ఎడిట్స్ వినియోగదారులు కూడా ఆర్ట్‌ఫిషియల్ ఇంటిలిజెన్స్ (AI) సామర్థ్యాన్ని సద్వినియోగం చేసుకోవడం ద్వారా ఇది యానిమేషన్‌లను అందించేందుకు సహాయపడుతుంది.
Photo Credit: App Store
Instagram ప్రకారం, ఎటువంటి వాటర్‌మార్క్ లేకుండా వీడియోలను ఎడిట్ చేయడానికి సృష్టికర్తలను ఎడిట్స్ యాప్ అనుమతిస్తుంది
ప్రస్తుతం సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ అందిస్తోన్న ఫీచర్స్‌తోపాటుగా క్రియేటర్స్‌కు దానికంటే ఎక్కువ సృజనాత్మకతను జోడించి, వీడియోలను ఎడిట్ చేసుకునేందుకు ఇన్‌స్టాగ్రామ్ ఓ సరికొత్త యాప్‌ను పరిచయం చేసింది. ఎడిట్స్ అని పిలువబడే ఇది మొబైల్ వీడియో ఎడిటింగ్ సొల్యూషన్‌గా పని చేస్తుంది. ఇందులో హై క్వాలటీ గల వీడియో క్యాప్చర్, డ్రాఫ్ట్‌లు, వీడియోల కోసం ప్రత్యేక ట్యాబ్, రిజల్యూషన్, ఫ్రేమ్ రేట్, డైనమిక్ రేంజ్ కోసం కెమెరా సెట్టింగ్‌లు వంటి క్రియేటీవ్ టూల్ సూట్ ఉంటుంది. ఎడిట్స్ వినియోగదారులు కూడా ఆర్ట్‌ఫిషియల్ ఇంటిలిజెన్స్ (AI) సామర్థ్యాన్ని సద్వినియోగం చేసుకోవడం ద్వారా ఇది యానిమేషన్‌లను అందించేందుకు సహాయపడుతుంది.
ఇన్‌స్టాగ్రామ్ హెడ్ ఆడమ్ మోస్సేరి థ్రెడ్స్‌లో చేసిన ఓ పోస్ట్‌లో ఈ కొత్త ఎడిట్స్ యాప్ రాక గురించి వెల్లడించారు. ఈ పోస్ట్ ప్రకారం.. తమ స్మార్ట్ ఫోన్‌లలో వీడియోలను క్రియేట్ చేసేందుకు ఆసక్తి ఉన్న వినియోగదారుల కోసం ఈ అప్లికేషన్‌ను పరిచయం చేస్తున్నట్లు తెలిపారు. అంతే కాదు, హై- క్వాలిటీ ఫుటేజ్‌ను క్యాప్చూర్ చేయడం ద్వారా ఇది ఎడిటింగ్ ప్రక్రియను మరింత సులభతరం చేస్తుందని అభిప్రాయపడ్డారు.
ఈ ఎడిట్స్ యాప్‌తో క్రియేటర్‌లు ఎలాంటి వాటర్‌మార్క్ లేకుండా వీడియోలను ఎక్స్‌పోర్ట్ చేయవచ్చు. 1080pలో ఇన్‌స్టాగ్రామ్‌తో సహా ఇతర ప్లాట్‌ఫారమ్‌లలో వాటిని పంచుకోవచ్చు. అంతేకాదు, కొత్త ట్యాబ్ వారి అన్ని డ్రాఫ్ట్‌లు, వీడియోలను ఒకే చోట ట్రాక్ చేయడానికి వీలు కల్పిస్తుంది. యాప్ స్టోర్‌లో iOS ప్రీ-ఆర్డర్ కోసం ఎడిట్స్ యాప్ ప్రస్తుతం అందుబాటులో ఉందని, త్వరలో ఆండ్రాయిడ్‌లో వస్తుందని ఇన్‌స్టాగ్రామ్ స్పష్టం చేసింది. అలాగే, ఇది వచ్చే నెలలో డౌన్‌లోడ్ చేసుకునేందుకు అందుబాటులో రావచ్చని భావిస్తున్నారు.
ఎడిట్స్ యాప్ సింగిల్-ఫ్రేమ్ ఖచ్చితత్వంతో వీడియోలను ఎడిట్ చేసేందుకు క్రియేటీవ్ టూల్స్‌తో వస్తోంది. ఇందులో క్రియేటర్‌లు ఫ్రేమ్ రేట్, రిజల్యూషన్, డైనమిక్ రేంజ్ కోసం వారి కెమెరా సెట్టింగ్‌లను సర్దుబాటు చేసుకోవచ్చు. ఇది Instagramతో పోలిస్తే మెరుగైన ఫ్లాష్, జూమ్ కంట్రోల్‌ను కలిగి ఉంటుంది. అంతేకాదు, AI యానిమేషన్‌తో సహా AI సామర్థ్యాలను కూడా అందిస్తోంది. అలాగే, యాప్ వినియోగదారులు గ్రీన్ స్క్రీన్‌తో వారి బ్యాంగ్రౌండ్ మార్చడానికి లేదా వీడియో ఓవర్‌లేను అటాచ్ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది.
ఈ యాప్‌లో ఎడిట్ చేసుకునేందుకు క్రియేటర్‌లు అనేక టైప్‌ఫేస్‌లు, సౌండ్-వాయిస్ ఎఫెక్ట్‌లు, వీడియోల కోసం ఫిల్టర్‌లు, స్టిక్కర్‌లు వంటివి ఎంపిక చేసుకోవచ్చు. అలాగే, ఇది బ్యాగ్రౌండ్ సౌండ్‌ను తొలగించడానికి, స్పష్టమైన ఆడియోను అందించడానికి ఆడియోను మరింత మెరుగుపరుస్తుందని ఇన్‌స్టాగ్రామ్ పేర్కొంది. యాప్ ద్వారా క్రియేట్ చేయబడిన, షేర్ చేయబడిన వీడియోలను లైవ్ ఇన్‌సైట్స్ డాష్‌బోర్డ్‌తో ట్రాక్ చేయవచ్చు. అంతేకాదు, ఇది క్రియేటర్‌లకు ఫాలోవర్స్, నాన్ ఫాలోవర్స్‌ను ఎంగేజ్ చేసేందుకు సహాయ పడుతుంది. అలాగే, స్కిప్ రేట్‌ను నియంత్రణలో ఉంచేందుకు ఉపయోగపడుతుంది.
ప్రకటన
ప్రకటన
Blue Origin Joins SpaceX in Orbital Booster Reuse Era With New Glenn’s Successful Launch and Landing
AI-Assisted Study Finds No Evidence of Liquid Water in Mars’ Seasonal Dark Streaks