Vivo Y400 కొత్త మోడల్‌లో మార్కెట్లోకి రానుంది. 8GB + 128GB Vivo Y400 5G ఫోన్ ధర రూ. 21,999 నుంచి ప్రారంభమవుతుంది. 8GB + 256GB వేరియంట్ ధర రూ. 23,999లు.
Photo Credit: Vivo
Vivo Y400 5G IP68+IP69 వాటర్ మరియు డస్ట్ రెసిస్టెన్స్ రేటింగ్‌లను కలుస్తుందని పేర్కొన్నారు
Vivo నుంచి అధునాతనమైన ఫీచర్లతో మరో స్మార్ట్ ఫోన్ ఆగస్ట్ 4న భారత్ మార్కెట్‌లోకి రిలీజ్ అయింది. వినియోగదారులు ఇదొక శుభవార్త అనే చెప్పాలి. ఎందుకంటే బడ్జెట్ ధరకే అనేక ఫీచర్లు, స్పెసిఫికేషన్లు ఉన్న ఈ ఫోన్‌ని కంపెనీ అందిస్తుంది. అంతేకాదు ఈ ఫోన్ రెండు వెరియంట్స్‌లో అందుబాటులోకి రానుంది. అలాగే ఈ మొబైల్ Qualcomm నుంచి Snapdragon 4 Gen 2 చిప్‌సెట్‌తో వస్తుంది. ఇది 90W వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇచ్చే 6,000mAh బ్యాటరీని కూడా కలిగి ఉంది. దుమ్ము, నీటి నుంచి రక్షణ కోసం హ్యాండ్‌సెట్ IP68 + IP69 సర్టిఫికేషన్లను కలిగి ఉందని Vivo వెల్లడించింది. ఈ ఫోన్‌లో ఆప్టిక్స్ అంటె లెన్స్ విషయానికొస్తే హ్యాండ్‌సెట్‌లో 50-మెగాపిక్సెల్ డ్యూయల్ రియర్ కెమెరా యూనిట్, 32-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉన్నాయి. ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌తో AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ ఫోన్ జూన్‌లో దేశంలో ఆవిష్కరించబడిన Vivo Y400 Pro 5Gతో చేరింది.
Vivo Y400 5G ఫోన్ రెండు వెరియంట్స్ మార్కెట్‌లో అందుబాటులో ఉండనున్నాయి. ర్యామ్, GBని బట్టి రెండు ఫోన్ల ధరలు వేర్వేరుగా నిర్ణయించడం జరిగింది. 8GB + 128GB Vivo Y400 5G ఫోన్ ధర రూ. 21,999 నుంచి ప్రారంభమవుతుంది. 8GB + 256GB వేరియంట్ ధర రూ. 23,999లు. రెండు కలర్స్‌లో ఈ ఫోన్ ఉండనుంది. గ్లామ్ వైట్, ఆలివ్ గ్రీన్ కలర్ ఆప్షన్లలో మార్కెట్‌లోకి వచ్చింది. ఈ స్మార్ట్ ఫోన్ సేల్స్ ఆగస్టు 7 నుంచి Vivo ఇండియా ఇ-స్టోర్, ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌తోపాటు ఎంపిక చేసిన ఆఫ్‌లైన్ రిటైల్ స్టోర్‌ల ద్వారా దేశంలో ప్రారంభమవుతాయి. అలాగే ముందుగా ఆర్డర్ చేసుకున్న కస్టమర్లకు మంచి ఆఫర్ కూడా కంపెనీ ప్రకటించింది. ముందస్తుగా బుక్ చేసుకున్న కస్టమర్లు SBI, DBS బ్యాంక్, IDFC ఫస్ట్ బ్యాంక్, YES బ్యాంక్, Bobcard, ఫెడరల్ బ్యాంక్ కార్డులను ఉపయోగించి 10 శాతం వరకు క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. అంతేకాదు Vivo సున్నా డౌన్ పేమెంట్‌తో 10 నెలల EMI ఆఫర్‌ను కూడా అందిస్తోంది.
Vivo Y400 5G చాలా స్పెసిఫికేషన్లతో పాటు అద్భుతమైన ఫీచర్లు ఉన్నాయి. ఈ ఫోన్ డ్యూయల్ సిమ్ (నానో+నానో) హ్యాండ్‌సెట్, ఇది ఆండ్రాయిడ్ 15-ఆధారిత Funtouch OS 15తో రన్ అవుతుంది. ఇది 6.67-అంగుళాల పూర్తి-HD+ (1,080×2,400 పిక్సెల్స్) AMOLED డిస్‌ప్లేతో అందుబాటులోకి వచ్చింది. 120Hz రిఫ్రెష్ రేట్, 1,800 నిట్స్ వరకు పీక్ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్ 8GB LPDDR4X RAM, 256GB వరకు UFS 3.1 ఆన్‌బోర్డ్ స్టోరేజ్‌తో జత చేయబడిన స్నాప్‌డ్రాగన్ 4 Gen 2 SoC ప్రాసెసర్‌తో వచ్చింది.
Vivo Y400 5Gలో డ్యూయల్ రియర్ కెమెరా యూనిట్ ఉంటుంది. వెనుక వైపు 50ఎంపీ + 2ఎంపీ రియర్ కెమెరా, ముందువైపు 32 ఎంపీ ఫ్రంట్ కెమెరా కలిగి ఉంది. దీనిలో పిల్-ఆకారపు రియర్ కెమెరా మాడ్యూల్ పొడువుగా అందించారు. సెకండరీ కెమెరా చిన్న స్క్విర్కిల్ స్లాట్‌లో ఇచ్చారు. దీనికి కెమెరా ఐలాండ్ కింద ఆరా లైట్ ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో వెనుక కెమెరా ఐలాండ్‌తో పాటు LED ఫ్లాష్ యూనిట్ అందించారు.
ఇక ఫోన్‌లో వెనుకవైపు 2 MP డెప్త్ సెన్సార్‌తోపాటు 50 మెగాఫిక్స్‌ల్ రియర్ కెమెరా, సెల్ఫీలు, వీడియోకాల్‌లు కోసం ముందు భాగంలో 32-మెగాపిక్సెల్ సెన్సార్‌తో కెమెరాలు ఉన్నాయి. Vivo Y400 5G 90W వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 6,000mAh బ్యాటరీతో అమర్చబడింది. ఇది బయోమెట్రిక్ ప్రామాణీకరణ కోసం ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌తో అమర్చబడింది. నీరు, దుమ్ము, ధూళీల నుంచి రక్షణగా ఉండేలా IP68+IP69 రేటింగ్స్‌ను కూడా పొంది ఉంది.
Vivo Y400లోని కనెక్టివిటీ ఆప్షన్లలో 5G, 4G, Wi-Fi, బ్లూటూత్, GPS, OTG, USB టైప్-C పోర్ట్ ఉన్నాయి. Vivo Y400 5G ఆలివ్ గ్రీన్ వేరియంట్ 162.29×75.31×7.90mm మెజర్మెంట్‌లలో, 197 గ్రాముల బరువుతో ఉంటుంది. Glam White వెర్షన్ ఫోన్ 7.99mm ప్రొఫైల్‌తో 198 గ్రాముల బరువు ఉంటుంది.
ప్రకటన
ప్రకటన