మే 6వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు భారత్‌లో ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఎక్స్300 అల్ట్రా అలాగే ఎక్స్300 ఎఫ్ఈ మోడల్స్ గ్రాండ్‌గా లాంచ్ కానున్నాయి.
Photo Credit: Vivo
200MP సెన్సార్‌తో వీవో X300 ఆల్ట్రా
వచ్చే నెల స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో ప్రకంపనలు సృష్టించేందుకు వివో సిద్ధమైంది. మే 6వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు భారత్‌లో ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఎక్స్300 అల్ట్రా అలాగే ఎక్స్300 ఎఫ్ఈ మోడల్స్ గ్రాండ్‌గా లాంచ్ కానున్నాయి. ఇప్పటికే చైనా మార్కెట్‌లో సంచలనం సృష్టించిన ఈ ఫోన్లు ఇప్పుడు దేశీయ వినియోగదారుల ముందుకు రాబోతున్నాయి. వివో ఇండియా వెబ్‌సైట్ ద్వారా అందుబాటులోకి వచ్చిన వివరాల ప్రకారం ఈ ఫోన్లు కేవలం పెర్ఫార్మెన్స్‌లోనే కాకుండా డిజైన్ పరంగా కూడా చాలా క్లాసీగా ఉండనున్నాయి. గతేడాది చివరలో వచ్చిన ఎక్స్300 సిరీస్‌కు కొనసాగింపుగా వస్తున్న ఈ లేటెస్ట్ వెర్షన్లు టెక్ ప్రియుల్లో భారీ అంచనాలను పెంచేస్తున్నాయి.
ముఖ్యంగా వివో ఎక్స్300 ఎఫ్ఈ స్టైలిష్ లుక్స్‌తో యూత్‌ను ఆకట్టుకోనుంది. లైలాక్ పర్పుల్, నోయిర్ బ్లాక్, అర్బన్ ఆలివ్ వంటి అదిరిపోయే రంగుల్లో ఇది లభించనుంది. కేవలం 7.99 మిల్లీమీటర్ల మందం, 191 గ్రాముల బరువుతో ఉండే ఈ ఫోన్ చేతిలో పట్టుకుంటే చాలా ప్రీమియం అనుభూతిని ఇస్తుంది. దీని ఏజీ ఫినిష్ డిజైన్ స్లిప్పరీగా లేకుండా గ్రిప్ ఇస్తూనే అద్భుతమైన షైనింగ్ అందిస్తుంది. స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 5 చిప్‌సెట్‌తో పాటు ఎల్‌పిడిడిఆర్5ఎక్స్ ర్యామ్ వంటి పవర్‌ఫుల్ ఫీచర్లతో స్పీడ్‌లో ఎక్కడా రాజీ పడకుండా ఈ డివైజ్‌ను వివో రూపొందించింది.
కెమెరా విషయానికి వస్తే వివో ఎక్స్300 ఎఫ్ఈ ఫోటోగ్రఫీ ప్రేమికులకు పండుగలా ఉంటుంది. ఇందులో 50 మెగాపిక్సెల్ సోనీ ఐఎమ్‌ఎక్స్921 మెయిన్ సెన్సార్‌తో పాటు జైస్ లెన్స్‌ల సపోర్ట్ ఉంది. 3ఎక్స్ ఆప్టికల్ జూమ్ ఇచ్చే 50 మెగాపిక్సెల్ టెలిఫోటో కెమెరా ద్వారా దూరంగా ఉన్న వస్తువులను కూడా స్పష్టంగా బంధించవచ్చు. సెల్ఫీల కోసం కూడా 50 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరాను అమర్చారు. వీటికి అదనంగా జైస్ టెలిఫోటో ఎక్స్‌టెండర్ యాక్సెసరీ సపోర్ట్ ఉండటం వల్ల ప్రొఫెషనల్ లెవెల్ ఫోటోగ్రఫీ ఇప్పుడు మొబైల్‌లోనే సాధ్యం కానుంది. ఈ ఫోన్ 6,500 ఎంఏహెచ్ బ్యాటరీతో పాటు 90 వాట్ల ఫాస్ట్ ఛార్జింగ్ సౌకర్యాన్ని కలిగి ఉంది.
![]()
The Vivo X300 FE will also support Vivo's ZEISS Telephoto Extender Gen 2 accessory in India
Photo Credit: Vivo
ఇక ఈ సిరీస్‌లో కింగ్ లాంటి వివో ఎక్స్300 అల్ట్రా గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఇది ఎక్లిప్స్ బ్లాక్, విక్టరీ గ్రీన్ రంగుల్లో వస్తోంది. దీని డిజైన్ ఒక వింటేజ్ కెమెరాను తలపించేలా నర్లెడ్ టెక్స్చర్‌తో రూపొందించబడింది. ఇందులో 200 మెగాపిక్సెల్ సోనీ లైటియా 901 సెన్సార్‌తో కూడిన డాక్యుమెంటరీ కెమెరా ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. వైడ్ యాంగిల్ నుండి టెలిఫోటో వరకు ప్రతి షాట్ అద్భుతంగా వచ్చేలా జైస్ మాస్టర్ లెన్స్ సిస్టమ్‌ను ఇందులో అమర్చారు. గింబాల్ స్టెబిలైజేషన్ సాయంతో పరుగెడుతూ వీడియోలు తీసినా అవి షేక్ అవ్వకుండా చాలా స్మూత్‌గా వస్తాయి.
కంటెంట్ క్రియేటర్ల కోసం వివో అల్ట్రా మోడల్‌లో 4కే 120 ఎఫ్పిఎస్ వీడియో రికార్డింగ్ సదుపాయాన్ని ఇచ్చారు. డాల్బీ విజన్, 10 బిట్ లాగ్ వీడియో వంటి టెక్నాలజీలను ఉపయోగించడం వల్ల సినిమాటిక్ అవుట్‌పుట్ పొందడం సులభం అవుతుంది. స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 ప్రాసెసర్ ద్వారా గేమ్స్ ఆడినా లేదా హెవీ ఎడిటింగ్ చేసినా ఫోన్ వేడెక్కకుండా పెద్ద వేపర్ ఛాంబర్ కూలింగ్ సిస్టమ్‌ను సెట్ చేశారు. 6,600 ఎంఏహెచ్ బ్యాటరీ, 100 వాట్ల వైర్డ్ ఛార్జింగ్‌తో కేవలం నిమిషాల్లోనే ఫోన్ ఫుల్ ఛార్జ్ అయిపోతుంది. వైర్‌లెస్ ఛార్జింగ్ సదుపాయం కూడా ఉండటం దీని ప్రత్యేకత.
సాఫ్ట్‌వేర్ పరంగా వివో ఈసారి వినియోగదారులకు గట్టి హామీ ఇస్తోంది. ఎక్స్300 అల్ట్రా యూజర్లకు ఐదేళ్ల పాటు ఆపరేటింగ్ సిస్టమ్ అప్‌డేట్స్, ఏడేళ్ల పాటు సెక్యూరిటీ అప్‌డేట్స్ లభిస్తాయి. ఆరిజిన్ ఓఎస్ ద్వారా మెమరీ ఫ్యూజన్, క్రాస్ డివైజ్ షేరింగ్ వంటి స్మార్ట్ ఫీచర్లు అందుబాటులోకి వస్తాయి. ఒకవేళ మీరు మొబైల్‌ను పూర్తి స్థాయి కెమెరాగా మార్చుకోవాలనుకుంటే 'ఫోటోగ్రాఫర్ కిట్' కూడా విడిగా కొనుగోలు చేయవచ్చు. ఇందులో అదనపు బ్యాటరీతో కూడిన ఇమేజింగ్ గ్రిప్, స్ట్రాప్స్ వంటివి లభిస్తాయి. ఈ అల్టిమేట్ డివైజ్‌ల ధరలు, సేల్ ఆఫర్స్ కోసం మే 6 వరకు వేచి చూడాల్సిందే.
ప్రకటన
ప్రకటన
WhatsApp Launches Prepaid Mobile Recharges for Users in India: How to Recharge Your Mobile Number