XiaomiTime వెల్లడించిన వివరాల ప్రకారం, లీక్ అయిన ఫోటోగ్రఫీ కిట్ చిత్రాల్లో నాలుగో కెమెరా కోసం ఏదైనా ప్రత్యేక స్థానం కనిపించలేదు. ఇది Xiaomi 15 Ultra లో ఉన్న క్వాడ్ కెమెరాల నుండి కంపెనీ పూర్తిగా మారి మూడు కెమెరాల కాన్ఫిగరేషన్‌కు వెళ్లినట్టు సూచిస్తోంది.
Xiaomi 15 Ultra (చిత్రంలో) ఈ సంవత్సరం ప్రారంభంలో Leica బ్రాండింగ్‌తో వచ్చింది
Xiaomi సంస్థ తన తదుపరి ఫ్లాగ్‌షిప్ మోడల్ Xiaomi 17 Ultra ను అభివృద్ధిలో దశలో ఉంచినట్లు తాజా సమాచారం. ఎప్పుడు మార్కెట్లోకి వస్తుందో ఇప్పటికీ స్పష్టత లేకపోయినా, ఇటీవల బయటకు వచ్చిన లీకులు ఈ ఫోన్ కెమెరా విభాగంపై ఆసక్తికరమైన వివరాలను వెల్లడించాయి. తాజా సమాచారం ప్రకారం, Xiaomi 17 Ultra లో త్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉండబోతోందని తెలుస్తోంది. ముఖ్యంగా 200MP టెలిఫోటో సెన్సార్ ఈ సెటప్‌లో ప్రధాన ఆకర్షణగా ఉండనుంది. XiaomiTime వెల్లడించిన వివరాల ప్రకారం, లీక్ అయిన ఫోటోగ్రఫీ కిట్ చిత్రాల్లో నాలుగో కెమెరా కోసం ఏదైనా ప్రత్యేక స్థానం కనిపించలేదు. ఇది Xiaomi 15 Ultra లో ఉన్న క్వాడ్ కెమెరాల నుండి కంపెనీ పూర్తిగా మారి మూడు కెమెరాల కాన్ఫిగరేషన్‌కు వెళ్లినట్టు సూచిస్తోంది. ఎక్కువ కెమెరాల కంటే, నిర్దిష్ట ఫోకల్ లెన్త్‌లు, పెద్ద సెన్సార్‌లు, వాటి ఆప్టిమైజేషన్‌పై Xiaomi ఈసారి దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.
అభివృద్ధి దశలో “Nezha” అనే కోడ్‌నేమ్‌తో పరీక్షించిన ఈ ఫోటోగ్రఫీ యూనిట్‌లో 50MP ప్రధాన కెమెరా, 200MP టెలిఫోటో కెమెరా, 50MP అల్ట్రా-వైడ్ కెమెరా ఉండనున్నాయని సమాచారం చెబుతోంది. సెల్ఫీలు మరియు వీడియో కాల్స్ కోసం కూడా Xiaomi 17 Ultra 50MP OV50M ఫ్రంట్ కెమెరాను అందించనున్నట్టు ఊహిస్తున్నారు.
200MP పెరిస్కోప్ టెలిఫోటో కెమెరా గురించి ఇంతకుముందు వచ్చిన లీక్‌లను కూడా ఈ వివరాలు మరింత బలపరుస్తున్నాయి. 4x4 RMSC సపోర్ట్‌తో మల్టి-ఫోకల్-లెన్త్ లాస్‌లెస్ జూమ్, టెలిఫోటో మాక్రో వంటి సౌకర్యాలు ఈ ఫోన్‌లో దొరకొచ్చని తెలుస్తోంది. మెరుగైన మ్యాగ్నిఫికేషన్, విస్తృత ఫోకస్ రేంజ్, మంచి డైనమిక్ రేంజ్ వంటి అంశాలు కూడా ఇందులో ఉండొచ్చని అంచనా.
ఇంతకుముందు వచ్చిన మరో రిపోర్ట్ ఈ ఫోన్‌లో నాలుగు కెమెరాలు ఉండొచ్చని పేర్కొంది. అయితే తాజా లీక్ ఆ సమాచారాన్ని పూర్తిగా తిరస్కరించింది.
Xiaomi 17 Ultra ను 2026 లో విడుదల చేసే అవకాశముందని, ఇప్పటికే ఉన్న Xiaomi 17 సిరీస్, Xiaomi 17, Xiaomi 17 Pro, Xiaomi 17 Pro Max మోడళ్లకు ఇది కొత్త సభ్యుడిగా చేరవచ్చని భావిస్తున్నారు. అయితే ఈ ఫోన్ అధికారికంగా లాంచ్ అయితే దీని గురింది పూర్తి సమాచారం బయటకు వస్తుంది.
ప్రకటన
ప్రకటన
Cyberpunk 2077 Sells 35 Million Copies, CD Project Red Shares Update on Cyberpunk 2 Development
Honor Magic 8 Pro Launched Globally With Snapdragon 8 Elite Gen 5, 7,100mAh Battery: Price, Specifications