పేటీఎం సోలార్ సౌండ్‌బాక్స్‌కు పైన సోలార్ ప్యానెల్‌తో వస్తుండగా, రెండవ బ్యాటరీ విద్యుత్తుకు సపోర్ట్ చేస్తుంది. సోలార్ ఛార్జ్ అయిపోయినప్పుడు బ్యాకప్ ఆప్షన్‌గా ఇది పని చేస్తుంది.
Photo Credit: Paytm
Paytm Solar Soundbox supports 4G connectivity
పేటీఎం సోలార్ సౌండ్‌బాక్స్‌ను పేటీఎం బ్రాండ్‌ను కలిగి ఉన్న One97 కమ్యూనికేషన్స్ పరిచయం చేసింది. ఈ మర్చెంట్-ఫోకస్డ్ డివైజ్ సోలార్ ఎనర్జీకి సపోర్ట్ చేస్తుంది. విద్యుత్తుతో పనిచేసే పరికరాలకు ప్రత్యామ్నాయంగా దీనిని అందిస్తున్నారు. ఈ డివైజ్ చిన్న దుకాణ యజమానులు, వ్యాపారులను లక్ష్యంగా చేసుకుని, చెల్లింపులు సులభతరం చేసేందుకు సహాయపడుతుందని కంపెనీ తెలిపింది. ఇది డ్యూయల్ బ్యాటరీ వ్యవస్థను కలిగి ఉంటుంది. పైన సోలార్ ప్యానెల్‌తో వస్తుండగా, రెండవ బ్యాటరీ విద్యుత్తుకు సపోర్ట్ చేస్తుంది. సోలార్ ఛార్జ్ అయిపోయినప్పుడు బ్యాకప్ ఆప్షన్‌గా ఇది పని చేస్తుంది.
తక్కువ ఖర్చుతో కూడిన ఇంధన ప్రత్యామ్నాయంతోపాటు పర్యావరణ అనుకూలతను దృష్టిలో ఉంచుకుని ఈ డివైజ్‌ను పరిచయం చేస్తున్నట్లు పేర్కొంది. పేటీఎం సోలార్ సౌండ్‌బాక్స్ గ్రామీణ, మారుమూల ప్రాంతాలతోపాటు విద్యుత్ కొరతను ఎదుర్కొంటున్న ప్రాంతాలలోని చిన్న దుకాణదారులు, వ్యాపారులు, కార్ట్ వెండర్స్ లాంటి వారిని లక్ష్యంగా చేసుకుంది.
ఈ పేటీఎం సోలార్ సౌండ్‌బాక్స్ డివైజ్ పైభాగంలో సోలార్ ప్యానెల్‌ను కలిగి ఉంటుంది. ఇది డివైజ్ సూర్యకాంతిలో స్వయంగా ఛార్జ్ చేయడానికి వీలు కల్పిస్తోంది. ప్రైమరీ బ్యాటరీ సోలార్ ఎనర్జీకి సపోర్ట్ చేయగా, విద్యుత్తుతో నడిచే రెండవ బ్యాటరీ కూడా అటాచ్ చేయబడి ఉంటుంది. సోలార్ బ్యాటరీని 2-3 గంటల సూర్యరశ్మితో ఛార్జ్ చేయవచ్చు. ఇది రోజు మొత్తం బ్యాటరీ లైఫ్‌ను అందిస్తుందని కంపెనీ చెబుతోంది.
డివైజ్‌లోని విద్యుత్తుతో నడిచే బ్యాటరీ ఒక్కసారి ఛార్జ్ చేస్తే 10 రోజుల వరకు పనిచేస్తుందని కంపెనీ స్పష్టం చేసింది. అలాగే, సౌండ్‌బాక్స్‌లో Paytm QR కోడ్ కూడా ఉంది. దీనిని స్కాన్ చేసి యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI)తోపాటు Rupay క్రెడిట్ కార్డ్ చెల్లింపులు చేసుకోవచ్చు. దీంతోపాటు పేటీఎం సోలార్ సౌండ్‌బాక్స్ వ్యాపారికి కస్టమర్‌లు చేసిన చెల్లింపులను నమోదు చేసేందుకు 4G కనెక్టివిటీకి సపోర్ట్ చేస్తుంది. చెల్లింపు నిర్ధారణ గురించి వ్యాపారికి తెలియజేసే 3W స్పీకర్ కూడా ఇందులో ఉంది. ఈ నోటిఫికేషన్‌లను డివైజ్ సపోర్ట్ చేసే 11 భాషలలో దేనిలోనైనా సెట్ చేసుకోవచ్చు.
సరసమైన ఈ Paytm సోలార్ సౌండ్‌బాక్స్ ప్రారంభించడం చిన్న వ్యాపారాలను, ముఖ్యంగా మారుమూల ప్రాంతాలను మరింత శక్తివంతం చేయడంలో ప్రశంసనీయమైన అడుగుగా ఆర్థికశాఖ సహాయక మంత్రి పంకజ్ చౌదరి అభిప్రాయపడ్డారు. అలాగే, ఇది స్వావలంబన, పర్యావరణ స్పృహ కలిగిన భారతదేశ దార్శనికతను కూడా ప్రతిబింబిస్తుందన్నారు.
గతేడాది ఏటీఎం తన వినియోగదారుల యాప్‌లో UPI స్టేట్‌మెంట్ డౌన్‌లోడ్ అని పిలిచే కొత్త ఫీచర్‌ను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఈ ఫీచర్‌తో, వినియోగదారులు తమ లావాదేవీల హిస్టరీ రికార్డులను కలిగి ఉన్న డీటేల్డ్ స్టేట్‌మెంట్‌ను రూపొందించవచ్చు. అంతే కాదు, సందర్భానుసారంగా నెలల వారీగా లేదా మొత్తం ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వివరాలను కూడా డౌన్‌లోడ్ చేసుకునే అవకాశం ఉంది.
ప్రకటన
ప్రకటన
WhatsApp Working on 'Strict Account Settings' Feature to Protect Users From Cyberattacks: Report
Samsung Galaxy XR Headset Will Reportedly Launch in Additional Markets in 2026
Moto G57 Power With 7,000mAh Battery Launched Alongside Moto G57: Price, Specifications