ఈ టాబ్లెట్ లావెండర్ డ్రిఫ్ట్ మరియు షాడో బ్లాక్ రంగుల్లో లభిస్తుంది.

డిసెంబర్ 18 నుంచి Amazon, OnePlus India అధికారిక వెబ్‌సైట్‌తో పాటు ఇతర రిటైల్ స్టోర్లలో ఇది అమ్మకాలకు అందుబాటులోకి వస్తుంది.

ఈ టాబ్లెట్ లావెండర్ డ్రిఫ్ట్ మరియు షాడో బ్లాక్ రంగుల్లో లభిస్తుంది.

OnePlus Pad Go 2 లావెండర్ డ్రిఫ్ట్ మరియు షాడో బ్లాక్ కలర్ ఆప్షన్లలో ప్రారంభించబడింది.

ముఖ్యాంశాలు
  • 12.1 అంగుళాల 120Hz డిస్‌ప్లే, రెండు రంగుల లభ్యత
  • Dimensity 7300-Ultra ప్రాసెసర్
  • 10,050mAh బ్యాటరీ, 33W ఛార్జింగ్ సపోర్ట్
ప్రకటన

OnePlus తన కొత్త ఆండ్రాయిడ్ టాబ్లెట్ OnePlus Pad Go 2ను బుధవారం భారత మార్కెట్‌లో అధికారికంగా విడుదల చేసింది. ఈ టాబ్లెట్‌ను OnePlus 15R స్మార్ట్‌ఫోన్‌తో పాటు అనౌన్స్ చేశారు. ఇందులో MediaTek Dimensity 7300-Ultra చిప్‌సెట్‌ను ఉపయోగించగా, 5G సపోర్ట్‌తో పాటు పెద్ద బ్యాటరీ కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. భారతదేశంలో OnePlus Pad Go 2 ప్రారంభ ధర రూ. 26,999గా నిర్ణయించారు. ఈ ధరకు 8GB RAM, 128GB స్టోరేజ్‌తో కూడిన Wi-Fi వేరియంట్ లభిస్తుంది. అదే RAMతో 256GB స్టోరేజ్ కలిగిన మరో Wi-Fi మోడల్ ధర రూ. 29,999. 5G కనెక్టివిటీ కావాలనుకునే వినియోగదారుల కోసం 8GB RAM + 256GB స్టోరేజ్ కలిగిన మోడల్‌ను రూ. 32,999 ధరకు తీసుకొచ్చారు.

ఈ టాబ్లెట్ లావెండర్ డ్రిఫ్ట్ మరియు షాడో బ్లాక్ రంగుల్లో లభిస్తుంది. అయితే షాడో బ్లాక్ రంగు 5G వేరియంట్‌కే పరిమితం. డిసెంబర్ 18 నుంచి Amazon, OnePlus India అధికారిక వెబ్‌సైట్‌తో పాటు ఇతర రిటైల్ స్టోర్లలో ఇది అమ్మకాలకు అందుబాటులోకి వస్తుంది. ప్రారంభ ఆఫర్‌గా బ్యాంక్ కార్డులపై రూ. 2,000 ఇన్‌స్టంట్ డిస్కౌంట్, అదనంగా రూ. 1,000 పరిమితకాల రాయితీ ఇవ్వనున్నారు. దీంతో ప్రారంభ ధర రూ. 23,999కి తగ్గుతుంది.

OnePlus Pad Go 2లో OxygenOS 16 ఆపరేటింగ్ సిస్టమ్‌ను అందించారు, ఇది తాజా Android 16 ఆధారంగా పనిచేస్తుంది. ఇందులో 12.1 అంగుళాల 2.8K LCD డిస్‌ప్లే ఉండగా, 120Hz వరకు అడాప్టివ్ రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది. Dolby Vision సపోర్ట్‌తో పాటు 600 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, 98% DCI-P3 కలర్ గ్యామట్ ఉండడం వల్ల వీడియోలు, గేమింగ్, కంటెంట్ వీక్షణలో అద్భుతమైన అనుభూతిని ఇస్తుంది.

టాబ్లెట్‌కు శక్తినిచ్చేది 4nm టెక్నాలజీపై తయారైన MediaTek Dimensity 7300-Ultra ప్రాసెసర్. దీనికి 8GB LPDDR5x RAM, 256GB వరకు UFS 3.1 స్టోరేజ్ జత చేశారు. మల్టీటాస్కింగ్‌ను సులభతరం చేసే Open Canvas ఫీచర్‌తో పాటు, AI Writer, AI Recorder, AI Reflection Eraser వంటి స్మార్ట్ ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ఆడియో అనుభూతి కోసం నాలుగు స్పీకర్లను అందించారు.
ఫోటోగ్రఫీ విషయానికి వస్తే, వెనుక భాగంలో 8 మెగాపిక్సెల్ కెమెరా, ముందు భాగంలో వీడియో కాల్స్, సెల్ఫీల కోసం మరో 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. కనెక్టివిటీ పరంగా Wi-Fi 6, Bluetooth 5.4, USB Type-C పోర్ట్ అందించారు. భద్రత కోసం ఫేస్ అన్‌లాక్ ఫీచర్‌ను కూడా అందించడం జరిగింది.

ఈ టాబ్లెట్‌లో ఉన్న 10,050mAh భారీ బ్యాటరీ ప్రధాన ఆకర్షణ. ఇది 33W SuperVOOC ఫాస్ట్ చార్జింగ్ను సపోర్ట్ చేస్తుంది. పూర్తిగా ఛార్జ్ కావడానికి సుమారు 129 నిమిషాలు పడుతుందని కంపెనీ చెబుతోంది. ఒక్కసారి పూర్తి ఛార్జ్ చేస్తే సుమారు 15 గంటల వీడియో ప్లేబ్యాక్ లేదా 60 గంటల స్టాండ్బై టైమ్ ఇస్తుందని పేర్కొంది. అదనంగా 6.5W రివర్స్ వైర్డ్ చార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది.

5G వేరియంట్ బరువు సుమారు 599 గ్రాములు, Wi-Fi వేరియంట్ బరువు 597 గ్రాములు. టాబ్లెట్ మందం కేవలం 6.83mm మాత్రమే ఉండటం వల్ల స్లిమ్, ప్రీమియం లుక్ ఇస్తుంది. కొత్తగా విడుదలైన OnePlus Pad Go 2 Stylo స్టైలస్‌కు కూడా ఇది సపోర్ట్ చేస్తుంది. ఈ స్టైలస్ 4,096 లెవెల్స్ ప్రెషర్ సెన్సిటివిటీతో పాటు Bluetooth 5.4 కనెక్టివిటీ కలిగి ఉండగా, వేరుగా కొనుగోలు చేయాల్సి ఉంటుంది.

ప్రకటన

ప్రకటన

#తాజా కథనాలు
  1. యాపిల్ యాప్ స్టోర్‌లో ఇకపై ఎక్కువ యాడ్స్.. కారణం ఇదేనా?
  2. రియల్ మీ 16 ప్రో ప్లస్ ఫీచర్స్ లీక్.. ప్రత్యేకతలివే
  3. Amazon Pay యాప్‌లో ఇకపై ఫింగర్‌ప్రింట్ లేదా ఫేస్ రికగ్నిషన్ ద్వారా UPI ట్రాన్సాక్షన్‌లను పూర్తి చేయవచ్చు.
  4. ఈ టాబ్లెట్ లావెండర్ డ్రిఫ్ట్ మరియు షాడో బ్లాక్ రంగుల్లో లభిస్తుంది.
  5. కెమెరా విభాగంలో OnePlus 15R గణనీయమైన అప్‌గ్రేడ్‌ను అందించింది.
  6. కొత్త ఏడాదిలో సామ్ సంగ్ నుంచి అద్భుతమైన ఫీచర్స్‌తో రానున్న టీవీలు.. ప్రత్యేకతలు ఇవే
  7. మార్కెట్లోకి హానర్ విన్, విన్ ఆర్‌టి మోడల్స్.. కీ ఫీచర్స్ గురించి తెలుసా?
  8. సాఫ్ట్‌వేర్ పరంగా, Realme 16 Pro+ Android 16 ఆధారిత Realme UI 7తో రన్ అవుతుంది.
  9. Moto G Power (2026) అమెరికాలో $299.99 ధరతో విడుదలైంది.
  10. సాఫ్ట్‌వేర్ పరంగా, Realme 16 Pro+ Android 16 ఆధారిత Realme UI 7తో రన్ అవుతుంది.
© Copyright Red Pixels Ventures Limited 2025. All rights reserved.
Trending Products »
Latest Tech News »