మోడల్ నంబర్ తప్ప, ఈ ఫోన్ గురించి ప్రస్తుతం అంతగా సమాచారం లేడు. అయితే 2026లో ఈ ట్రై-ఫోల్డ్ ఫోన్ మార్కెట్లోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Photo Credit: Samsung
Samsung Galaxy Z TriFold ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌తో అమర్చబడింది
షియోమీ తన మొదటి ట్రై-ఫోల్డ్ స్మార్ట్‌ఫోన్‌పై పని చేస్తోందన్న సమాచారం బయటకు వచ్చింది. ఈ ఫోన్ “Xiaomi Mix Trifold” అనే పేరుతో మార్కెట్‌లోకి రావచ్చని చెబుతున్నారు. తాజాగా ఈ డివైస్ ఒక సర్టిఫికేషన్ వెబ్‌సైట్‌లో కనిపించడంతో, ఈ రూమర్లు మరింత బలపడ్డాయి. మల్టీ-ఫోల్డింగ్ ఫోన్‌ల విభాగంలో ఇది షియోమీ యొక్క తొలి ప్రయోగంగా భావిస్తున్నారు. వచ్చే వారంలో దక్షిణ కొరియాలో అమ్మకాలకు వచ్చే Samsung Galaxy Z TriFold, అలాగే Huawei Mate XT Ultimate Design వంటి మోడళ్లకు ఇది ప్రత్యక్ష పోటీదారుగా ఉండే అవకాశముంది. మోడల్ నంబర్ తప్ప, ఈ ఫోన్ గురించి ప్రస్తుతం అంతగా సమాచారం లేడు. అయితే 2026లో ఈ ట్రై-ఫోల్డ్ ఫోన్ మార్కెట్లోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
GSMA సర్టిఫికేషన్ ప్లాట్‌ఫారమ్‌లో 2608BPX34C అనే మోడల్ నంబర్‌తో కనిపించిన ఈ కొత్త షియోమీ డివైస్ గురించి XiaomiTime ఇచ్చిన రిపోర్ట్ కొంత ఆసక్తిని రేకెత్తించింది. ఇదే రాబోయే Xiaomi Mix Trifold అని ఆ ప్రచురణ పేర్కొంటోంది. కంపెనీ Q3 2026లో ఈ ఫోన్‌ను అధికారికంగా ప్రకటించవచ్చని చెబుతున్నారు. అయితే డివైస్ యొక్క స్పెసిఫికేషన్లు, ఫీచర్లు, ధర, ఖచ్చితమైన విడుదల తేదీ వంటి విషయాలను షియోమీ ఇప్పటివరకు ఎక్కడా ధృవీకరించలేదు.
ఇంతలో, కొద్ది రోజుల ముందే దక్షిణ కొరియా దిగ్గజం సామ్‌సంగ్ తన మొదటి ట్రై-ఫోల్డింగ్ ఫోన్ ‘Galaxy Z TriFold' ను డిసెంబర్ 2న ప్రకటించింది. 2024 సెప్టెంబర్‌లో ప్రారంభమైన Huawei Mate XT Ultimate Design కూడా ఈ కేటగిరీలో మరో కీలక మోడల్. వీటి సరసన నిలవడానికి షియోమీ ఇప్పుడు మల్టీ-ఫోల్డ్ డిజైన్‌లో అడుగుపెడుతుందనేది ప్రధాన చర్చగా మారింది.
Samsung Galaxy Z TriFold గురించి మాట్లాడితే, ఇది Android ఆధారిత OneUI 8తో పనిచేస్తుంది. లోపల 10 అంగుళాల QXGA+ రిజల్యూషన్‌తో Dynamic AMOLED 2X డిస్‌ప్లే, బయట 6.5 అంగుళాల Full-HD+ Dynamic AMOLED 2X స్క్రీన్ అందించబడింది. రెండు డిస్‌ప్లేలు కూడా 120Hz రిఫ్రెష్ రేట్‌ను సపోర్ట్ చేస్తాయి. స్నాప్‌డ్రాగన్ 8 Elite ప్రాసెసర్, 16GB RAM, 1TB వరకు స్టోరేజ్, 5,600mAh బ్యాటరీ, 45W వైర్డ్ మరియు 15W వైర్లెస్ ఛార్జింగ్ వంటి శక్తివంతమైన ఫీచర్లు ఈ ఫోన్‌లో ఉన్నాయి.
ఇతర వైపు, Huawei Mate XT Ultimate Design మాత్రం 10.2 అంగుళాల ఫ్లెక్సిబుల్ LTPO OLED ఇంటర్ డిస్‌ప్లే, 6.4 అంగుళాల OLED కవర్ స్క్రీన్‌ను కలిగి ఉంది. లోపలి డిస్‌ప్లే 3,184×2,232 రిజల్యూషన్‌ను అందిస్తుంది. హార్మనీOS 4పై నడిచే ఈ ఫోన్ Huawei Kirin 9010 చిప్‌సెట్‌తో వస్తుంది. 16GB RAM, 1TB వరకు స్టోరేజ్, 5,600mAh బ్యాటరీ వంటి ప్రధాన ఫీచర్లు ఇందులో అందుబాటులో ఉన్నాయి. వైర్డ్ ఛార్జింగ్‌కు 66W, వైర్లెస్ ఛార్జింగ్‌కు 50W మద్దతు కూడా ఉంది.
షియోమీ నుండి రాబోయే Mix Trifold కూడా ఇదే స్థాయి పోటీని ఇవ్వగలదా? పక్కా వివరాలు ఇంకా తెలియకపోయినా, ప్రస్తుతం బయటికొచ్చిన సమాచారం మాత్రం ఈ ఫోన్‌పై ఆసక్తిని పెంచుతోంది. 2026 మధ్యలో ఇది అధికారికంగా రానుందన్న ఊహలు టెక్ వర్గాల్లో మరింత చర్చనీయాంశంగా మారుతున్నాయి.
ప్రకటన
ప్రకటన
CERT-In Warns Chrome, Edge Users of ‘High’ Risk Vulnerabilities on Windows, macOS, and Linux