కెమెరా ప్రపంచానికి కొత్త రాజు.. 200MP కెమెరాతో షియోమీ 17 ఆల్ట్రా లాంచ్.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లాకే..!

చైనాకు చెందిన టెక్ దిగ్గజం షియోమీ తన మోస్ట్ పవర్‌ఫుల్ ఫ్లాగ్‌షిప్ హ్యాండ్‌సెట్ 'షియోమీ 17 ఆల్ట్రా'ను భారత మార్కెట్లోకి గ్రాండ్‌గా లాంచ్ చేసింది.

కెమెరా ప్రపంచానికి కొత్త రాజు.. 200MP కెమెరాతో షియోమీ 17 ఆల్ట్రా లాంచ్.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లాకే..!

Photo Credit: xiaomi

200MP కెమెరాతో షియోమీ 17 ఆల్ట్రా లాంచ్

ముఖ్యాంశాలు
  • 200MP కెమెరాతో షియోమీ 17 ఆల్ట్రా
  • ధర రూ. 1,39,999గా నిర్ణయించారు
  • 200 మెగాపిక్సెల్ టెలిఫోటో కెమెరా ఇందులో ఉంది
ప్రకటన

స్మార్ట్‌ఫోన్ లవర్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న క్షణం వచ్చేసింది. చైనాకు చెందిన టెక్ దిగ్గజం షియోమీ తన మోస్ట్ పవర్‌ఫుల్ ఫ్లాగ్‌షిప్ హ్యాండ్‌సెట్ 'షియోమీ 17 ఆల్ట్రా'ను భారత మార్కెట్లోకి గ్రాండ్‌గా లాంచ్ చేసింది. ఫిబ్రవరి చివరలో బార్సిలోనాలో జరిగిన గ్లోబల్ ఈవెంట్‌లో మెరిసిన ఈ ఫోన్, ఇప్పుడు ఇండియాలోకి అడుగుపెట్టింది. స్టాండర్డ్ షియోమీ 17 మోడల్‌తో పాటు వచ్చిన ఈ ఆల్ట్రా వెర్షన్, మొబైల్ టెక్నాలజీలో సరికొత్త బెంచ్‌మార్క్‌లను సెట్ చేస్తోంది. ముఖ్యంగా ఫొటోగ్రఫీని ఇష్టపడే కుర్రాళ్లకు ఈ ఫోన్ ఒక డ్రీమ్ గ్యాడ్జెట్ అని చెప్పాలి.

ఈ ఫోన్ ధర విషయానికి వస్తే, 16GB ర్యామ్,  512GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 1,39,999గా నిర్ణయించారు. అయితే లాంచ్ ఆఫర్ కింద ఎస్‌బిఐ క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు రూ.10 వేలు భారీ డిస్కౌంట్ లభిస్తోంది. అంతేకాదు, మార్చి 13 నుండి 17 మధ్య కొనుగోలు చేసే ఎర్లీ బర్డ్ కస్టమర్లకు దాదాపు ఇరవై వేల విలువైన ప్రొఫెషనల్ ఫొటోగ్రఫీ కిట్ ప్రో ఉచితంగా లభిస్తుంది. మార్చి 18 నుండి అమెజాన్, షియోమీ వెబ్‌సైట్లలో ఈ ఫోన్ బ్లాక్ అండ్ వైట్ రంగుల్లో అందుబాటులోకి రానుంది.

డిజైన్,  డిస్‌ప్లే పరంగా షియోమీ 17 ఆల్ట్రా ఒక విజువల్ ఫీస్ట్ అని చెప్పవచ్చు. ఇందులో 6.9 అంగుళాల భారీ హైపర్ ఆర్‌జిబి ఓఎల్ఈడి డిస్‌ప్లేను అమర్చారు, ఇది 120Hz రిఫ్రెష్ రేట్‌తో స్మూత్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది. దాదాపు 3,500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో ఎండలో కూడా స్క్రీన్ క్లియర్‌గా కనిపిస్తుంది. వెట్ టచ్ టెక్నాలజీ వల్ల చేతులు తడిగా ఉన్నా ఫోన్ వాడటంలో ఎలాంటి ఇబ్బంది ఉండదు. షీల్డ్ గ్లాస్ 3.0 రక్షణ , ఐ-సేఫ్ సర్టిఫికేషన్లు ఉండటం వల్ల యూజర్ల కళ్లకు, ఫోన్ స్క్రీన్‌కు పూర్తి భద్రత లభిస్తుంది.

పర్ఫార్మెన్స్ విషయంలో ఈ ఫోన్ ఒక బీస్ట్ లాంటిది. క్వాల్కమ్ నుంచి వచ్చిన లేటెస్ట్ 3ఎన్ఎమ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 చిప్‌సెట్ ఇందులో ఉంది. ఇది 4.6GHz గరిష్ట స్పీడ్‌తో టాస్క్‌లను చిటికెలో పూర్తి చేస్తుంది. గేమింగ్, మల్టీటాస్కింగ్ కోసం 16GB పవర్‌ఫుల్ ర్యామ్, అడ్రినో జిపియు తోడయ్యాయి. ఆండ్రాయిడ్ 16 ఆధారిత హైపర్ ఓఎస్ 3 పై నడిచే ఈ హ్యాండ్‌సెట్, ఏఐ ఫీచర్లతో స్మార్ట్‌గా పనిచేస్తుంది. ఐపి68 రేటింగ్ ఉండటం వల్ల దుమ్ము, నీటి నుండి ఫోన్‌కు రక్షణ ఉంటుంది.

కెమెరా గురించి ఎంత చెప్పినా తక్కువే, ఎందుకంటే లైకా భాగస్వామ్యంతో వచ్చిన ఈ ఫోన్ ప్రపంచంలోనే మొదటిసారిగా 1-ఇంచ్ లోఫిక్ సెన్సార్‌ను కలిగి ఉంది. 50 మెగాపిక్సెల్ మెయిన్ షూటర్ తో పాటు, ఏకంగా 200 మెగాపిక్సెల్ టెలిఫోటో కెమెరా ఇందులో ఉంది, ఇది 120x డిజిటల్ జూమ్ సామర్థ్యాన్ని అందిస్తుంది. ఇవి కాకుండా 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా కూడా ఉంది. సెల్ఫీల కోసం ముందు భాగంలో 50 మెగాపిక్సెల్ కెమెరా ఇచ్చారు. ఈ కెమెరాతో 8K క్వాలిటీలో వీడియోలను రికార్డ్ చేసుకోవచ్చు, ఇది కంటెంట్ క్రియేటర్లకు బెస్ట్ ఆప్షన్.

బ్యాటరీ, కనెక్టివిటీ విషయానికి వస్తే, ఇందులో 6,000mAh భారీ బ్యాటరీని అమర్చారు. దీనికి 90W వైర్డ్ చార్జింగ్,  50W వైర్లెస్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉంది. సెక్యూరిటీ కోసం అల్ట్రాసోనిక్ ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్,  ఏఐ ఫేస్ లాక్ ఇచ్చారు. వైఫై 7, బ్లూటూత్ 6 వంటి అత్యాధునిక కనెక్టివిటీ ఫీచర్లు ఇందులో ఉన్నాయి. మొత్తానికి ప్రీమియం లుక్,  అదిరిపోయే స్పెసిఫికేషన్లతో వచ్చిన ఈ ఫోన్, ఇండియన్ మార్కెట్లో ఐఫోన్, శామ్సంగ్ వంటి బ్రాండ్లకు గట్టి పోటీ ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది.

సంబంధిత వార్తలు

#తాజా కథనాలు
  1. OnePlus 11 5G : ఫ్లిప్‌కార్ట్‌లో క్రేజీ ఆఫర్.. సగం ధరకే లగ్జరీ వన్‌ప్లస్ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్!
  2. Wagon R Flex Fuel : ఇంజన్ మార్చేశారు.. సరికొత్త సెన్సార్లు పెట్టారు.. వ్యాగన్ ఆర్ ఫ్లెక్స్ ఫ్యూయల్ స్పెషాలిటీస్ ఇవే
  3. Ugly Story : ఓటీటీలోకి వచ్చేసిన అవికా గోర్ అగ్లీ స్టోరీ.. గుండెల్ని పిండేసే ఎమోషనల్ డ్రామా
  4. Instagram Reels : మెట్రో సిటీలకే కాదు.. పల్లెటూరి జనాభాకు కూడా ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ పిచ్చి ముదిరింది
  5. Xiaomi TV : భారత్‌లోకి షావోమి సరికొత్త టీవీ FX మినీ ఎల్‌ఈడీ సిరీస్.. ఫీచర్లు చూస్తే ఫిదా అవ్వాల్సిందే
  6. Smartphone Comparison : భారత మార్కెట్లో మొబైల్స్ వార్.. షావోమి 17టి, వివో X200T, శాంసంగ్ గెలాక్సీ A57లలో ఏది బెస్ట్?
  7. Xiaomi 17T : భారత్‌లోకి షావోమి 17టి ఎంట్రీ.. లైకా కెమెరా, పవర్‌ఫుల్ ఫీచర్లతో సరికొత్త ఫ్లాగ్‌షిప్ ఫోన్
  8. WhatsApp : వోడాఫోన్ ఐడియా, మెటా సరికొత్త విప్లవం.. ఇక ఓటీపీ, పాస్‌వర్డ్ లేకుండానే వాట్సాప్ లాగిన్
  9. Solar Storm Alert : సూర్యుడిపై వరుస పేలుళ్లు.. భూమి వైపు దూసుకొస్తున్న సౌర తుఫాను
  10. Motorola Edge 70 Pro+ : భారత మార్కెట్లోకి మోటోరోలా కొత్త ఫ్లాగ్‌షిప్ ఫోన్.. అదిరిపోయే ఫీచర్లతో ఎడ్జ్ 70 ప్రో+ లాంచ్
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »