శామ్‌సంగ్ గెలాక్సీ S26 అల్ట్రా, ఐఫోన్ 17 ప్రో మోడల్స్ మధ్య గట్టి పోటీ నెలకొంది. శామ్‌సంగ్ తన 200 మెగాపిక్సెల్ సెన్సార్‌తో అదరగొట్టాలని చూసినప్పటికీ, డీఎక్సోమార్క్ కేటాయించిన కెమెరా రేటింగ్స్‌లో ఐఫోన్ 17 ప్రో స్పష్టమైన ఆధిక్యాన్ని కనబరిచింది.
ప్రస్తుత స్మార్ట్‌ఫోన్ ప్రపంచంలో యాపిల్, శామ్‌సంగ్ మధ్య జరిగే పోరు పక్కా 'క్లాస్ వర్సెస్ మాస్' అన్నట్టుగా ఉంటుంది. ప్రతి ఏటా ఈ రెండు దిగ్గజాలు తమ బెస్ట్ వెర్షన్లను మార్కెట్లోకి వదులుతూ టెక్ ప్రియులను ఊరిస్తుంటాయి. ఈ ఏడాది కూడా సీన్ రిపీట్ అవుతూ, శామ్‌సంగ్ గెలాక్సీ S26 అల్ట్రా, ఐఫోన్ 17 ప్రో మోడల్స్ మధ్య గట్టి పోటీ నెలకొంది. శామ్‌సంగ్ తన 200 మెగాపిక్సెల్ సెన్సార్‌తో అదరగొట్టాలని చూసినప్పటికీ, డీఎక్సోమార్క్ కేటాయించిన కెమెరా రేటింగ్స్‌లో ఐఫోన్ 17 ప్రో స్పష్టమైన ఆధిక్యాన్ని కనబరిచింది. అల్ట్రా-ప్రీమియం విభాగంలో బెస్ట్ కెమెరా ఫోన్ కోసం జరిగిన ఈ పోరులో యాపిల్ మరోసారి తన పట్టును నిరూపించుకుంది.
డీఎక్సోమార్క్ నిర్వహించిన సమగ్ర పరీక్షల్లో ఇమేజ్ క్యాప్చర్, వీడియో రికార్డింగ్, జూమ్, ఎక్స్‌పోజర్, ఆటోఫోకస్ వంటి కీలక అంశాలను పరిగణనలోకి తీసుకున్నారు. ఈ బెంచ్‌మార్కింగ్ వెబ్‌సైట్ ప్రకారం, ఐఫోన్ 17 ప్రో కలర్ అక్యూరసీ మరియు స్థిరమైన ఎక్స్‌పోజర్‌లో అద్భుతమైన పనితీరును కనబరిచింది. ముఖ్యంగా వీడియో క్వాలిటీ విషయంలో యాపిల్‌కు సాటిలేదని తేలింది. డైనమిక్ రేంజ్, సబ్జెక్ట్ ట్రాకింగ్‌లో ఐఫోన్ చూపించిన పర్ఫెక్షన్ కారణంగా దీనికి అత్యధిక స్కోరు లభించింది. ఫోటో తీసిన ప్రతిసారీ రిజల్ట్ చాలా ప్రిడిక్టబుల్‌గా, అంటే మనం ఊహించిన దానికంటే బెటర్ గా రావడం ఐఫోన్ ప్లస్ పాయింట్ అని చెప్పవచ్చు.
మరోవైపు, శామ్‌సంగ్ గెలాక్సీ S26 అల్ట్రా తన 50 మెగాపిక్సెల్ పెరిస్కోప్ లెన్స్, 10 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్‌తో జూమింగ్ ఫీచర్లలో అదరగొట్టింది. దూరాన ఉన్న వస్తువులను క్లియర్ గా చూపడంలో శామ్‌సంగ్ టెక్నాలజీకి మంచి మార్కులు పడ్డాయి. అయితే, అన్ని సందర్భాల్లోనూ ఒకే రకమైన క్వాలిటీని అందించడంలో ఈ ఫోన్ కొంచెం తడబడినట్లు డీఎక్సోమార్క్ గుర్తించింది. కొన్ని సీన్లలో శామ్‌సంగ్ సాఫ్ట్‌వేర్ అగ్రెసివ్ షార్పెనింగ్, కాంట్రాస్ట్‌ను అప్లై చేయడం వల్ల ఫోటోలు సహజత్వాన్ని కోల్పోయినట్లు రిపోర్ట్స్ చెబుతున్నాయి. రియలిస్టిక్ లుక్ కంటే కూడా ఎడిటింగ్ చేసిన ఫీల్ ఎక్కువగా రావడం శామ్‌సంగ్‌కు మైనస్‌గా మారింది.
స్కోర్ల విషయానికి వస్తే, శామ్‌సంగ్ గెలాక్సీ S26 అల్ట్రా 157 పాయింట్లు సాధించింది. ఇది గత మోడల్ S25 అల్ట్రా (151 పాయింట్లు) కంటే మెరుగైనదే అయినప్పటికీ, ఐఫోన్ 17 ప్రో సాధించిన 168 పాయింట్ల దరిదాపుల్లో కూడా లేదు. ఇక్కడ అసలు ట్విస్ట్ ఏంటంటే, ఈ రేటింగ్స్‌లో శామ్‌సంగ్ తన లేటెస్ట్ ఫ్లాగ్‌షిప్‌తో కూడా పాత మోడల్స్ అయిన ఐఫోన్ 16 ప్రో మాక్స్ (161 పాయింట్లు), గూగుల్ పిక్సెల్ 10 ప్రో ఎక్స్‌ఎల్ (163 పాయింట్లు) కంటే వెనుకబడి పోవడం టెక్ వర్గాలను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. కేవలం మెగాపిక్సెల్స్ సంఖ్య పెంచడం వల్ల మాత్రమే కెమెరా క్వాలిటీ పెరగదని ఈ ఫలితాలు నిరూపిస్తున్నాయి.
మొత్తానికి చూస్తే, ఫోటోగ్రఫీలో నాచురల్ కలర్స్, కన్సిస్టెన్సీ కోరుకునే వారికి ఐఫోన్ 17 ప్రో ఒక వరంలా మారింది. శామ్‌సంగ్ జూమింగ్, హై-రిజల్యూషన్ విషయంలో తనదైన ముద్ర వేసినప్పటికీ, ఓవరాల్ ఎక్స్ పీరియన్స్ లో యాపిల్ తన క్రేజ్‌ను నిలబెట్టుకుంది. సోషల్ మీడియాలో పోస్ట్ చేసేందుకు ఇన్ స్టాంట్ గా మంచి ఫోటోలు కావాలనుకునే ఈ జనరేషన్ కు ఐఫోన్ ఇచ్చే అవుట్ పుట్ పక్కాగా సెట్ అవుతుంది. టెక్నాలజీ ఎంత పెరిగినా, ఆ టెక్నాలజీని యూజర్ కు ఎంత కంఫర్ట్ గా, క్వాలిటీగా అందిస్తున్నామనే విషయంలో యాపిల్ తన విన్నర్ సీటును పదిలం చేసుకుంది.
ప్రకటన
ప్రకటన