Photo Credit: Vivo
చైనాలో గత నెల Vivo X200, Vivo X200 Pro, Vivo X200 Pro Mini స్మార్ట్ ఫోన్‌లు ప్రారంభించబడ్డాయి. అయితే, ఈ మోడల్స్ గ్లోబల్ మార్కెట్‌లో ఎప్పుడు లాంచ్ అవుతాయన్న విషయాన్ని Vivo ఇంకా ధృవీకరించలేదు. తాజాగా భారత్‌లో వచ్చే నెల లాంచ్ ఉంటుందని లీక్ అయ్యింది. అయితే, Vivo X200 సిరీస్‌లోని అన్ని మోడల్స్ ఇండియా మార్కెట్‌లో అందుబాటులో ఉండవని తాజా నివేదికలో తెలుస్తోంది. Vivo X200 సిరీస్‌లోని స్మార్ట్ ఫోన్‌లు MediaTek డైమెన్సిటీ 9400 ప్రాసెసర్, ఆరిజిన్ OS 5 UI, ఫీచర్ Zeiss-బ్రాండెడ్ కెమెరాలపై రన్ అవుతాయి. మరెందుకు ఆలస్యం.. ఈ Vivo X200 సిరీస్‌కు సంబంధించిన స్పెసిఫికేషన్స్‌తోపాటు ధర వివరాలను చూసేద్దామా!
భారతదేశంలో Vivo డిసెంబర్‌లో Vivo X200, Vivo X200 ప్రోలను విడుదల చేయనున్నట్లు 91మొబైల్స్ చెబుతోంది. అయితే, ఈ బ్రాండ్ భారతీయ మార్కెట్‌లో X200 ప్రో మినీని మాత్రం తీసుకురాకపోవచ్చట. Vivo X200 సిరీస్ గత నెలలో చైనాలో ఆవిష్కరించిన ఈ సిరీస్ ప్రస్తుతం అక్కడ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. X200 సిరీస్ డిజైన్ ఆకట్టుకునేలా ఉండడంతో ఈ స్మార్ట్ ఫోన్‌లకు చైనా మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉన్నట్లు ఆన్‌లైన్ స్టేట్‌మెట్స్‌లో స్పష్టంగా తెలుస్తోంది. అలాగే, ఈ లైనప్ త్వరలో మలేషియా మార్కెట్‌లోకి అడుగుపెడుతుందని నిర్ధారించబడింది. అయితే, Vivo X200 Pro Mini మోడల్ మాత్రం గ్లోబల్ రిలీజ్‌లో భాగమవుతుందా అనే విషయంపై ఎలాంటి స్పష్టతా లేదు.
Vivo X200 సిరీస్ vanilla మోడల్ ధర 12GB + 256GB స్టోరేజ్ కాన్ఫిగరేషన్ చైనా మార్కెట్‌లో CNY 4,300 (దాదాపు రూ. 51,000) నుండి ప్రారంభమవుతుంది. ఈ ఫోన్‌లు నవంబర్ చివరిలో లేదా డిసెంబర్ మొదటి వారంలో ఇండియన్ మార్కెట్‌లో లాంచ్ అవుతాయని గతంలోనే ప్రచారం జరిగింది. అయితే, కంపెనీ మాత్రం భారత్‌లో ఈ Vivo X200 సిరీస్ అమ్మకాల గురించిన ఎటువంటి వివరాలను వెల్లడించలేదు. గత Vivo X సిరీస్ ఫోన్‌లు భారతీయ మార్కెట్‌లో అందుబాటులోకి వచ్చాయి.
ఈ Vivo X200, X200 Pro, X200 Pro Mini ఫోన్‌లు ఆండ్రాయిడ్ 15 ఆధారంగా ఆరిజిన్ OS 5తో విడుదలయ్యాయి. ఈ మూడు ఫోన్‌లు MediaTek డైమెన్సిటీ 9400 ప్రాసెసర్‌తో రన్ అవుతాయి. 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాతో కూడిన Zeiss-బ్రాండెడ్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌తో వీటిని రూపొందించారు. Vivo X200 Pro 200-మెగాపిక్సెల్ టెలిఫోటో సెన్సార్‌ను కలిగి ఉంటుంది. vanilla Vivo X200 5,800mAh బ్యాటరీతో 90W వైర్డు ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. అలాగే, Vivo X200 Pro, X200 Pro Mini వరుసగా 6,000mAh, 5,800mAh బ్యాటరీలతో 90W వైర్డ్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తున్నాయి. మరి.. భారత్ మార్కెట్‌లోకి విడుదలైతే డిమాండ్ ఎలా ఉంటుందో చూడాల్సిందే.
ప్రకటన
ప్రకటన