Oppo Pad Air 5లో 2.8K రిజల్యూషన్ డిస్ప్లే, ColorOS ఆధారిత సాఫ్ట్‌వేర్, అలాగే భారీ 10,050mAh బ్యాటరీ ఉండటం ఖరారరైంది. ఈ స్పెసిఫికేషన్స్ ఇప్పటికే ట్యాబ్లెట్ ప్రేమికుల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. డిజైన్ పరంగా ఈ ట్యాబ్లెట్ స్లిమ్ లుక్ తో పాటు ప్రీమియమ్ ఫినిష్‌ను కలిగి ఉండనుంది.
ఒప్పో ప్యాడ్ ఎయిర్ 5 అనే కొత్త టాబ్లెట్‌ను విడుదల చేయనున్నట్లు ఒప్పో ధృవీకరించింది.
స్మార్ట్ డివైసుల మార్కెట్‌లో తన ఉనికిని మరింత బలోపేతం చేసేందుకు Oppo మరో కొత్త ట్యాబ్లెట్‌ను పరిచయం చేయడానికి సిద్ధమైంది. Oppo Pad Air 5 పేరుతో ఈ ట్యాబ్లెట్‌ను డిసెంబర్ 25న చైనాలో అధికారికంగా విడుదల చేయనున్నట్లు కంపెనీ ఇప్పటికే ధృవికరించింది. లాంచ్‌కు ముందే Oppo అధికారిక స్టోర్‌లో ప్రీ-ఆర్డర్ పేజీ ప్రారంభం కావడంతో, ఈ డివైస్ డిజైన్, ముఖ్యమైన స్పెసిఫికేషన్స్, అలాగే వేరియంట్లకు సంబంధించిన వివరాలు వెలుగులోకి వచ్చాయి. Oppo Pad Air 5లో 2.8K రిజల్యూషన్ డిస్ప్లే, ColorOS ఆధారిత సాఫ్ట్‌వేర్, అలాగే భారీ 10,050mAh బ్యాటరీ ఉండటం ఖరారైంది. ఈ స్పెసిఫికేషన్స్ ఇప్పటికే ట్యాబ్లెట్ ప్రేమికుల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. డిజైన్ పరంగా ఈ ట్యాబ్లెట్ స్లిమ్ లుక్ తో పాటు ప్రీమియమ్ ఫినిష్‌ను కలిగి ఉండనుంది.
ఈ ట్యాబ్లెట్ Wi-Fi మాత్రమే పనిచేసే వెర్షన్, అలాగే Wi-Fi + 5G వెర్షన్ల్లో అందుబాటులోకి రానుంది. కలర్ ఆప్షన్ల విషయానికి వస్తే, స్పేస్ గ్రే, స్టార్లైట్ పౌడర్, స్టార్లైట్ పింక్ రంగుల్లో విక్రయించనున్నారు.
Wi-Fi వేరియంట్‌లో 8GB RAM + 128GB స్టోరేజ్, 8GB + 256GB, అలాగే 12GB + 256GB అనే మూడు కాన్ఫిగరేషన్లు అందుబాటులో ఉంటాయి. ఇక 5G వేరియంట్ మాత్రం స్పేస్ గ్రే కలర్‌లో మాత్రమే, అది కూడా 8GB RAM + 128GB స్టోరేజ్ ఎంపికలోనే లభించనుంది.
బయటకు వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, Oppo Pad Air 5 అనేది ఇప్పటికే ఇతర మార్కెట్లలో విడుదలైన OnePlus Pad Go 2కి రీబ్రాండెడ్ వెర్షన్‌గా ఉండే అవకాశాలు కనిపిస్తూన్నాయి. ఇదే తరహాలో గతంలో విడుదలైన Oppo Pad Air 2 కూడా OnePlus Pad Go ఆధారంగానే రూపొందించబడింది.
ఈ నేపథ్యంలో Oppo Pad Air 5లో 12.1 అంగుళాల LCD డిస్ప్లే, 2.8K రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్, MediaTek Dimensity 7300-Ultra ప్రాసెసర్, LPDDR4x RAM, UFS 3.1 స్టోరేజ్, అలాగే 33W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉన్న 10,050mAh బ్యాటరీ ఉండే అవకాశం ఉంది.
ఫోటోగ్రఫీ పరంగా ముందు, వెనుక భాగాల్లో ఒక్కోటి చొప్పున 8 మెగాపిక్సెల్ కెమెరాలు ఇవ్వవచ్చు. ఆడియో అనుభూతిని మెరుగుపరిచేందుకు క్వాడ్ స్పీకర్ సెటప్ ఉండే అవకాశం ఉంది. భద్రత కోసం ఫేస్ అన్‌లాక్ సపోర్ట్ కూడా ఇందులో భాగంగా ఉండవచ్చని అంచనా.మొత్తానికి, Oppo Pad Air 5 అనేది గత మోడల్‌కు కొనసాగింపుగా, పెద్ద డిస్ప్లే, శక్తివంతమైన బ్యాటరీ, మరియు ఆధునిక ఫీచర్లతో ట్యాబ్లెట్ సెగ్మెంట్‌లో మంచి ఎంపికగా నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. అధికారిక లాంచ్ తర్వాత ధరలు మరియు పూర్తి స్పెసిఫికేషన్స్‌పై మరింత స్పష్టత రానుంది.
ప్రకటన
ప్రకటన