V50 ఫోన్ ప్రాసెసర్, ఛార్జింగ్ వేగం లాంటి కొన్ని వివరాలను మినహాయించనట్లు తెలుస్తోంది. ల్యాండింగ్ పేజీ ఫోన్ కాస్మెటిక్ డిజైన్‌తో పాటు లాంచ్ సమయంలో అందుబాటులో ఉండే కలర్ ఆప్షన్‌లను కూడా వెల్లడిస్తోంది.
Photo Credit: Vivo
Vivo V50 (చిత్రం) మునుపటి V40 మోడల్‌తో సమానంగా కనిపిస్తుంది
Vivo నుంచి రాబోయే V-సిరీస్ ఫ్లాగ్‌షిప్ ఫోన్ V50 వివరాలను కంపెనీ అధికారికంగా వెల్లడించింది. మనదేశంలో అడుగుపెట్టబోయే V50 మోడల్ గత ఏడాది ఆగస్టులో లాంఛ్ అయిన V40 ప్రో మోడల్ స్థానాన్ని భర్తీ చేయనుంది. రాబోయే V50 గురించిన అనేక విషయాలు ఆన్‌లైన్‌లో చక్కర్లు కొడుతోన్న నేపథ్యంలో Vivo తన రాబోయే ప్రీమియం స్మార్ట్ ఫోన్ గురించి అనేక అంశాలను కంపెనీ వెబ్‌సైట్ ద్వారా అధికారికంగ వెల్లడించాలని నిర్ణయించినట్లు సమాచారం. అయితే, ఇందులో ఫోన్ ప్రాసెసర్, ఛార్జింగ్ వేగం లాంటి కొన్ని వివరాలను మినహాయించనట్లు తెలుస్తోంది. ల్యాండింగ్ పేజీ ఫోన్ కాస్మెటిక్ డిజైన్‌తో పాటు లాంచ్ సమయంలో అందుబాటులో ఉండే కలర్ ఆప్షన్‌లను కూడా వెల్లడిస్తోంది.
Vivo V50 డిజైన్ అది భర్తీ చేసే మోడల్‌కి చాలా పోలిక ఉంటుంది. అయితే, ఇది మరింత రౌండెడ్ షేప్‌తో రాబోతోంది. మరీ ముఖ్యంగా, ఈ హ్యాండ్‌సెట్ డిజైన్‌లో ప్రధానంగా గుర్తించదగిన మార్పు దీని డిస్‌ప్లే అని చెప్పొచ్చు. అంతే కాదు, ఇది డ్యూయల్-కర్వ్డ్ ఎడ్జ్ ప్యానెల్‌లా కాకుండా, క్వాడ్-కర్వ్డ్ ప్యానెల్ డిజైన్‌తో వస్తుంది. అంటే, ఈ డిస్‌ప్లే Vivo V40లా రెండు (ఎడమ, కుడి) కాకుండా నాలుగు వైపులా అంచుల మీదుగా కొంచెం కర్వ్డ్ ఉంటుంది.
ఈ మోడల్ దుమ్ము, నీటి నియంత్రణ కోసం ఫోన్ IP రేటింగ్ అధికారికంగా IP68, IP69 రేటింగ్‌తో మరింత మెరుగుపడింది. ఈ ఫోన్ రోజ్ రెడ్, స్టార్రి బ్లూ, టైటానియం గ్రే వంటి ఆకర్షణీయమైన రంగులలో అందుబాటులో ఉంటుంది. ఫోన్ వెనుక భాగంలో కీహోల్ ఆకారంలో కెమెరా మాడ్యూల్ మునుపటి మోడల్ మాదిరిగానే ఉంది. ఇది మళ్ళీ రెండు కెమెరాలను కలిగి ఉంటుంది. మూడు కెమెరాలు 50-మెగాపిక్సెల్ సెన్సార్లను ఉపయోగిస్తాయని సైట్‌లో వెల్లడించింది. ఇందులో 50-మెగాపిక్సెల్ ఫ్రంట్-ఫేసింగ్ కెమెరా, 50-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 50-మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ కెమెరాలు ఉంటాయి.
Vivo ఆరా లైట్ ఫీచర్‌ను కూడా అందించారు. అంతే కాదు, మునుపటి మోడల్‌తో పోలిస్తే దీని పరిమాణం చాలా పెద్దదిగా కనిపిస్తోంది. ల్యాండింగ్ పేజీ ద్వారా వెల్లడైన ఇతర వివరాలను పరిశీలిస్తే.. 6000mAh భారీ బ్యాటరీ, Funtouch OS 15, ఇటీవల కంపెనీ ఫ్లాగ్‌షిప్ మోడల్ అయిన Vivo X200 Proలో వచ్చిన కొన్ని AI, కెమెరా ఫీచర్‌లు ఉన్నాయి. ఈ ఫీచర్స్ కొనుగోలుదారులను మరింతగా ఆకర్షించే అవకాశాలు ఉన్నట్లు మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.
అయితే, దీని ప్రాసెసర్, ఛార్జింగ్ వేగం వంటి అంశాలపై స్పష్టత లేదు. Vivo V50 క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7 Gen 3 ప్రాసెసర్‌ను కలిగి ఉంటుందని గత నివేదిక వెల్లడించింది. మరొక నివేదిక ప్రకారం ఈ ఫోన్ ఫిబ్రవరి 18న మనదేశంలో లాంఛ్ కావచ్చని ప్రచారం జరుగుతోంది. అయితే, దీనిపై కూడా పూర్తి స్థాయి స్పష్టత రావాల్సి ఉంది.
ప్రకటన
ప్రకటన
Kepler and TESS Discoveries Help Astronomers Confirm Over 6,000 Exoplanets Orbiting Other Stars
Rocket Lab Clears Final Tests for New 'Hungry Hippo' Fairing on Neutron Rocket