కంపెనీ ప్రకటించిన వివరాల ప్రకారం, December 15 నుండి భారత్‌లో Apple Fitness+ సేవ ప్రారంభమవుతుంది. 2020లో కేవలం ఆరు దేశాల్లో ప్రారంభమైన ఈ సేవను తరువాత 21 దేశాలకు విస్తరించారు. తాజా దశలో మొత్తం 49 ప్రాంతాల్లో ఇది అవైలబుల్ అవుతుంది.
Photo Credit: Apple
ఆరోగ్యం మరియు వెల్నెస్ సేవను మొదట 2020 లో ప్రవేశపెట్టారు
Apple తన ఆరోగ్య మరియు ఫిట్నెస్ సబ్‌స్క్రిప్షన్ ప్లాట్‌ఫార్మ్ Apple Fitness+ ను ఈ నెలలో భారతదేశంలో అందుబాటులోకి తీసుకురానుంది. ఈ సేవ ద్వారా యూజర్లు iPhone ఉపయోగించి ట్రైనర్‌లతో వచ్చే వర్కౌట్ వీడియోలను చూడవచ్చు, రియల్‌టైమ్ మెట్రిక్స్‌ను ట్రాక్ చేయవచ్చు, లక్ష్యాలు పూర్తి చేసినప్పుడు రివార్డులు పొందవచ్చు. ఈ విస్తరణ తర్వాత Fitness+ మొత్తం 49 దేశాలు మరియు ప్రాంతాల్లో అందుబాటులో ఉంటుంది. కంపెనీ ప్రకటించిన వివరాల ప్రకారం, December 15 నుండి భారత్‌లో Apple Fitness+ సేవ ప్రారంభమవుతుంది. 2020లో కేవలం ఆరు దేశాల్లో ప్రారంభమైన ఈ సేవను తరువాత 21 దేశాలకు విస్తరించారు. తాజా దశలో మొత్తం 49 ప్రాంతాల్లో ఇది అవైలబుల్ అవుతుంది.
భారత్‌లో Fitness+ నెలసరి సబ్‌స్క్రిప్షన్ ధర రూ.149, వార్షిక ధర రూ.999. ఒక సబ్‌స్క్రిప్షన్‌ను ఐదుగురు కుటుంబ సభ్యులతో పంచుకోవచ్చు. కొత్తగా Apple Watch, iPhone, iPad, Apple TV, AirPods Pro 3, Powerbeats Pro 2 కొనుగోలు చేసే వారికి డివైస్ తాజా సాఫ్ట్‌వేర్ నడపగలిగితే మూడు నెలల ఉచిత Fitness+ సభ్యత్వం లభిస్తుంది.
భారతీయ యూజర్లు Fitness+ లో స్ట్రెంత్, యోగ, HIIT, పైలెట్స్, డాన్స్, సైక్లింగ్, కిక్ బాక్సింగ్, మెడిటేషన్ వంటి 12 కంటే ఎక్కువ రకాల వర్కౌట్ సెషన్‌లను యాక్సెస్ చేయగలరు. ప్రతి సెషన్ 5 నిమిషాల చిన్న టైమర్ నుంచి 45 నిమిషాల వరకు ఉంటుంది. Fitness+ ను iPhone తో ఉపయోగించవచ్చు. Apple Watch ఉపయోగిస్తే హార్ట్ రేట్, బర్న్ అయిన క్యాలరీస్, ఇతర యాక్టివిటీలు వంటి మెట్రిక్స్‌ను మరింత క్లియర్‌గా చూడవచ్చు. AirPods Pro 3 ఉంటే ఆడియో అనుభవం ఇంకా మెరుగ్గా ఉంటుంది.
పర్సనలైజ్డ్ ప్లాన్‌లు, మ్యూజిక్ ఇంటిగ్రేషన్ కూడా అందుబాటులో ఉంది. యూజర్‌కు ఇష్టమైన వర్కౌట్ రకాలు, డ్యూరేషన్, ట్రైనర్‌లు, మ్యూజిక్ వంటి వివరాలు ఆధారంగా Fitness+ వ్యక్తిగత ఫిట్నెస్ ప్లాన్‌ను కూడా సృష్టిస్తుంది.
సర్వీస్‌లో Apple Music ఇంటిగ్రేషన్ ఉంది కాబట్టి, యూజర్లు వర్కౌట్స్ చేస్తూ Hip-Hop, R&B, Latin Grooves వంటి ఎనర్జెటిక్ సాంగ్స్‌ను వినవచ్చు. ఇది భారత్‌తో పాటు చిలీ, హాంగ్ కాంగ్, నెదర్లాండ్స్, నార్వే, ఫిలిప్పీన్స్, పోలాండ్, సింగపూర్, స్వీడన్, తైవాన్, వియత్నంతో సహా 20కి పైగా ప్రాంతాల్లో కూడా Apple Fitness+ డిసెంబర్ 15న ప్రారంభం కానుంది.
భారత మార్కెట్‌లో Apple Fitness+ అందుబాటులోకి రావడంతో, ఇంట్లోనే ప్రొఫెషనల్ ఫిట్నెస్ అనుభవాన్ని కోరుకునే యూజర్లకు ఇది మరింత సౌకర్యవంతమైన ఎంపికగా మారనుంది.
ప్రకటన
ప్రకటన