ఇప్పటికే దేశీయ మార్కెట్‌లో iQOO Z9 సిరీస్ మంచి పాపులారిటీ సంపాదించిన విషయం తెలిసిందే. తాజాగా మన దేశంలో iQoo Z9s సిరీస్‌ను ఆగస్టులో లాంచ్ చేయనుంది. అయితే, కంపెనీ ఇంకా లాంచ్ తేదీని అధికారికంగా ప్రకటించలేదు. అయితే, ఈ సిరీస్‌లో భాగంగా రెండు 5జీ స్మార్ట్‌ఫోన్‌లను భారతీయ మార్కెట్‌లో లాంచ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికైతే ఈ సిరీస్‌కి సంబంధించిన మరిన్ని వివరాలు మరికొన్ని రోజుల్లో కంపెనీ వెల్లడించనుందని సమాచారం. ప్రస్తుతానికి iQOO Z9s పేరుతో ఈ స్మార్ట్‌ఫోన్ తక్కువ బడ్జెట్‌లో సామాన్యులకు అందుబాటు ధరలో రానున్నట్లు తెలుస్తోంది. ఇది ఇప్పటికే చైనాలో విక్రయించబడుతున్న iQoo Z9 యొక్క అప్‌డేటెడ్ వెర్షన్ అని భావిస్తున్నారు.
ఆకర్షణీయమైన ఫినిషింగ్
కొత్తగా iQoo Z9s సిరీస్ హ్యాండ్‌సెట్‌లలో ఒకదాని డిజైన్‌ను iQoo ఇండియా CEO నిపున్ మరియా X(ట్విట్టర్)లో పోస్ట్ చేశారు. అయితే, ఈ సీనియర్ ఎగ్జిక్యూటివ్ చేసిన పోస్టులో ఫోన్ మెకానిజమ్, రిలీజ్‌కు సంబంధించిన ఎలాంటి సమాచారాన్ని అందించలేదు. ఈ స్మార్ట్ ఫోన్ వెనుక ప్యానెల్‌పై పాలరాయి రంగులో ఎంతో ఆకర్షణీయమైన ఫినిషింగ్ కనిపిస్తోంది. iQoo Z9s ఫోన్ కెమెరా మాడ్యూల్ దీర్ఘచతురస్రాకారంలో ఉండి, మెరిసే సిల్వర్ కలర్ అంచులతో చుట్టబడి ఉంది. అలాగే, హ్యాండ్‌సెట్ కుడివైపున వాల్యూమ్ అప్ అండ్ డౌన్‌తోపాటు పవర్ బటన్‌లు కనిపిస్తున్నాయి.బేస్ మోడల్‌గా అంచనా
అలాగే, MySmartPrice నివేదిక ఆధారంగా.. Geekbenchలో గుర్తించబడిన Vivo I2035 మోడల్ నంబర్ హ్యాండ్ సెట్‌తో ఈ iQoo Z9s సిరీస్ హ్యాండ్‌సెట్ సరిపొల్చవచ్చని భావిస్తున్నారు. ఇది బేస్ మోడల్‌గా అంచనా వేస్తున్నారు. పరీక్షలలో వచ్చిన ఫలితాలను బట్టీ ఫోన్ వరుసగా 1,137 మరియు 3,044 పాయింట్లతో సింగిల్ మరియు మల్టీ-కోర్‌గా చెప్పొచ్చు. అలాగే, నివేదిక ప్రకారం సింగిల్, మల్టీ-కోర్ స్కోర్‌లను పరిశీలిస్తే ఈ హ్యాండ్‌సెట్‌లో స్నాప్‌డ్రాగన్ 7 Gen 3 SoCతో అడ్రినో 720 GPU జత చేసినట్లు స్పష్టమవుతోంది. శక్తివంతమైన 6,000mAh బ్యాటరీ
ఈ iQoo Z9s బేస్ మోడల్ iQoo Z9 యొక్క చైనీస్ వేరియంట్ అప్‌డేటెడ్ వెర్షన్ కావచ్చని నివేదిక ఆధారంగా భావిస్తున్నారు. అయితే, ఇదే పేరులో మార్చి నెలలో మన దేశంలో లాంచ్ అయిన మోడల్‌కు ఇది భిన్నంగా ఉండనుంది. ఇక చైనాలో iQoo Z9 స్నాప్‌డ్రాగన్ 7 Gen 3 SoC పొందుపరిచారు. అలాగే. 80W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. శక్తివంతమైన 6,000mAh బ్యాటరీని కలిగి ఉంది. ఇది 6.78-అంగుళాల ఫుల్లీ HD+ AMOLED డిస్‌ప్లేతోపాటు 50-మెగాపిక్సెల్ Sony LYT-600 ప్రధాన సెన్సార్, అలాగే 16-మెగాపిక్సెల్ సెల్ఫీ షూటర్‌లో ఆకర్షణీయంగా ఉంటుంది. iQOO Z9 Lite 5Gలోనూ అధిరే ఫీచర్స్
అలాగే, మన దేశంలో విడుదలైన iQOO Z9 Lite 5G ఫోన్ మంచి పాపులారిటీ సంపాదించింది. ఇది 4 GB, 6 GB RAM మోడల్స్‌లో ధర వరుసగా రూ. 10,499, రూ. 11,499 ఉన్నాయి. ఈ రెండు వేరియంట్లూ 128 GB స్టోరేజ్‌తో రూపొందించబడ్డాయి. 6.56 అంగుళాల అల్ట్రా బ్రైట్ డిస్‌ప్లే ఈ స్క్రీన్ 90Hz రిఫ్రెష్ రేట్, 840nits వెలుగును సపోర్ట్ చేస్తోంది. 2.4 GHz క్లాక్ స్పీడ్‌తో MediaTek Dimension 6300 octa-core ప్రాసెసర్‌పై పనిచేసే Android 14 ఆధారిత Funtouch OS 14లో లాంచ్ చేయబడింది. 6 GB పొడిగించిన RAMకి మద్దతిస్తూ ఫిజికల్ ర్యామ్‌కు వర్చువల్ ర్యామ్‌ను జత చేసుకోవచ్చు. తద్వారా 12 జిబితో ర్యామ్ మరింత శక్తివంతగా మారుతుంది. అలాగే, ఒక టీబీ మెమరీ కార్డ్‌ని ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేసుకునే వెసులుబాటు ఉంటుంది. ఇక ఫోటోగ్రఫీ కోసం డ్యూయల్ రియర్ కెమెరా, 5,000 mAh బ్యాటరీని అందించారు.