వివో X300 సిరీస్‌లో పలు అప్‌గ్రేడ్స్ వస్తున్నాయి. వివో X300 మోడల్‌లో 6.31-అంగుళాల 8T LTPO BOE డిస్ప్లే ఉండబోతోంది. దీని బ్రైట్‌నెస్ కేవలం 1 నిట్ వరకు తగ్గించుకోవచ్చు. బ్యాక్ సైడ్‌లో APO పెరిస్కోప్ టెలిఫోటో సెన్సార్‌తో పాటు టెలిఫోటో మాక్రో షూటర్‌ను అందిస్తున్నారు.
Photo Credit: Vivo
వివో X300 సిరీస్‌లో ట్రిపుల్ రియర్ కెమెరా యూనిట్ ఉండవచ్చు, ఇది వివో X200 సిరీస్ మాదిరిగానే ఉంటుంది (చిత్రంలో)
వివో అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న వివో X300 సిరీస్ గురించి కీలక సమాచారం తాజాగా బయటికి వచ్చింది. కంపెనీ ప్రొడక్ట్ మేనేజర్ హాన్ బోషియావో స్వయంగా ఈ వివరాలను పంచుకున్నారు. ఆయన వెల్లడించిన ప్రకారం, రాబోయే వివో X300 Pro మోడల్‌లో ప్రత్యేకంగా అభివృద్ధి చేసిన కొత్త వైబ్రేషన్ మోటార్‌తో పాటు, స్వంతంగా డెవలప్ చేసిన యూనివర్సల్ సిగ్నల్ యాంప్లిఫైయర్ చిప్‌సెట్ ను అందించబోతోంది. గత అక్టోబర్‌లో విడుదలైన వివో X200 సిరీస్‌కు కంటిన్యూషన్గా ఈ ఫోన్ మార్కెట్లోకి రానుంది. ఈ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ చైనా మార్కెట్‌లో అక్టోబర్ 13న విడుదలయ్యే అవకాశముంది. ఇదే సిరీస్‌లోని స్టాండర్డ్ వివో X300 మోడల్ 50 మెగాపిక్సెల్ సోనీ LYT602 పెరిస్కోప్ టెలిఫోటో కెమెరాను కలిగి ఉంటుందని సమాచారం.
వివో X300 సిరీస్‌లో పలు అప్‌గ్రేడ్స్ వస్తున్నాయి. వివో X300 మోడల్‌లో 6.31-అంగుళాల 8T LTPO BOE డిస్ప్లే ఉండబోతోంది. దీని బ్రైట్‌నెస్ కేవలం 1 నిట్ వరకు తగ్గించుకోవచ్చు. బ్యాక్ సైడ్‌లో APO పెరిస్కోప్ టెలిఫోటో సెన్సార్‌తో పాటు టెలిఫోటో మాక్రో షూటర్‌ను అందిస్తున్నారు. అదనంగా, ఫోన్‌లో అల్ట్రాసోనిక్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్, హై-స్పెక్ USB టైప్-C పోర్ట్ లభించనున్నాయి.
వివో X300 Pro మోడల్‌లో 6.78-అంగుళాల ఫ్లాట్ స్క్రీన్, చాలా సన్నని మరియు సమానమైన బెజెల్స్‌తో వస్తోంది. ఈ రెండు ఫోన్లు కేవలం 7మి.మీ. మందంతో ఉంటాయి.
వివో ప్రొడక్ట్ మేనేజర్ వెల్లడించిన మరో ముఖ్యమైన ఫీచర్, కస్టమ్-బిల్ట్ సూపర్ సెన్స్ వైబ్రేషన్ మోటార్ (మోడల్ నం. 751440). ఇది కొత్త డిజైన్‌తో, ఆధునిక ఎలక్ట్రోమాగ్నెటిక్ సొల్యూషన్స్‌తో వస్తోంది. అదనంగా, వివో X300 Pro లో మొదటిసారిగా డ్యూయల్-చానెల్ UFS 4.1 ఫోర్-లేన్ ఆన్‌బోర్డ్ స్టోరేజ్ ను అందించనున్నారు. దీని రీడ్ & రైట్ స్పీడ్ గరిష్టంగా 8.6Gbps వరకు చేరుతుంది.
ఇక పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, వివో X300 Pro AnTuTu బెంచ్‌మార్క్‌లో 40,11,932 పాయింట్లు స్కోర్ చేసింది. ఇది ఫోన్ పనితీరులో గణనీయమైన అప్‌గ్రేడ్ ను సూచిస్తోంది. ఈ విధంగా, వివో X300 సిరీస్ డిజైన్, పనితీరు, స్టోరేజ్, కెమెరా సదుపాయాల్లో భారీ మెరుగుదలలతో అక్టోబర్‌లో మార్కెట్‌లోకి రావడానికి సిద్ధమవుతోంది. ఈ సిరీస్ ముఖ్యంగా ఫ్లాగ్‌షిప్ ఫోన్ల మార్కెట్‌లో పోటీని మరింత పెంచే అవకాశం ఉంది.
ప్రకటన
ప్రకటన
Starlink Hiring for Payments, Tax and Accounting Roles in Bengaluru as Firm Prepares for Launch in India