్నారు. అంతేకాదు, సెకండరీ కెమెరాలో అల్ట్రా-వైడ్ లెన్స్‌తో రావచ్చని భావిస్తున్నారు.
Vivo X200 ఫోన్‌లోని 200-మెగాపిక్సెల్ పెరిస్కోప్ కెమెరాకు Samsung ISOCELL HP9 సెన్సార్‌ను వినియోగించవచ్చు. ఈ మోడల్‌లోని అన్ని కెమెరాలతో 120fps వద్ద 4K వీడియోలను రికార్డ్ చేసేందుకు వీలుంటుందని ప్రచారం జరుగుతోంది. అలాగే, ప్రైమరీ కెమెరాలో లార్జ్ ఎపర్చరు, యాంటీ-షేకింగ్ ఫీచర్లును అందించారు. ఈ ఫోన్‌లో న్యూ జనరేషన్ వివో ఇన్‌హౌస్ ఇమేజింగ్ చిప్‌ని పొందుపరిచినట్లు పేర్కొన్నారు.
గతంలో వచ్చిన Vivo X100 Ultra Zeiss బ్రాండెడ్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌తో పరిచయం అయింది. అలాగే, ఇందులో 1-అంగుళాల పరిమాణం 50-మెగాపిక్సెల్ Sony LYT-900 సెన్సార్, 50-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్-యాంగిల్ కెమెరా, 200-megapixel APO సూపర్ టెలిఫోటో ISOLL సెన్సార్‌ను అందించారు. ఈ హ్యాండ్‌సెట్‌లో 4K మూవీ పోర్ట్రెయిట్ వీడియోలను షూట్ చేయడానికి బ్లూప్రింట్ ఇమేజింగ్ చిప్ V3+ చిప్ ఉంటుంది.
భారతదేశంలో Vivo ఇటీవల Zeiss-బ్రాండెడ్ ట్రిపుల్ వెనుక కెమెరాలతో తన X200 సిరీస్‌ను ప్రారంభించింది. Vivo X200 Pro కెమెరా యూనిట్‌లో OIS సపోర్ట్‌తో 50-మెగాపిక్సెల్ Sony LYT-818 సెన్సార్, ఆటోఫోకస్‌తో కూడిన 50-మెగాపిక్సెల్ వైడ్-యాంగిల్ కెమెరా, 3.7x ఆప్టికల్ జూమ్‌తో కూడిన 200-మెగాపిక్సెల్ టెలిఫోటో ISOCELL HP9 సెన్సార్‌ను అందించింది. దీనికి కూడా V3+ ఇమేజింగ్ చిప్ ఉంది.
ఈ వనిల్లా Vivo X200 ఫోన్ OIS సపోర్ట్‌తో 50-మెగాపిక్సెల్ Sony IMX921 1/1.56-అంగుళాల సెన్సార్, 50-మెగాపిక్సెల్ JN1 సెన్సార్, 3x ఆప్టికల్ జూమ్‌తో 50-మెగాపిక్సెల్ Sony IMX882 టెలిఫోటో సెన్సార్‌ను కలిగి ఉంటుంది. అయితే, ఈ మోడల్‌కు సంబంధించి కంపెనీ అధికారిక ప్రకటన వచ్చిన తర్వాత దీనిపై పూర్తి క్లారిటీ వస్తుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.
ప్రకటన
ప్రకటన