ఇక గ్రూప్ కాల్స్ విషయానికి వస్తే, అవి WhatsApp Webలో ఎప్పుడు ప్రారంభమవుతాయన్న దానిపై ఇంకా స్పష్టత లేదు.

ఈ ఫీచర్ అభివృద్ధిపై మాట్లాడిన WABetaInfo, దాదాపు ఏడాది కాలంగా మెటా దీనిపై పని చేస్తోందని తెలిపింది. ఈ కాలంలో, డెస్క్‌టాప్ యాప్స్‌లో ఉన్న అనుభవానికి తగ్గట్టుగా, వెబ్ వెర్షన్‌లో కూడా కాలింగ్ ఫీచర్‌ను మెరుగుపరిచినట్లు పేర్కొంది. ప్రస్తుత దశలో, వ్యక్తిగత చాట్స్‌లో వాయిస్, వీడియో కాల్స్ చేసే సౌలభ్యాన్ని యూజర్లకు అందిస్తున్నారు.

ఇక గ్రూప్ కాల్స్ విషయానికి వస్తే, అవి WhatsApp Webలో ఎప్పుడు ప్రారంభమవుతాయన్న దానిపై ఇంకా స్పష్టత లేదు.

Photo Credit: Reuters

వాట్సాప్ వెబ్‌లో వీడియో మరియు వాయిస్ కాల్ సపోర్ట్ ప్రస్తుతం వన్-టు-వన్ చాట్‌లకు పరిమితం చేయబడింది.

ముఖ్యాంశాలు
  • WhatsApp Web బీటా యూజర్లకు వన్-టు-వన్ వాయిస్, వీడియో కాల్స్ సపోర్ట్ ప్రార
  • డెస్క్‌టాప్ యాప్ ఇన్‌స్టాల్ చేయకుండానే బ్రౌజర్‌లోనే కాల్ చేసే అవకాశం
  • ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్, స్క్రీన్ షేర్ వంటి ఫీచర్లకు మద్దతు
ప్రకటన

కొద్ది వారాల క్రితం WABetaInfo ఒక కీలక విషయాన్ని వెల్లడించింది. ఇప్పటివరకు వాట్సాప్ అధికారిక డెస్క్‌టాప్ యాప్స్‌కే పరిమితమైన వాయిస్, వీడియో కాలింగ్ ఫీచర్‌ను, త్వరలోనే WhatsApp Webలో కూడా అందుబాటులోకి తీసుకురావడానికి మెటా సిద్ధమవుతోందని ఆ రిపోర్ట్‌లో పేర్కొంది. తాజాగా, అదే వెబ్‌సైట్ మరో అప్‌డేట్‌ను వెల్లడించింది. ఈ ఫీచర్ ఇప్పుడు వాట్సాప్ బీటా ప్రోగ్రామ్‌లో ఉన్న యూజర్లకు దశలవారీగా అందుబాటులోకి వస్తోందని తెలిపింది. అయితే, మొదటిగా ఇది గ్రూప్ చాట్స్‌కు కాకుండా, ఒక్కొక్కరి మధ్య జరిగే వన్-టు-వన్ చాట్స్‌లోనే ప్రారంభమవుతోంది.

దీంతో, వెబ్ బ్రౌజర్ ద్వారానే వాట్సాప్ ఉపయోగించే వారికి ఇది ఒక కీలక మార్పుగా చెప్పుకోవచ్చు.

ఇప్పటికైతే గ్రూప్ చాట్స్‌లో వాయిస్, వీడియో కాల్స్ ఇంకా డెవలప్‌మెంట్ దశలోనే ఉన్నప్పటికీ, WhatsApp Web బీటా టెస్టర్లకు వన్-టు-వన్ కాలింగ్ ఫీచర్ క్రమంగా యాక్టివ్ అవుతోంది. అంటే, ఇకపై డెస్క్‌టాప్ యాప్‌ను ఇన్‌స్టాల్ చేయకుండానే, బ్రౌజర్‌లోనే కాల్స్ చేయగలిగే అవకాశం లభిస్తోంది.

ఈ ఫీచర్ అభివృద్ధిపై మాట్లాడిన WABetaInfo, దాదాపు ఏడాది కాలంగా మెటా దీనిపై పని చేస్తోందని తెలిపింది. ఈ కాలంలో, డెస్క్‌టాప్ యాప్స్‌లో ఉన్న అనుభవానికి తగ్గట్టుగా, వెబ్ వెర్షన్‌లో కూడా కాలింగ్ ఫీచర్‌ను మెరుగుపరిచినట్లు పేర్కొంది. ప్రస్తుత దశలో, వ్యక్తిగత చాట్స్‌లో వాయిస్, వీడియో కాల్స్ చేసే సౌలభ్యాన్ని యూజర్లకు అందిస్తున్నారు. యూజర్లు సాధారణంగా చాట్ ఓపెన్ చేసి, అందులో కనిపించే కాల్ బటన్‌పై క్లిక్ చేస్తే సరిపోతుంది.

భద్రత పరంగా కూడా ఎలాంటి రాజీ పడలేదని రిపోర్ట్ స్పష్టం చేస్తోంది. iOSలో ఉన్నట్లే, WhatsApp Web ద్వారా చేసే కాల్స్ కూడా Signal ప్రోటోకాల్ ఆధారంగా ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్‌తో సురక్షితంగా ఉంటాయి. అదేవిధంగా, వీడియో కాల్స్ సమయంలో స్క్రీన్ షేర్ చేసే అవకాశం కూడా అందుబాటులో ఉండనుందని తెలిపింది.

ప్రస్తుతం ఈ ఫీచర్ WhatsApp Web బీటా ప్రోగ్రామ్‌లో ఉన్న యూజర్లకే పరిమితమైనప్పటికీ, రాబోయే కొన్ని వారాల్లో దీన్ని మరింత మంది యూజర్లకు విస్తరించనుందని WABetaInfo పేర్కొంది. బీటా ప్రోగ్రామ్‌కు బయట ఉన్నవారికీ త్వరలోనే ఈ సదుపాయం అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని స్పష్టం చేసింది.

ఇక గ్రూప్ కాల్స్ విషయానికి వస్తే, అవి WhatsApp Webలో ఎప్పుడు ప్రారంభమవుతాయన్న దానిపై ఇంకా స్పష్టత లేదు. అయితే, అవి అందుబాటులోకి వచ్చిన తర్వాత, ఒకేసారి 32 మంది వరకు వాయిస్ లేదా వీడియో కాల్స్‌లో పాల్గొనే అవకాశం ఉంటుందని అంచనా. అలాగే కాల్ లింక్స్, షెడ్యూల్డ్ కాల్స్ వంటి ఫీచర్లు కూడా అందించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

WhatsApp Web బీటా ప్రోగ్రామ్‌లో చేరాలనుకునే వారు, సెట్టింగ్స్‌లోకి వెళ్లి “Help and Feedback” ఆప్షన్‌ను ఓపెన్ చేసి, అక్కడ ఉన్న “Join the Beta” టాగుల్‌ను ఆన్ చేయాలి. వెంటనే కాలింగ్ ఫీచర్ యాక్టివ్ అవుతుందన్న గ్యారంటీ లేకపోయినా, భవిష్యత్తులో రాబోయే కొత్త ఫీచర్లను ముందుగా ఉపయోగించే అవకాశాన్ని ఈ బీటా ప్రోగ్రామ్ అందిస్తుంది.
 

ప్రకటన

ప్రకటన

#తాజా కథనాలు
  1. 80th Independence Day: 80వ స్వాతంత్ర్య వేడుకల్లో వందేమాతరం 150 ఏళ్ల పండగ.. ప్రత్యక్ష ప్రసారం ఎక్కడ చూడాలంటే?
  2. iphone Ultra Launch: యాపిల్ ప్రేమికులకు బిగ్ సర్ ప్రైజ్.. మార్కెట్లోకి ఫస్ట్ మడత ఐఫోన్
  3. iQOO 16: ఐకూ లవర్స్‌కు మైండ్ బ్లాకింగ్ న్యూస్.. 8,500 mAh బ్యాటరీతో ఐకూ 16..కళ్లు చెదిరే ఫీచర్లు
  4. Vivo X500 Pro Max: వివో లవర్స్‌కు గుడ్ న్యూస్.. త్వరలోనే వివో X500 ఫ్లాగ్‌షిప్ సిరీస్ రాక
  5. iQOO Buds: ఐకూ లవర్లకు గుడ్ న్యూస్.. ఆగస్టు 20న మార్కెట్లోకి అదిరిపోయే బడ్స్
  6. Oppo Find X9s: ఒప్పో ఫైండ్ X9s పై ఏకంగా రూ.60,000 తగ్గిన ధర.. భారీ డిస్కౌంట్ ఆఫర్ చూస్తే షాకే
  7. BSNL: ప్రైవేట్ సంస్థలకు షాకిచ్చేలా బీఎస్ఎన్ఎల్ మాస్టర్ ప్లాన్.. రూ.77,000 కోట్ల పెట్టుబడితో 5జీ సేవలు
  8. iQOO Neo 11 Ultra: ఐకూ నుంచి పవర్ ఫుల్ స్మార్ట్‌ఫోన్..9100mAh బ్యాటరీ.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లాకే
  9. Google Pixel 11 Pro xl vs Vivo x300 Ultra vs Samsung Galaxy s26 Ultra: ఏది కొనడం బెస్ట్ ?
  10. Tecno Pova 8 Pro 5G: బ్యాక్ సైడ్ క్రేజీ డిస్‌ప్లే.. 6500mAh భారీ బ్యాటరీతో టెక్నో కొత్త 5జీ ఫోన్ రచ్చ
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »