షియోమీ కంపెనీ చెప్పినట్టుగానే భారత్ మరియు ప్రపంచ మార్కెట్లలో ఫ్లాగ్‌షిప్ షియోమీ 17 సిరీస్‌ను విడుదల చేసిన తరువాత షియోమీ 17T మరియు షియోమీ 17T ప్రో అనే రెండు హ్యాండ్‌సెట్‌లు విడుదల చేయనున్నాయి
The Xiaomi 17 (pictured) was launched in India in March
షియోమీ కంపెనీ చెప్పినట్టుగానే భారత్ మరియు ప్రపంచ మార్కెట్లలో ఫ్లాగ్‌షిప్ షియోమీ 17 సిరీస్‌ను విడుదల చేసిన తరువాత, షియోమీ తన స్మార్ట్‌ఫోన్ లైనప్‌ను కొత్త సబ్-ఫ్లాగ్‌షిప్ మోడళ్లతో విస్తరించడానికి సిద్దమవుతుంది. ముందుగా భావించినట్టుగానే.. రానున్న కామ్లో రెండు షియోమీ 17T మరియు షియోమీ 17T ప్రో అనే రెండు హ్యాండ్‌సెట్‌లు ఉండనున్నాయి. అఫీషియల్ గా షియోమీ వీటి గురించి తెలుపనప్పటికీ.. దీని ఫస్ట్ మోడల్ ఇపుడు ఒక బెంచ్‌మార్కింగ్ సైట్‌లో ప్రత్యక్షమైంది. ఈ వివరాలు ఆ ఫోన్ యొక్క చిప్‌సెట్, ర్యామ్ మరియు సాఫ్ట్‌వేర్ వివరాలను సూచిస్తుంది.
Xiaomi 17T Geekbench లిస్టింగ్ ముఖ్యమైన స్పెసిఫికేషన్స్
2602DPT53G మోడల్ నంబర్ కలిగిన Xiaomi స్మార్ట్‌ఫోన్ Geekbench AI డేటాబేస్‌లో కనిపించింది. (టిప్‌స్టర్ అభిషేక్ యాదవ్). ఇప్పటి వరకు వెల్లడించిమన్ వివరాల ఆధారంగా చూస్తే ఈ ఈ మోడల్ నంబర్ Xiaomi 17Tకి సంబంధించినదిగా గుర్తించబడింది.
వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈ హ్యాండ్‌సెట్ MediaTek చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. ఇందులో 3.40GHz వేగంతో పనిచేసే ఒక 'ప్రైమ్ కోర్' మరియు 3.20GHz వేగంతో పనిచేసే మూడు 'పెర్ఫార్మెన్స్ కోర్లు' తో పాటు 2.20GHz వేగంతో పనిచేసే నాలుగు 'ఎఫిషియెన్సీ కోర్లు' ఉన్నాయని సమాచారం. ఇక గ్రాఫిక్స్ విషయానికి వస్తే, Xiaomi 17Tగా భావిస్తున్న ఈ మోడల్‌లో Mali-G720 MC8 GPU పొందుపరచబడింది.
the Xiaomi 17T.
Xiaomi 17T series is launching early globally this year.
— Abhishek Yadav (@yabhishekhd) April 26, 2026
The Xiaomi 17 (2602DPT53G) global variant will feature MediaTek's Dimensity 8500 chipset.
Specifications:
⬛ Dimensity 8500 SoC
• 1 core @ 3.40 GHz
• 3 cores @ 3.20 GHz
• 4 cores @ 2.20 GHz
🎮 Mali-G720 MC8 GPU
•… pic.twitter.com/NzlpNJpJjx
స్పెషిఫికేషన్స్ మరియు మార్కెట్లో అందుబాటులో ఉన్న చిప్‌సెట్‌లతో పోల్చి చూస్తే, ఇది MediaTek Dimensity 8500 SoC అని తెలుస్తోంది. అంతేకాకుండా, ఈ చిప్‌సెట్ Oppo K15 Pro, iQOO Z11 5G మరియు Motorola Edge 70 Pro వంటి హ్యాండ్‌సెట్‌లకు కూడా శక్తినిస్తుంది. దీనిని పనితీరుపై ప్రధానంగా దృష్టి సారించే ఒక 'sub-flagship' స్మార్ట్‌ఫోన్‌గా మార్కెట్ చేసే అవకాశం ఉంది.
ఈ ఫోన్ లో 11.09GB RAM ఉండగా దానిని మార్కెట్లో 12GBగా ప్రచారం చేసే అవకాశం ఉంది. Xiaomi 17T స్మార్ట్‌ఫోన్ Android 16 ఆపరేటింగ్ సిస్టమ్‌పై నడుస్తున్నట్లు సమాచారం. దీనిపైన Xiaomi యొక్క HyperOS 3 స్కిన్ ఉండే అవకాశం ఉంది. లిస్టింగ్ లో తెలిపిన వివరాల ప్రకారం.. టెస్టుల్లో ఈ హ్యాండ్‌సెట్ Geekbench AI 1.7.0 (Android AArch64 CPU) , 'single precision' మరియు 'half precision' విభాగాలలో 777, 858 పాయింట్లను సాధించింది.
వీటిలో మొదటిది (single precision) ఆ ఫోన్ యొక్క AI గణన సామర్థ్యాన్ని (computational power) సూచించగా.. రెండవది (half precision) ఇతరేతర AI పనులను (workloads) నిర్వహించగల దాని సామర్థ్యాన్ని తెలియజేస్తుంది. మొత్తం AI ప్రాసెసింగ్ సామర్థ్యాన్ని కొలిచే 'quantised test'లో కూడా ఈ హ్యాండ్‌సెట్ 1,160 పాయింట్లు చేసింది.
Xiaomi 17T సిరీస్ ఇప్పటికే IMDA మరియు NBTC డేటాబేస్‌లతో సహా పలు ధృవీకరణ వేదికలపై కనిపించింది. దీనిని బట్టి ఈ సిరీస్ విడుదల అతి త్వరలో జరగవచ్చని అర్థం అవుతుంది. Xiaomi 17T మరియు Xiaomi 17T Pro - ఈ రెండు మోడళ్లు ప్రస్తుతం డెవలపింగ్ దశలో ఉన్నాయని, వీటిలో 'Pro' వేరియంట్ హై ఎండ్ స్పెసిఫికేషన్లను కలిగి ఉంటుందని నివేదికలు సూచిస్తున్నాయి. గతంలో లీకైన సమాచారం మేరకు భారత్ లో Xiaomi 17T సిరీస్ ఏప్రిల్ నెలాఖరులో లేదా మే నెల ఆరంభంలో విడుదల అవ్వొచ్చని అంచనా వేస్తున్నారు.
ప్రకటన
ప్రకటన
Sony Xperia 1 VIII Launch Date Seemingly Confirmed as Sony Teases Launch of New Xperia 1 Series Phone